- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధార పూజలు గురించి రిషీకి చెప్పిన గౌతమ్.. వసుకు రిషీ వీడియో కాల్?
Guppedantha Manasu: వసుధార పూజలు గురించి రిషీకి చెప్పిన గౌతమ్.. వసుకు రిషీ వీడియో కాల్?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే గౌతమ్ (Goutham) రిషి కి బొట్టు పెడతాడు. రిషి (Rishi) పెద్దమ్మకు నేనంటే చాలా ప్రేమ నాకోసం గుడికి వెళ్లి వచ్చింది అని అంటాడు. ఆ క్రమంలో గౌతమ్ రిషి కి ప్రేమగా అన్నం పెడతాడు. అది గమనించిన మహేంద్ర చాలా థ్యాంక్స్ గౌతమ్ అని మనసులో అనుకుంటాడు.
ఆ తర్వాత గౌతమ్ (Gotham) రిషి ఫోన్ నుంచి వసుకు వీడియో కాల్ చేసి రిషి (Rishi) బొట్టు పెట్టుకున్నాడు అని తెలిసేలా చూపిస్తాడు. అది గమనించిన వసు ఎంతో సంతోషపడుతుంది. ఇక రిషి నిజంగానే నాకు బొట్టు పెద్దమ్మ పంపించిందా.. లేక ఇంకెవరైనా అని అడుగుతాడు. గౌతమ్ చెప్పడానికి సంకోచిస్తూ ఉంటాడు.
దాంతో రిషి (Rishi) గుడికి వెళ్లి బొట్టు తెచ్చింది వసు అని గ్రహించు కుంటాడు. ఇక ఆ తరువాత రిషి వసు (Vasu) చున్నీ పట్టుకొని తనకు తానే వసు గురించి ప్రశ్నలు వేసుకుంటాడు. మరో వైపు వసు రిషి ఫోటో చూసుకుంటూ.. సారీ సార్ మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదంటూ ఫీల్ అవుతూ ఉంటుంది.
ఇక రిషి (Rishi) రికవరీ అయిన తర్వాత మొదటిసారి కాలేజీకి వస్తున్న సందర్భంగా.. అందరిని ఫ్లవర్స్ తో వెల్కమ్ చెప్పే ప్లాన్ చేస్తోంది. అందరూ రెడ్ రొసెస్ పట్టుకుంటే.. వసు (Vasu) మాత్రం స్పెషల్ గా ఎల్లో రోజ్ ను పట్టుకుంటుంది. ఇక రిషి ఇలా ఫ్లవర్స్ ఇచ్చే బదులు.. మనిషికి ఒక మొక్క నాటితే మంచిది కదా అంటాడు.
ఇక ఒక స్టూడెంట్.. వసుధర (Vasudhara) మాకు ఆ ఐడియా కూడా ఇచ్చింది సార్ అని అంటుంది. ఇక వసు చేతిలో ఎల్లో గులాబీ చూసిన రిషి (Rishi) దాన్ని ఫ్రెండ్షిప్ సంకేతంగా భావిస్తాడు. ఇక రిషి పట్టించుకోకుండా వెళుతుండగా.. వసు చేతిలో గులాబీ పువ్వు రిషి బ్లాజర్ సైడ్ పాకెట్ లో అనుకోకుండా పడుతుంది.
ఒక రిషి తన కేబిన్ లోకి వెళ్లిన తర్వాత తన టేబుల్ పైన రోజా పువ్వులను వసు పైన కోపంతో విసిరికొడతాడు. ఈలోపు అక్కడకు మహేంద్ర వచ్చి.. రిషి పాకెట్లో ఎల్లో గులాబీ పువ్వును చేస్తాడు. మనం ఏదైతే వద్దు అనుకుంటామో.. అది మన దగ్గరకు వస్తుంది అని మహేంద్ర అంటాడు.
ఇక మహేంద్ర (Mahendra) ఇప్పుడు ఈ ఒంటరి గులాబీని వదులుకుంటావా? అని అడుగుతాడు. లేక భద్రపరుచు ఉంటావో నీ ఇష్టం అని అంటాడు. అనుకోకుండా నా దగ్గరకు వచ్చిన ఈ గులాబీని నేను ఎందుకు వదులుకుంటాను డాడ్ అని రిషి (Rishi) అంటాడు. ఆ మాటతో మహేంద్ర ఎంతో సంతోషిస్తాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.