- Home
- Entertainment
- Guppedantha Manasu: గుప్పెడంత మనసులో అదిరిపోయే ట్విస్ట్.. జగతి, మహేంద్రలను ఒకే చోటా చూసి షాకైన గౌతమ్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసులో అదిరిపోయే ట్విస్ట్.. జగతి, మహేంద్రలను ఒకే చోటా చూసి షాకైన గౌతమ్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

రిషి (Rishi) తన పెద్దమ్మ దేవయానికి వసుధార సారీ చెప్పాలని మహేంద్ర వర్మ తో చెప్పమంటాడు. వెంటనే మహేంద్ర వర్మ షాక్ అవుతాడు. రిషి మాటల్లో పడి ఆవేశంగా వసును పొగరు అనటంతో.. వెంటనే మహేంద్రవర్మ (Mahendra varma) గతంలో రిషి ఫోన్ లో పొగరు అని చూసిన కాంటాక్ట్ నెంబర్ ని గుర్తుపట్టి పొగరు వసుధారనేనా అని అనుకుంటాడు.
ఇక రిషి మాత్రం తనతో చెబుతారా లేదా అని కోపంగా అంటుంటాడు. అప్పుడే గౌతమ్ (Gautham) వచ్చి బయటకు వెళ్దాం అంటాడు. రిషి (Rishi) తను రాను అనేసరికి వెంటనే గౌతమ్ మహేంద్ర ను రమ్మంటాడు. వసు తో మంచి కాఫీ తాగుదాం అని అంటాడు.
ఆ మాట విని రిషి ఏం జరుగుతుందో అని గౌతమ్ (Gautham) తో వెళ్లడానికి సిద్ధం అవుతాడు. ఇక మరో వైపు వసు రెస్టారెంట్ లో బిజీగా ఉంటుంది. గౌతమ్ వసు (Vasu) ను చూసి తనని పిలుస్తాడు. వసు రిషిని చూసి మురిసిపోతుంది. గౌతమ్ తనతో కాఫీ తాగాలి అని వసును నేరుగా అడుగుతాడు.
పక్కనే ఉన్న రిషి (Rishi) లోలోపల కాస్త కుళ్ళు కుంటున్నట్లుగా కనిపిస్తాడు. ఇక వసుధారా (Vasudhara) డ్యూటీ అయ్యాక కాఫీ తాగుతాను అని చెబుతుంది. కానీ రిషి సార్ వెయిట్ చేయడం కష్టమేమో అనేసరికి వెంటనే రిషి నాకు పని ఉంది అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
రిషి (Rishi) తన మనసులో రిషి సార్ ఉంటే బాగుండు అని అనుకుంటుంది. రిషి బయటికి వెళ్లి వసుధార నన్ను ఉండమనవచ్చు కదా అని కోపంతో రగిలిపోతాడు. ఇక గౌతమ్ (Gautham) అక్కడ టీ గురించి మాట్లాడటంతో అప్పుడే రిషి మళ్ళీ తిరిగి వస్తాడు. మరోవైపు మహేంద్ర వర్మ జగతితో రిషి సారీ చెప్పమన్నా విషయాన్ని చెబుతాడు.
ఇక జగతి (Jagathi) ఆ మాట వినటం తో బాధ పడుతుంది. రిషి కి నువ్వే అర్థం అయ్యేలా చెప్పు మహేంద్ర అంటూ కోరుకుంటుంది. మనసులో మహేంద్రవర్మ ఎలాగైనా వీళ్లు కలవాలి అని అనుకుంటాడు. ఇక రిషి (Rishi) తన కారులో వసును తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు.
వెనకాలే గౌతమ్ కూడా దిగుతాడు. వసు ఇంట్లో కి వెళ్దామని వసుతో (Vasu) పాటు వెళ్తుంటాడు. అప్పుడే జగతి, మహేంద్ర వర్మ డోర్ చేయటంతో మహేంద్ర వర్మ, జగతి వాళ్లని చూసి షాక్ అవుతారు. ఇక రిషి (Rishi) కూడా జగతి వాళ్ళని చూసి షాక్ అవుతారు. అంతేకాకుండా గౌతమ్ కూడా మేడమ్ దగ్గర సార్ ఉండటం ఏంటి అని అనుకుంటాడు. మొత్తానికి ఈ ట్విస్ట్ హైలెట్గా మారింది.