MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: ప్రేమగా మాట్లాడుకుంటున్న వసు,రిషి.. జగతి దంపతులకు గౌతమ్ రిక్వెస్ట్?

Guppedantha Manasu: ప్రేమగా మాట్లాడుకుంటున్న వసు,రిషి.. జగతి దంపతులకు గౌతమ్ రిక్వెస్ట్?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 2 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Nov 02 2022, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో వసుధర కాలేజీ గ్రౌండ్ లో కూర్చుని రిషి అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అలిస్తే అరవని నా రిషి సారే కదా అని సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. రిషి సార్ మంచివాడు రిషి సార్ మనసు వెన్న. అనే రిషి ని తల్చుకొని నోట్బుక్ తీసుకొని రిషి నోట్స్ లో విఆర్ అని రాసి లవ్ సింబల్ వేసి దానిని డిజైన్ చేస్తూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఆ బుక్ ని లాక్కుంటాడు. అప్పుడు రిషి బుక్ ని చూసి ఆట పట్టిస్తూ ఉండగా అప్పుడు వసు అలిగినట్టు మాట్లాడడంతో ఏంటి కోపం వచ్చిందా అలిగావా అని అనడంతో నాకు ఇవన్నీ అలవాటే కదా సార్ అని అంటాడు.
 

26

అరిచినా ప్రేమ పెరుగుతుందా అని రిషి అనగా వెంటనే వసుధర ప్రేమ ఏ విషయానికి ప్రభావితం కాదు సార్ అని ఉంటుంది. అప్పుడు రిషి వసు చేతిలో వి ఆర్ అని రాసి కింద జెంటిల్ మెన్ అని రాస్తాడు రిషి. అది చూసి వసుధార సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు రిషి నేను నిన్ను పొగరు అని పిలుస్తాను అని నీకు ఎలా తెలుసు అని అనడంతో వసుధార కొన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది. అయినా సర్ మీ మీద నాకు కోపం ఎందుకు చెప్పండి మీ కోపానికి బాధపడడం ఎప్పుడో మర్చిపోయాను అనడంతో ఎందుకు అలా అని అడుగుతాడు రిషి. 
 

36

ఇప్పుడు నా మనసు నిండా మీ మీద ప్రేమనే ఉంది అనడంతో వెంటనే రిషి ఈ మధ్యన నువ్వు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తున్నావు అని అంటాడు. వారిద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని నవ్వుతూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు మహేంద్ర జగతి జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి గౌతమ్ వస్తాడు. అప్పుడు రిషి ఎలా ఉన్నాడు అని మహేంద్ర అడగకగా చాలా బాధపడుతున్నాడు అంకుల్ ఎలా అంకుల్ ఎన్నాళ్ళు అని ఉంటారు.

46

అక్కడ వాడి బాధ ఇక్కడ మీ బాధ చూడలేకపోతున్నాను అని అంటాడు గౌతమ్. ఇప్పుడు గౌతమ్ అంకుల్ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేలా ఉంది అనడంతో వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. జరిగిందేదో జరిగింది అంకుల్ ఇప్పటికైనా అజ్ఞాతం విడి అక్కడికి వచ్చి అంకుల్ అని గౌతమ్ ఎంత చెప్పినా కూడా మహేంద్ర మాత్రం మౌనంగా ఉంటారు. అప్పుడు గౌతమ్ చేతులు జోడించి వాడి బాధను చూడలేకపోతున్నాను అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

56

మరొకవైపు వసుధర, రిషి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండగా వసుధార భోజనం టైం అయింది అని అర్థంతో ఆకలిగా లేదు అని అంటాడు రిషి.. ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. రిషి కోసం భోజనం తీసుకొని వస్తుంది దేవయాని. ఇప్పుడు దేవయాని దొంగ ప్రేమను చూపిస్తూ రిషి ని నమ్మిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని రిషికి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది.
 

66

అప్పుడు దేవయాని వారికి భోజనం వడ్డించి వసుధర కి వార్నింగ్ ఇస్తూ ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తోంది. మరొకవైపు జగతి మహేంద్ర కు కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు వారిద్దరూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి రిసీవ్ ఒక్కడే కష్టపడుతూ ఉంటాడు రిషి ఒంటరి అయిపోయాడు అని బాధపడుతూ ఉంటారు. మరొకవైపు వసుధార, పుష్ప తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Recommended image3
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved