- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుకు ప్రపోజ్ చేయడానికి సిద్దమైన గౌతమ్.. లైబ్రేరిలో లాక్ అయినా వసు, రిషీ!
Guppedantha Manasu: వసుకు ప్రపోజ్ చేయడానికి సిద్దమైన గౌతమ్.. లైబ్రేరిలో లాక్ అయినా వసు, రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో వసుకు రిషి ఈ విధంగా మెసేజ్ పెడతాడు. ' పిలవగానే మా ఇంటికి మీ ఇద్దరూ వచ్చినందుకు థాంక్స్.. మా ఇంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి'. అని మెసేజ్ పెడుతాడు.
ఇక ఆ మెసేజ్ కు ఏమని రిప్లై ఇవ్వాలని వసుధార (Vasudhara) ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపు రిషి గౌతమ్ (Goutham) ల మధ్య కొంత సేపు ఫ్రెండ్లీ వార్ జరుగుతుంది. ఆ క్రమంలో గౌతమ్, రిషికి ఒక కవిత కూడా వినిపిస్తాడు. ఈలోపు వసు గుడ్ నైట్ అని రెప్లై ఇస్తుంది.
ఇక ఆ తర్వాత గౌతమ్ గీసిన వసుధార బొమ్మను తీసుకొని గౌతమ్, వసు కు ప్రపోజ్ చేయడానికి రిషి (Rishi) కారులో బయలు దేరుతాడు. అలా కారులో వస్తున్న క్రమంలో గౌతమ్ (Goutham) వసు బొమ్మ గీసిన చార్ట్ ను రిషి తెలియకుండా హైడ్ చేసి తీసుకు వస్తాడు. కానీ రిషి ఆ విషయం గమనించి గౌతమ్ ను కారులో నుంచి కిందకు దించి ఆ చార్ట్ ను ఆఫీస్ కు సంబంధించిన చార్ట్ అని భావించి కారు వెనుక సీట్లో వేస్తాడు.
కానీ గౌతమ్ ఆ చార్ట్ ను రిషి (Rishi) కి తెలియకుండా తీసుకొని యధావిధిగా కరు ఎక్కేస్తాడు. ఆ తర్వాత వసు క్లాస్ లో లెక్కలు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా రిషి అక్కడికి వెళ్లి వసు (Vasu) పక్కన కూర్చొని లెక్కలు నేర్పిస్తాడు.ఈ క్రమంలో రిషి, వసు కు తగులుతూ ఉండగా వసుధార ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది.
మరోవైపు గౌతమ్ (Goutham) ఒక దగ్గర వసుధరా కు ప్రపోజ్ చేయడానికి రెడీ గా ఉంటాడు. ఆ తర్వాత రిషి (Rishi) , వసులు లైబ్రరీకి వెళ్లగా అక్కడ అనుకోకుండా ఎవరో లైబ్రరీని లాక్ చేస్తారు. దాంతో వాళ్ళు ఇద్దరు అక్కడే ఇరుక్కు పోతారు. దాంతో రిషి బాగా టెన్షన్ పడతాడు.
వసు (Vasu) మాత్రం ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉంటుంది. రిషి అది చూసి ఆశ్చర్యం గా ఫీల్ అవుతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి. వసుకు గౌతమ్ ప్రపోజ్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.