- Home
- Entertainment
- నా అన్వేషణ కు గరికపాటి దిమ్మతిరిగే కౌంటర్, నాకూ అభిమానులున్నారని.. నరసింహారావు స్ట్రాంగ్ వార్నింగ్
నా అన్వేషణ కు గరికపాటి దిమ్మతిరిగే కౌంటర్, నాకూ అభిమానులున్నారని.. నరసింహారావు స్ట్రాంగ్ వార్నింగ్
Naa Anveshana Vs Garikipati :పేరు బయటకు చెప్పకుండానే.. నా అన్వేషణ యూట్యూబర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు..ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

సోషల్ మీడియాను కుదిపేస్తున్న హాట్ టాపిక్..
ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న విషయాలలో.. శివాజీ కామెంట్లు.. అనసూయ రిప్లైలతో పాటు నా అన్వేషణ కూడా చేరాడు. ఈమ్యాటర్ లో అనవసరంగా దూరి.. మొదటికే మోసం తెచ్చుకున్నాడు నా అన్వేషణ యూట్యూబర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అన్వేష్ పేరు మారుమోగిపోతోంది. అతను మాట్లాడిన తీరు అందరికి చిరాకు తెప్పిస్తుంది. గతంలో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ కు స్పందించే క్రమంలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా హిందూ దేవుళ్లపై, అలాగే ప్రముఖ ప్రవచకుడు గరికపాటి నరసింహా రావుపై చేసిన కామెంట్స్ అయితే.. దుమ్ముదుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యాయి.
అన్వేష్ కు ఎదురు దెబ్బలు..
అన్వేష్ ఇప్పటి వరకూ ఏం మాట్లాడినా..ఎన్నిబూతులు మాట్లాడినా..చూస్తూ,వింటూ వచ్చిన జనాలు.. ఇప్పుడు అతన్ని అసహ్యించుకుంటున్నారు. దేనికైనా లిమిట్ ఉంటుంది.. ఇప్పటివరకు అన్వేష్‌ను అభిమానించి, ఆయన యూట్యూబ్ ఛానల్‌ను ఫాలో అవుతున్న వారే ఇప్పుడు ఆయన ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన తీరు, వాడిన పదాలును ఖండిస్తున్నారు. అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు.. కానీ దానికి ఓ పద్దతి ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ వ్యాఖ్యల వల్ల నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్ లక్షల్లో సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. రెండు మూడు రోజుల్లోనే దాదాపు 5 లక్షల వరకూ అభిమానులను అన్వేష్ తన నోటి దురుసుతో పోగొట్టుకున్నాడు.
అన్వేష్ కు గరికపాటి మాస్ కౌంటర్..
అన్వేష్ చేసిన కామెంట్స్ లో హిందూ దేవతలను, సమాజంలో గౌరవనీయ స్థానంలో ఉన్న గరికపాటి నరసింహా రావును అవమానించే విధంగా ఉండటంతో.. వ్యవహారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి వివాదాలపై ఎప్పుడూ.. స్పందించని గరికపాటి నరసింహా రావు ఈసారి మాత్రం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “నేరస్తుడికి శిక్ష విధించడం కన్నా, సమాజం అతడిని ఛీత్కరించినప్పుడే మార్పు వస్తుంది. ఇలాంటప్పుడే మాట్లాడాలి.. మనకెందుకులే అని వదిలేయకూడదు.. మరీ ముఖ్యంగా.. ఎలాంటి మచ్చలేని వ్యక్తులపై నోరు పారేసుకోవడం, బురద జల్లడం మంచిది కాదు. నను అభిమానించే వారు ఇలాంటి ప్రవర్తనను అసలు సహించరు.. అలాంటి వారికి నా అభిమానులే రేవెట్టేస్తారు.. ఇప్పుడు అదే జరుగుతుంది కూడా.. ఈ పరిస్థితుల్లో ధర్మానికి సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు . సభ్యత కలిగిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ గళాన్ని వినిపించాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలలో ఎక్కడా కూడా అన్వేష్ పేరు ప్రస్తావించకుండా, పరోక్షంగానే అదరిపోయేలా వార్నింగ్ ఇచ్చారు గరికపాటి.
గరికపాటికి కోట్లలో అభిమానులు..
అష్టావధానిగా పేరు పొందిన గరికపాటి నరసింహా రావు ప్రవచనాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి గుర్తింపు ఉంది. ఎన్నో సన్మానాలు కూడా పొందారు. ఇలా ఉన్నతస్థాయి గుర్తింపుఉన్న వ్యక్తిపై నోటికొచ్చినట్టు మాట్లాడిన అన్వేష్ పై తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఫారెన్ లో ఉన్న అతను ఇండియాకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేలా రంగం సిద్దం అయ్యిందని సమాచారం.
కొత్త రాగం అందుకున్న యూట్యూబర్..
నటుడు శివాజీ మాటలకు కౌంటర్ ఇవ్వాలంటే.. అక్కడితో ఆగి ఉంటే బాగుండేది. కానీ ఎక్కవమంది చూడాలననఆరాటంలో నోరు జారి.. సీతమ్మవారిపై, గరికపాటిపై నా అన్వేష్ చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీశాయి. ప్యూస్ మాట తరువాత.. ఉన్న సబ్‌స్క్రైబర్లను కూడా అన్వేష్ కోల్పోవాల్సి వచ్చింది. దాంతో.. దిగివచ్చిన అన్వేష్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. క్షమాపణలు చెపుతూ.. పలు వీడియోలు విడుదల చేసినప్పటికీ, వాటికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక దేవుడు నాకు కలలో వచ్చాడంటూ.. మరో ప్రయత్నం కూడాచేశాడు అన్వేష్... కానీ అది కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

