బాలకృష్ణలో ఆ యాంగిల్ అస్సలు ఊహించలేదు.. మనసులోని మాట చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్.!
Actress Indraja: నటి ఇంద్రజ తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లను, ఆర్థిక ఇబ్బందుల వల్ల మలయాళ ఇండస్ట్రీ వైపు వెళ్లిన అంశాన్ని, అలాగే హీరో బాలకృష్ణతో కలిసి పని చేసిన అంశంపైనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బాలకృష్ణలో ఆ యాంగిల్..
టాలీవుడ్ నటి ఇంద్రజ తన కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్లు, ఆర్ధిక ఇబ్బందులను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే హీరో బాలకృష్ణతో కలిసి పని చేసిన అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ హైలీ ఎనర్జిటిక్, జోవియల్, ఫ్రెండ్లీ పర్సన్ అని ఆమె తెలిపింది. ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టమని.. పెద్ద స్టార్ అయినప్పటికీ.. డౌన్ టూ ఎర్త్‌గా ఉంటారని ఇంద్రజ తెలిపింది.
ఎక్కడైనా అవి ఉంటాయి..
కమిట్మెంట్స్ లాంటివి కేవలం ఇండస్ట్రీలో మాత్రమే ఉండదని.. ప్రతీ చోటా జరుగుతాయని నటి ఇంద్రజ తెలిపింది. 'ఎక్కడ పని చేసినా ఒక మహిళకు.. ముఖ్యంగా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నవారికి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి మరీ ఇబ్బందికరంగా మారినప్పుడు తప్ప' అని ఆమె స్పష్టం చేసింది.
మంచి ఆఫర్లు రాలేదు..
1999 తర్వాత తెలుగులో తనకు మంచి ఆఫర్లు రాలేదని.. చిన్న బడ్జెట్ సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చిందని ఇంద్రజ గుర్తు చేసుకుంది. అప్పట్లో మంచి సినిమాలు రాకపోయినా.. తాను రిగ్రెట్ అవ్వలేదని, ఎందుకంటే తాను ఎవరినీ అప్రోచ్ కాలేదని.. పెద్దగా కాంటాక్ట్స్ కూడా లేవని ఆమె చెప్పింది.
ఆ సమయంలో కష్టాలు
అయితే 1999-2000 మధ్య కాలంలో వ్యక్తిగతంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇంద్రజ వెల్లడించింది. తన తల్లి ఓ కార్డియాక్ పేషెంట్, హార్ట్‌లో వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. కుటుంబం మొత్తం ఆర్థికంగా తనపై ఆధారపడటంతో, తాను బాధపడుతూ కూర్చోలేదని, ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానని వివరించింది. అదే సమయంలో, 'సొగసు చూడతరమా' చిత్రాన్ని పనామా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూసిన మలయాళ దర్శకుడు సిబి మలయిల్ తనను సంప్రదించారని తెలిపింది.
మలయాళ ఇండస్ట్రీకి అలా..
మలయాళ ఇండస్ట్రీకి వెళ్లాలని తాను ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని.. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని ఇంద్రజ తెలిపింది. మొదట మమ్ముట్టితో 'గాడ్ మ్యాన్' చిత్రంలో, ఆ తర్వాత మోహన్‌లాల్‌తో 'ఉస్తాద్'లో, సురేష్ గోపితో షాజీ కైలాష్ దర్శకత్వంలో 'ఎఫ్.ఐ.ఆర్' చిత్రంలో నటించినట్లు చెప్పింది. మలయాళంలోని స్టార్ హీరోలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంది.

