- Home
- Entertainment
- Disaster Heroes: దారుణంగా పడిపోయిన ఈ హీరోల కెరీర్ గ్రాఫ్... ఆడియన్స్ ఇంట్రస్ట్ కూడా తగ్గిందా?
Disaster Heroes: దారుణంగా పడిపోయిన ఈ హీరోల కెరీర్ గ్రాఫ్... ఆడియన్స్ ఇంట్రస్ట్ కూడా తగ్గిందా?
Disaster Heroes: టాలీవుడ్ లో యంగ్ హీరోల పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోలుగా పేరు తెచ్చుకున్న యంగ్, మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఒక్క హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తోంది.

Disaster Heroes
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరస విజయాలతో దూసుకుపోయిన యంగ్ హీరోలు ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. నితిన్ నుంచి విజయ్ దేవరకొండ వరకు.. రామ్ నుంచి వరుణ్ తేజ్ వరకు ఇప్పుడు అందరిదీ అదే పరిస్థితి. రాను రాను ఈ హీరోల సినిమా అంటే.. ఆడియన్స్ లో కూడా ఆసక్తి తగ్గిపోతుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఆ డిజాస్టర్ హీరోలు ఎవరెవరో చూద్దామా...
నితిన్...
హీరో నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలం అవుతోంది. భీష్మ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. ‘మాచర్ల నియోజనకవర్గం’, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, తమ్ముడు, రాబిన్ హుడ్ వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా విఫలమయ్యాయి. సరైన కథలు ఎంచుకోకపోవడమే.. ఈ డిజాస్టర్ కి కారణం అని చెప్పొచ్చు. కథలో కొత్తదనం లేకపోవడం, నితిన్ యాక్టింగ్ లోనూ ఎలాంటి కొత్త దనం కనిపించకపోవడం ఈ సినిమాల ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం.
విజయ్ దేవరకొండ..
అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదనే చెప్పాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ గా నిలిచింది. సమంతతో కలిసి నటించిన ఖుషీ కాస్త పర్వాలేదనిపించినా.. ఫ్యామిలీ స్టార్ మళ్లీ డిజాస్టర్ అయ్యింది. కింగ్డమ్ కూడా ఊహించినంత హిట్ కాలేకపోయింది. మళ్లీ విజయ్ లైన్ లోకి రావాలంటే.. సరైన హిట్ పడాల్సిందే.
అఖిల్ అక్కినేని : 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తప్ప చెప్పుకోవడానికి అఖిల్ కెరీర్ లో మరో హిట్ లేదని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడు..
వరుణ్ తేజ్ : ప్రయోగాలు చేయడంలో ముందుండే వరుణ్, గత కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్నాడు. 'గని', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా'.. ఇలా అన్నీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.
రామ్ పోతినేని..
ఇస్మార్ట్ శంకర్ తరవాత మళ్లీ రామ్ పోతినేనికి సరైన హిట్ పడలేదు. రెడ్ , ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యియి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రా కింగ్ తాలుకా మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
గోపీచంద్ : మ్యాచో స్టార్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 'లౌక్యం' తర్వాత ఆయనకు ఒక క్లీన్ హిట్ లేదు. 'పక్కా కమర్షియల్', 'రామబాణం', 'భీమా' వంటి సినిమాలు ఆయన మార్కెట్‌ను బాగా తగ్గించేశాయి.
సాయి ధరమ్ తేజ్ : 'విరూపాక్ష'తో ఒక భారీ హిట్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత మెగా మేనల్లుడు ఆ సక్సెస్‌ను కొనసాగించలేకపోయాడు. హెల్త్ బ్రేక్ తర్వాత వస్తున్నా ఆయన ప్రాజెక్టుల వేగం తగ్గింది.
ఈ హీరోల ఫెయిల్యూర్స్ కి కారణం..
కథల ఎంపికలో వైఫల్యం: పాత కాలపు కమర్షియల్ ఫార్ములా కథలనే నమ్ముకోవడం పెద్ద మైనస్ అవుతోంది. ప్రేక్షకులు ఇప్పుడు 'కొత్తదనం' కోరుకుంటున్నారు. రూట్ మార్చకపోతే ఇదే ఫార్ములా కంటిన్యూ అవుతుంది. కథతో పాటు మంచి డైరెక్టర్ ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఇక.. ఇప్పుడు ఈ హీరోలు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు పోటీ కేవలం మన హీరోలతోనే కాదు, పక్క రాష్ట్రాల సినిమాలను కూడా మించేలా ఉండాలి. ఎందుకంటే.. పక్క స్టేట్ హీరోలు ఇక్కడ కూడా వరస హిట్లు కొడుతున్నారు. వాళ్లను ఎదుర్కోవాలి అంేట.. మంచి గ్లోబల్ కంటెంట్ ఎంచుకోవాలి. ఒక్క సరైన కథ పడితే చాలు.. మళ్ళీ వీరంతా ఫామ్‌లోకి రావడం ఖాయం.

