MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: ఒక హీరో మా ఇంటికొచ్చి నన్ను హగ్‌ చేసుకోవడం అదే మొదటిసారి.. ప్రభాస్‌కి షాకిచ్చిన స్టార్‌ ఎవరంటే?

Prabhas: ఒక హీరో మా ఇంటికొచ్చి నన్ను హగ్‌ చేసుకోవడం అదే మొదటిసారి.. ప్రభాస్‌కి షాకిచ్చిన స్టార్‌ ఎవరంటే?

Prabhas: ప్రభాస్‌ ఇంటికి మొదటిసారి ఒక హీరో వెళ్లి ఆయన్ని విష్‌ చేశాడట. సినిమా సక్సెస్‌ గురించి అభినందించాడట. ఆ సమయంలో జరిగిన సంఘటనని ప్రభాస్‌ పంచుకున్నారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 04 2026, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా లెక్కలు మార్చిన హీరో ప్రభాస్‌
Image Credit : Asianet News

ఇండియా లెక్కలు మార్చిన హీరో ప్రభాస్‌

ప్రభాస్‌.. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమానే కాదు, భారతీయ సినిమా లెక్కలు మార్చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌ `ఈశ్వర్‌` మూవీతో హీరోగా మారాడు. `వర్షం` మూవీతో బ్రేక్‌ అందుకున్నాడు. ఆ తర్వాత `ఛత్రపతి`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్`, `డార్లింగ్‌`, `మిర్చి`, `బాహుబలి` చిత్రాలతో తన రేంజ్‌ని పెంచుకున్నారు. `సలార్‌`, `కల్కి 2898 ఏడీ`లతో అదరగొట్టిన ప్రభాస్‌ ఇప్పుడు పలు భారీ సినిమాలతో రాబోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రభాస్‌ ఇంటికొచ్చిన స్టార్‌ హీరో
Image Credit : Asianet News

ప్రభాస్‌ ఇంటికొచ్చిన స్టార్‌ హీరో

ఈ క్రమంలో ప్రభాస్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తెలిసింది. ఒక హీరో మొదటిసారి తన ఇంటికొచ్చి తనని సర్‌ప్రైజ్‌ చేసిన సంఘటనని ప్రభాస్‌ పంచుకున్నారు. అది తనకు షాక్‌గా అనిపించిందట. ఒక సినిమా రిలీజ్‌ టైమ్‌లో, పాజిటివ్‌ టాక్‌ రావడంతో, రిలీజ్‌ అయిన మొదటి రోజే ఒక స్టార్‌ హీరో తన ఇంటికి వచ్చాడట. అది తనని షాక్‌కి గురి చేసిందని, ఆ సంఘటన నమ్మలేకపోయానని తెలిపారు ప్రభాస్‌.

Related Articles

Related image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Related image2
Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌
35
ప్రభాస్‌ ఇమేజ్‌ మార్చిన మిస్టర్‌ పర్‌ఫెక్ట్
Image Credit : Asianet News

ప్రభాస్‌ ఇమేజ్‌ మార్చిన మిస్టర్‌ పర్‌ఫెక్ట్

మరి ఆ హీరో ఎవరు? ఆ కథేంటి? అనేది చూస్తే, ప్రభాస్‌ వరుస మాస్‌ కమర్షియల్‌ చిత్రాల తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేశారు. అదే `మిస్టర్‌ పర్‌ఫెక్ట్`. ఈ మూవీకి దశరత్‌ దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ మూవీ పెద్ది హిట్‌ అయ్యింది. ప్రభాస్‌ ఇమేజ్‌ని మార్చిందని చెప్పొచ్చు. అంతకు ముందే `డార్లింగ్‌` క్లాస్‌ హిట్‌. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ చిత్రం వచ్చింది. ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది పెద్ద డౌట్‌. ప్రభాస్‌ టెన్షన్‌ పడ్డాడట. ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారని బాగా కంగారు పడ్డాడట.

45
ప్రభాస్‌ ఇంటికొచ్చిన మొదటి హీరో ప్రభాస్‌
Image Credit : Allu Arjun/ Instagram

ప్రభాస్‌ ఇంటికొచ్చిన మొదటి హీరో ప్రభాస్‌

సినిమా రిలీజ్‌ రోజు ఆయన బయటకు కూడా రాలేదు. అలాంటి సమయంలో ఊహించని అతిథి తన ఇంటి తలుపు తట్టాడు. ఆయన ఎవరో కాదు, అల్లు అర్జున్‌. ప్రభాస్‌కి మంచి స్నేహితుడనే విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌ అప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. కానీ మొదటి రోజు ఇలా ఏ హీరో తన ఇంటికొచ్చి అభినందించలేదుట. కానీ మొదటిసారి బన్నీ తన ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయాడట. ఇది నిజమేనా అని కాసేపు నమ్మలేకపోయాడట. సినిమా సూపర్‌ డార్లింగ్‌. మూవీ నెమ్మదిగా ఎక్కుతుందని చెప్పాడట. అవును తాను కూడా అదే అనుకున్నాను, కానీ నువ్వు ఇలా రావడమే నమ్మలేకపోతున్నా అని చెప్పాడట ప్రభాస్‌. అంతేకాదు మీ వైఫ్‌కి నచ్చిందా అడిగి తెలుసుకున్నాడట. ఆమెకి నచ్చింది? ఏడ్చింది కూడా అంటూ చెప్పాడట. అప్పటికి బన్నీకి మ్యారేజ్‌ అయి నెల రోజులే అయ్యింది. అల్లు స్నేహారెడ్డికి కూడా బాగా నచ్చింద. ఆమె కన్నీళ్లు పెట్టుకుందని చెప్పడంతో ప్రభాస్‌ ఊపిరిపీల్చుకున్నాడట. అలా తన కెరీర్‌లో ఒక హీరో తన ఇంటికి రావడం అదే మొదటిసారి అని ప్రభాస్‌ చెప్పడం విశేషం. ఈ సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

55
ఫౌజీ, స్పిరిట్‌లతో ప్రభాస్‌ బిజీ
Image Credit : Asianet News

ఫౌజీ, స్పిరిట్‌లతో ప్రభాస్‌ బిజీ

ప్రభాస్‌ ప్రస్తుతం `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. `ఫౌజీ` హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతుంది. ఆర్మీ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది. చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీ రూపొందుతుంది. డిమ్రి తృప్తి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి5న ఇది విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌
Recommended image2
Chiranjeevi: చిరంజీవి క్రేజీ మూవీ నుంచి తప్పుకున్న బాలయ్య హీరోయిన్ ? అసలేం జరిగింది..
Recommended image3
Divorce: నాలుగేళ్ళ క్రితం పెళ్లి, అప్పుడే విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రముఖ నటి..42 ఏళ్ళ వయసులో ఇలా
Related Stories
Recommended image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved