Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • చిరంజీవితో సినిమా అంటే ఇప్పటికీ టెన్షనే.. సినిమాలు చేయకపోవడంపై నిజాలు బయటపెట్టిన బ్రహ్మానందం

చిరంజీవితో సినిమా అంటే ఇప్పటికీ టెన్షనే.. సినిమాలు చేయకపోవడంపై నిజాలు బయటపెట్టిన బ్రహ్మానందం

బ్రహ్మానందం తాను సినిమాలు చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవితో సినిమా చేయాలంటే ఇప్పటికీ టెన్షన్‌ ఉంటుందంటూ షాకిచ్చారు.   

Aithagoni Raju | Published : Jan 16 2025, 09:36 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల సినిమాలు కూడా చేయడం లేదు. అడపాదడపా కనిపిస్తున్నారు తప్పితే తన మార్క్ కామెడీ లేదు. అలాంటి పాత్రలు చేయడం లేదు. `రంగమార్తాండ`లో సీరియస్‌ రోల్‌లో నటించి కన్నీళ్లు పెట్టించారు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించారు, కానీ ఆయన పాత్రలకు పెద్దగా ప్రయారిటీ లేదు. 
 

26
Asianet Image

ఈ నేపథ్యంలో తాజాగా స్పందించారు బ్రహ్మానందం. ఎక్కువగా సినిమాలు చేయకోపోవడానికి కారణం? ఆఫర్లు రావడం లేదా? మీరు చేయడం లేదా? అనే ప్రశ్నకి ఆయన రియాక్ట్ అయ్యారు. తాను నాలభై ఏళ్లల్లో ఎన్నో రకాల పాత్రలు చేశానని, అదే చేస్తే బోర్‌ కొడుతుంది.

ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే, అదే కామెడీ చేస్తే, బ్రహ్మానందం బాగానే చేస్తున్నాడు కానీ, నవ్వు రావడం లేదురా అని అనుకుంటారు. గతంలో కమెడియన్ల విషయంలో ఇలాంటి మాటలు విన్నాం. ఇప్పుడు తన విషయంలో కూడా నిరూపితమైందన్నారు. 

36
Asianet Image

`మన గురించి మనం తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్లిపోకూడదని, అదే సమయంలో ఏజ్‌ ఫ్యాక్టర్‌ని కూడా చూసుకోవాలన్నారు. ఏజ్‌ని కూడా అంగీకరించాలి, అది గమనించకుండా నేను యంగ్ అని పోతే వర్కౌట్ కాదు, ఇంతకు ముంద చేసినంత యాక్టీవ్‌గా కూడా నేను చేయలేకపోతున్నాననే విషయం నాకు తెలుసు.

నన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలని సెల్ఫ్‌ క్రిటిసిజమ్‌తో తీసుకున్న నిర్ణయం ఇది. అంతేకానీ సినిమాల్లో నేను చేస్తానంటే వేషాలు లేక కాదు, ఇవ్వక కాదు, చేయలేక కాదు, ఇలాంటి టైమ్‌లో ఎంత జాగ్రత్త చేసినా కూడా దొరికిపోతాం. అందుకే సెల్ఫ్‌ క్రిటిసిజమ్‌ చాలా ముఖ్యం` అని తెలిపారు బ్రహ్మానందం. 
 

46
Asianet Image

అదే సమయంలో మరో ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని ఏళ్లు ఉన్నా, ప్రతి సినిమా కొత్తగానే ఫీలవ్వాలని, అంతే జాగ్రత్తగా చేయాలని తెలిపారు బ్రహ్మీ. ఈ క్రమంలో చిరంజీవి ప్రస్తావన తెస్తూ. చిరంజీవితో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను,

కానీ రేపు కొత్త సినిమాలో ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే తెలియకుండానే బెరుకు స్టార్ట్ అవుతుంది. షాట్‌ అయిపోయిన తర్వాత అందరు బాగుందంటే ఓకే, అప్పటి వరకు ఓ టెన్షన్‌ ఉంటూనే ఉంటుందన్నారు బ్రహ్మానందం. 
read more: ఊరమాస్‌ కాంబోని సెట్‌ చేసిన బాలకృష్ణ.. ఈసారి బోయపాటి సినిమాని మించి !

56
Asianet Image

తన కొడుకుతో కలిసి `బ్రహ్మానందం` అనే సినిమాలో నటించారు. ఇందులో గౌతమ్‌కి తాత పాత్రలో బ్రహ్మీ కనిపిస్తుండటం విశేషం. ఈ మూవీ టీజర్‌ కార్యక్రమంలో బ్రహ్మానందం అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో గౌతమ్‌ కెరీర్‌కి గురించి చెబుతూ, తన పలుకుబడి ఉపయోగించి పెద్ద సినిమాలు చేయోచ్చు కదా అనే ప్రశ్నకి స్పందిస్తూ,

 తనకు తానే ఆ పలుకుబడి ఉపయోగించుకోలేదని తెలిపారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ అవకాశాలు ఇవ్వాలని అడగలేదని, అయితే తాను తోపు అని అంటే అది అహంకారం అవుతుందని, కానీ అడిగే అవకాశం దేవుడు తనకు కల్పించలేదన్నారు బ్రహ్మా. 
 

66
Asianet Image

ఇక్కడ ఎవరి పలుకుబడి వాడితే ఆఫర్లు వస్తాయి, పెద్ద హీరో అయిపోతారనేది బ్రమ అని చెప్పారు. మన వైపు లైట్‌ ఉన్నప్పుడు మనం వెలుగుతాం. దీంతో మనమే హీరో, మనకే తిరుగులేదు అని భావిస్తే వాడి పని అయిపోయినట్టే, ఒక్కొక్కరికి ఒక్కో టైమ్‌ వస్తుంది. ఎవరి టైమ్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏదైనా రాసి పెట్టి ఉండాలి, మనం ఏదో చేస్తే ఏదో అయిపోరు అంటూ వాస్తవాలు చెప్పారు బ్రహ్మానందం.

అన్నింటికి డెస్టినే సమాధానం చెబుతుందన్నారు. మనం అనుకుంటే ఏది అయిపోదని, జరగొద్దు అనుకుంటే ఏది ఆగదు అని, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నారు. ఇక ఇందులోనే వెన్నెల కిశోర్‌పై ప్రశంసలు కురిపించారు. తన లెగసీని వెన్నెల కిశోర్‌ కంటిన్యూ చేస్తున్నాడని, అతని విషయంలో గర్వంగా ఉందన్నారు బ్రహ్మీ. 

read  more: పవన్‌ కళ్యాణ్‌ కి ఫస్ట్ టైమ్‌ చిరంజీవి వార్నింగ్‌, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఆ పనిచేయలేదు

also read: ఆడవాళ్లు శోభన్‌ బాబు అంటే పడిచచ్చేది అందుకే, సీనియర్‌ హీరోలకు సాధ్యం కాలేదు, కానీ వెంకీ ఆ నాడి పట్టుకున్నాడు!

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories