MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌ కి ఫస్ట్ టైమ్‌ చిరంజీవి వార్నింగ్‌, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఆ పనిచేయలేదు

పవన్‌ కళ్యాణ్‌ కి ఫస్ట్ టైమ్‌ చిరంజీవి వార్నింగ్‌, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఆ పనిచేయలేదు

పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య చిరంజీవిలో మొదటిసారి కోపాన్ని చూశారు. ఆ రోజు ఆయన వార్నింగ్ తో ఇప్పటి వరకు ఎప్పుడూ అలాంటి పనిచయలేదట. మరి చిరు ఏమన్నాడు? పవన్‌ ఏం చేయలేదు?

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 16 2025, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్‌ చిరంజీవి బయట చాలా ఫన్నీగా ఉంటారు. ఈవెంట్లలోనూ సరదాగా నవ్విస్తుంటారు. జోవియల్‌గా కనిపిస్తారు. మరి ఇంట్లో ఎలా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీతోనూ అలానే ఉంటాడా? అంటేకాదు అంటున్నాడు రామ్‌ చరణ్‌. ఇంట్లో నాన్నగారు చాలా సీరియస్‌గా ఉంటారని, చాలా తక్కువగా మాట్లాడతారని తెలిపారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకటిరెండుసార్లు ఆయన సీరియస్‌ అయినట్టు, బెల్ట్ తో కొట్టినట్టు కూడా చెప్పారు. 
 

26

మరి పవన్ కళ్యాణ్‌పై ఎప్పుడైనా కోప్పడా అంటే ఓ సారి తాను చిరంజీవి అన్నయ్య కోపాన్ని చూసినట్టు తెలిపారు పవన్‌. బెసిక్‌గా ఎప్పుడూ కోప్పడు అని, అంతా కూల్ చెబుతారు అని వెల్లడించారు. కానీ ఓ సందర్భంలో మాత్రం ఆయనలో కాస్త కోపం చూశాను అని, ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను, ఆ రోజు నుంచి తనలో చాలా మార్పు వచ్చిందన్నారు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. 
 

36

ఇప్పుడు హీరోగా, డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ హీరోగా కాకముందు పెద్దగా పనీ పాట లేకుండానే తిరిగేవాడట. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, పుస్తకాలు చదవడం చేసేవాడట. చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఇంట్లో మాత్రం అన్నీ సాగించుకునేవాడట. ముఖ్యంగా ఫుడ్‌ విషయంలో మారాం చేసేవాడట. 

46

నాన్‌ వెజ్‌ లేనిదే ముద్దదిగేది కాదట. ఏరోజైనా నాన్‌ వెజ్‌ వండకపోతే ఇట్లో గోల చేసేవాడట. అప్పట్లో చిరంజీవి చాలా బిజీగా ఉండేవాడు. హీరోగా సక్సెస్‌ అయిన నేపథ్యంలో రెండు మూడు షిఫ్ట్ ల్లోనూ సినిమాలు చేసేవారు. అర్థరాత్రి ఎప్పుడో వచ్చేవారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ గురించి ఈ విషయం చిరంజీవికి తెలిసింది. ఓ రోజు ఇలానే తన ముందే అమ్మపై అరిచాడట పవన్.

దీంతో ఆయన్ని దగ్గరికి పిలిపించి.. ఒక్కసారి బయటకు వెళ్లి చూడు, మనం ఈ మాత్రం అయినా ఫుడ్‌ తింటున్నాం, మనకు దొరుకుతుంది, బయటకు చాలా మంది కనీసం ఒక్క పూట కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఉన్నదాన్ని సర్దుకుని పోవాలి, ఇలా బెట్టు చేస్తే బాగోదు అని కూల్‌గానే స్ట్రాంగ్‌గా వార్నింగ్‌ ఇచ్చాడట. ఇలాంటిది చేయోద్దని చెప్పాడట. 
 

56

చిరంజీవి అన్నయ్యని పవన్ ఇలా ఎప్పుడూ చూడలేదు, కూల్‌గా చెప్పినా, గట్టిగానే చెప్పాడు. అంతే ఆ దెబ్బతో ఇంకెప్పుడు తాను అలాంటి పని చేయలేదని, ఆ టైమ్‌కి ఏది ఉంటే అది తినేఅలవాటు చేసుకున్నానని, అన్నయ్య చెప్పిన ఆ విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అని ఓ పాత ఇంటర్వ్యూలో పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. 

66

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు హీరోగా కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో `హరిహర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్ భగత్‌ సింగ్‌` చిత్రాలున్నాయి. మొదట `హరిహర వీరమల్లు` సినిమాని పూర్తి చేయబోతున్నారు. దీన్ని మార్చిలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. 

read more: మంచు ఫ్యామిలీ వివాదంః మళ్లీ అగ్గిరాజేసిన మంచు మనోజ్‌.. అసలు కారణం ఇదేనా?

also read: బాలకృష్ణ వంద కోట్ల సినిమాలు ఎన్నో తెలుసా? సీనియర్‌ హీరోల్లో బాలయ్య రేర్‌ ఫీట్‌
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
ధురంధర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 100 కోట్ల ఇల్లు, అరేబియా సముద్రం కనిపించేలా అద్భుత భవనం ఎలా ఉందో చూశారా?
Recommended image2
Brahmamudi Serial Today Episode: పవర్ ఆఫ్ అటార్ని నుంచి రేఖను తప్పించాలని అపర్ణ ప్లాన్, ఇందు ఫోన్ పగలగొట్టిన రాజు
Recommended image3
పవన్ కళ్యాణ్ నో అన్నాడు, మహేష్ బాబు, రవితేజ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు, పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన పూరీ జగన్నాథ్ సినిమాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved