- Home
- Entertainment
- ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, రమ్యకృష్ణ వీళ్ళు కనుక విలన్స్ అయితే ఏ హీరో నిలబడలేడు.. విధ్వంసమే కదా..
ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, రమ్యకృష్ణ వీళ్ళు కనుక విలన్స్ అయితే ఏ హీరో నిలబడలేడు.. విధ్వంసమే కదా..
ఏ నటుడైనా నెగిటివ్ రోల్స్ చేసినప్పుడే అతడి పూర్తి నటన బయటకు వస్తుందని చెబుతుంటారు. పాత తరంలో స్వర్గీయ ఎన్టీఆర్ దుర్యోధనుడిగా, రావణుడిగా నటించి తిరుగులేని ముద్ర వేశారు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోల్లో విలన్స్ గా నటించే సామర్థ్యం ఉన్న నటులెవరో ఇప్పుడు చూద్దాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
హృతిక్ రోషన్ : ఇండియాలో సూపర్ హీరోగా హృతిక్ చెరగని ముద్ర వేశారు. థానోస్ తరహాలో హృతిక్ నెగిటివ్ రోల్ చేస్తే ఆ విధ్వంసం ఊహకి కూడా అందదు.
బాలకృష్ణ : బాలయ్య హీరో గా లెన్తీ డైలాగులు చెబితే థియేటర్స్ లో రీ సౌండ్ వస్తుంది. విలన్ పాత్రని సమర్థవంతంగా పోషించే సామర్థ్యం బాలయ్యలో పుష్కలంగా ఉంది. ఏదైనా పౌరాణిక చిత్రంలో బాలయ్య విలన్ గా కనిపిస్తే నట విశ్వరూపం చూడొచ్చు.
అల్లు అర్జున్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో మరోసారి యావత్ దేశాన్ని సప్రైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప మూవీలో బన్నీ పాత్రలో నెగిటివ్ టచ్ ఉంటుంది. స్మగ్లర్ గా అల్లు అర్జున్ చూపిన విలక్షణ నటనకు జాతీయ అవార్డు కూడా దాసోహం అయింది. అలాంటిది బన్నీ ఫుల్ లెన్త్ విలన్ రోల్స్ చేస్తే కంప్లీట్ డామినేషన్ చూడొచ్చు.
రమ్యకృష్ణ : హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లలో కూడా విలన్ రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వారు ఉన్నారు. వారిలో ముందు వరుసలో రమ్యకృష్ణ ఉంటుంది. నరసింహ చిత్రంలో నెగిటివ్ రోల్ చేసిన రమ్యకృష్ణ.. ఎదురుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నప్పటికీ ఎక్కడా తగ్గలేదు. బాహుబలిలో ఆమె చేసింది పూర్తి స్థాయి నెగిటివ్ రోల్ కాదు కానీ.. ఆమె పెర్ఫామెన్స్ కి భయపడినట్లు ప్రభాస్ ఓ సందర్భంలో తెలిపాడు. అలాంటి రమ్యకృష్ణ.. తరచుగా నెగిటివ్ రోల్స్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుతున్నారు.
ప్రభాస్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్ తో విలన్ గా నటిస్తే బోక్సు బద్దలు అని కచ్చితంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో ప్రభాస్ కి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ వస్తుందేమో చూడాలి.
జూ.ఎన్టీఆర్ : జై లవకుశ చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి జస్ట్ శాంపిల్ చూపించాడు. ఒకసారి ఊహించుకోండి ఎన్టీఆర్ కనుక పూర్తి స్థాయి విలన్ గా చేస్తే ఎలా ఉంటుందో.. నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఆ రచ్చ ఉంటుంది.
అరవింద్ స్వామి : ఇటీవల కాలంలో విలన్ రోల్స్ లో మోస్ట్ స్టైలిష్ గా నటించింది అంటే అరవింద్ స్వామి పేరే చెప్పాలి. ధృవ చిత్రంలో అరవింద్ స్వామి పాత్రకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తరహాలో మరిన్ని పాత్రల్లో అరవింద్ స్వామి నటిస్తే చాలా బావుంటుంది.
యష్ : కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా యష్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాఖీ భాయ్ పాత్రలో కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుంది. ఒక డిఫెరెంట్ యాటిట్యూడ్, దేనికైనా వెనకడుగు వేయని స్వభావం ఉన్న యష్ విలన్ గా నటిస్తే ఫ్యాన్స్ కి పండగే. ఇప్పటికే యష్ ని రావణాసుర పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్.