MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దానికంటే యానిమల్ లో బెడ్ రూమ్ సీన్ చాలా బెటర్.. ఆరోజు సెట్ లో నలుగురే ఉన్నారు, తృప్తి డిమ్రి కామెంట్స్

దానికంటే యానిమల్ లో బెడ్ రూమ్ సీన్ చాలా బెటర్.. ఆరోజు సెట్ లో నలుగురే ఉన్నారు, తృప్తి డిమ్రి కామెంట్స్

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2023, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో కంటెంట్ పై విమర్శలు వస్తున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కి ఎగబడుతూనే ఉన్నారు.  

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

చాలా వైవిధ్యంగా ఉండే తండ్రి సెంటిమెంట్, రణబీర్ నటన.. రష్మికతో కెమిస్ట్రీ.. ఫస్ట్ హాఫ్ లో పవర్ ఫుల్ గా ఉండే సన్నివేశాలు ఈ చిత్రానికి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా చేశాయి. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి చిన్న పాత్రలో మెరిసినప్పటికీ బోల్డ్ సీన్ తో సంచలనం సృష్టించింది. రణబీర్ తో కలసి త్రిప్తి బెడ్ పై రెచ్చిపోయి న్యూడ్ గా నటించింది. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనితో త్రిప్తి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. 

36

యానిమల్ మూవీలో తన పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో తృప్తి డిమ్రి యువతకి హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. నెటిజన్లంతా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ తృప్తి యానిమల్ మూవీపై తన స్పందన తెలిపింది. రణబీర్ తో తన కెమిస్ట్రీకి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఆమె అనుకోలేదట. మరోసారి రణబీర్ తో కలసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తృప్తి ఇదివరకే తెలిపింది. 

46

అయితే తాను ఈ చిత్రంలో న్యూడ్ గా నటించడంపై వస్తున్న కామెంట్స్ కి తృప్తి సమాధానం ఇచ్చింది. అందరూ ఈ మూవీలో బెడ్ రూమ్ సీన్ గురించే మాట్లాడుతున్నారు.  యానిమల్ లో బెడ్ రూమ్ సీన్ కంటే నాకు బుల్ బుల్ మూవీలో అత్యాచార సన్నివేశమే కష్టంగా అనిపించింది. ఏమి చేయలేని స్థితిలో అంతా ఇచ్చేయడం చాలా కష్టం. దానితో పోల్చితే యానిమల్ మూవీ చాలా బెటర్ అంటూ తృప్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

56

నాకిచ్చిన పాత్రకి న్యాయం చేయడం నా భాద్యత. అలాంటప్పుడు బట్టలేకుండా నటించాల్సి వస్తే అలాగే చేయాలి. అది తప్పు కాదు. యానిమల్ చిత్రంలో నేను బెడ్ రూమ్ సన్నివేశంలో నటించేటప్పుడు సెట్ లో నలుగురు మాత్రమే ఉన్నారు. డైరెక్టర్ నన్ను చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు. 

66

ఆరోజు సెట్ లో నాతో పాటు రణబీర్, సందీప్ రెడ్డి, కెమెరామెన్ మాత్రమే ఉన్నాం. తరచుగా నువ్వు ఓకేనా ? ఏమైనా ఇబ్బంది ఉందా ? అంటూ చాలా కేర్ తీసుకున్నారు. రణబీర్ తో కాబట్టి కాస్త కంగారు అనిపించింది. రణబీర్ నన్ను అర్థం చేసుకుని నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు అంటూ తృప్తి తన టీం ని ప్రశంసలతో ముంచేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved