- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్.. కప్ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్.. కప్ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన
బిగ్ బాస్ తెలుగు 9 మంగళవారం ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయెల్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఈ సారి కప్ గెలిస్తే ఎవరికి ముందుగా ఆ కప్ ఇస్తాడో వెల్లడించారు. ఈ క్రమంలో ప్రియురాలికి షాక్ ఇచ్చాడు.

బిగ్ బాస్ షోలో ట్విస్ట్ లు
బిగ్ బాస్ తెలుగు 9 14 వారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. బిగ్ బాస్ గతంలో ఎప్పుడూ లేని ట్విస్ట్ లు, టర్న్ లతో హౌజ్‌ని నడిపిస్తున్నాడు. కొత్త కొత్త ట్విస్ట్ లతో షోపై ఇంట్రెస్ట్ ని పెంచుతున్నాడు. ఇక ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు వరుసగా టాస్క్ లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆయా టాస్క్ ల్లో టాప్‌లో ఉన్న వారికి వివిధ రకాల టెస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రోజు వీల్ బ్యారెల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్‌లకు ఎక్కువ స్కోర్ లభించింది.
పోలీంగ్‌కి వెళ్లిన పవన్, ఇమ్మాన్యుయెల్
తర్వాత టాస్క్ లో పాల్గొనకుండా ఉండేందుకు ఒకరిని ఎలిమినేట్ చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో చాలా వరకు సంజనాకి ఓట్లు పడ్డాయి. దీంతో ఆమె నెక్ట్స్ టాస్క్ ల్లో పాల్గొనే అర్హతను కోల్పోయింది. ఇలా బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ ల్లో అత్యధికంగా ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్‌లు స్కోర్ సాధించారు. వీరిద్దరిని ఆడియెన్స్ పోలింగ్‌లోకి వెళ్లారు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా హౌజ్‌లోకి కొంత మంది కామన్ ఆడియెన్స్ ని పంపించారు. వారిని ఓటింగ్‌కి రిక్వెస్ట్ చేసుకున్నారు వీరిద్దరు. అదే సమయంలో వారి ప్రశ్నలను ఎదుర్కోవల్సి వచ్చింది. మరోవైపు బిగ్ బాస్ కూడా కొన్ని ప్రశ్నలను సంధించారు. మొత్తంగా వారి తెలివిని ఆలోచన విధానాన్ని ప్రశ్నించారు.
బిగ్ బాస్ షోలో సంజనాకి మళ్లీ దెబ్బ
ఈ క్రమంలో అంతిమంగా ఎక్కువ స్కోర్ సాధించిన ఉన్న ఇమ్మాన్యుయెల్‌కి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఆడియెన్స్ తో మరోసారి ఇంటరాక్ట్ అయ్యాడు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందులో భాగంగా ఒక ఆడియెన్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సంధించారు. ఒకవేళ కప్ గెలిస్తే మొదట ఎవరికి ఇస్తావ్, మీ గర్ల్ ఫ్రెండ్ కా, మీ మదర్ కా? అని ప్రశ్నించారు. దీనికి ఇమ్మాన్యుయెల్ చెబుతూ, తాను అమ్మకే ఇస్తానని తెలిపాడు. తాను చిన్నప్పట్నుంచి అమ్మకి దూరంగా ఉన్నాను. హాస్టల్స్ లో వేయడంతో డిగ్రీ వరకు వారికి దూరంగా ఉన్నాను. అమ్మతో ఉన్న రోజులు చాలా తక్కువ. పైగా తాను విన్నర్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. అందుకే అమ్మ చేతిలోనే కప్ పెడతాను అని తెలిపారు ఇమ్మాన్యుయెల్. ఈ విషయంలో తన గర్ల్ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటుందని, తను కూడా అదే కోరుకుంటుందని చెప్పాడు. మొత్తంగా గర్ల్ ఫ్రెండ్‌కి షాకిస్తూ అమ్మకి పెద్ద పీఠ వేశాడు ఇమ్మాన్యుయెల్. ఈ సమాధానంతో ఆయన అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇది తన స్కోర్ పెరగడానికి కారణమయ్యింది.
ఇమ్మాన్యుయెల్ విన్నర్
దీంతోపాటు మరికొన్ని టాస్క్ లు ఉండబోతున్నాయి. కానీ ఇమ్మాన్యుయెల్ రెండో ఫైనలిస్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫైనలిస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇమ్మాన్యుయెల్‌కి ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ సారి ఇమ్మాన్యుయెల్‌కే విన్నింగ్ ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మాత్రం కమెడియన్‌ని విన్నర్‌ని చేస్తున్నట్టు సమాచారం.
అమ్మ నాన్నతో బాధ
ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్‌లో తనూజ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె భరణి విషయంలో, సంజనా విషయంలో తనూజ ఇన్ వాల్వ్ అవుతుంది. ఎలిమినేషన్ సమయంలోనూ తనూజ.. సంజనా, భరణి విషయంలో బాధపడుతున్నట్టు తెలిపింది. మీ అమ్మ, మా నాన్నతో నా తలకాయ పోతుందని చెప్పింది. దీనికి ఇమ్మాన్యుయెల్ సెటర్లు వేయడం విశేషం.

