- Home
- Entertainment
- Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్ డేట్.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్ డేట్.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Akhanda 2 New Date: బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్. అందరు ఊహించిన డేట్‌కే వస్తోంది.

ఫైనాన్స్ ఇష్యూతో వాయిదా పడ్డ `అఖండ 2`
బాలకృష్ణ హీరోగా నటించిన తాజా మూవీ `అఖండ 2`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత వారం విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆర్థిక పరమైన సమస్యలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ గతంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి దాదాపు రూ.28కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు బ్యానర్లు కలిసి పలు సినిమాలను నిర్మించాయి. వాటి తాలూకా డీల్స్ ఫైనల్ కాలేదు.
`అఖండ 2` సమస్య సాల్వ్
ఈ క్రమంలో ఇప్పుడు `అఖండ 2` రిలీజ్ టైమ్‌లోనే ఈ డబ్బులు వసూలు చేసుకోవాలని ఈరోస్ ఇంటర్నేషన్ సంస్థ కోర్ట్ లో కేసు వేసింది. దీంతో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దీనికి సంబంధించిన చర్చలు జరిగినా సఫలం కాలేదు. ఈ అమౌంట్ రూ.28 కోట్లు కాదు యాభై కోట్లు ఉన్నట్టుగా తేలింది. దీంతో పోస్ట్ పోన్ చేశారు. నెక్ట్స్ డే వస్తుందని భావించారు. అయినా కాలేదు. టాలీవుడ్ నుంచి పెద్ద నిర్మాతలు ఇన్ వాల్వ్ అయ్యారు. అయినా సెట్ కాలేదు. దీంతో మొత్తానికి వాయిదా వేయాల్సి వచ్చింది.
`అఖండ 2` కొత్త రిలీజ్ డేట్
ఈ క్రమంలో కోర్ట్ నుంచి క్లీయరెన్స్ వచ్చింది. ఇరు సంస్థల మధ్య చర్చలు సఫలం అయ్యిందట. పలువురు నిర్మాతలు ఇన్ వాల్వ్ అయి సెటిల్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్. ముందుగా అంతా ఊహించినట్టుగానే ఈ మూవీని ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. 11 న ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నాయట. అయితే ఈ డేట్‌కి ఐదారు సినిమాలు `సైకో సిద్ధార్థ`, `సహకుటుంబమానం`, `మౌళి`, `ఈషా`, `డ్రైవ్`, `అన్నగారు వస్తున్నారు` చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఇప్పుడు `అఖండ 2` రావడంతో ఆ చిత్రాలకు పెద్ద దెబ్బ పడింది. మరి ఈ ఫైట్‌ని ఎలా సెట్ చేస్తారు, `అఖండ 2` దెబ్బకి ఎన్ని చిత్రాలు బ్యాక్ వెళ్లిపోతాయో చూడాలి.
`అఖండ 2` కథ ఇదే
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2 తాండవం` మూవీలో ఆదిపినిశెట్టి విలన్‌గా నటించగా, సంయుక్త హీరోయిన్‌గా చేసింది. హర్షాలీ, పూర్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఇది నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ` మూవీకి సీక్వెల్. దానికి కొనసాగింపుగా ఉండబోతుందట. ఈ సారి శివతత్వాన్ని ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. హింధూ ధర్మం, సనాతన హైందవ ధర్మం అంశాలను ఇందులో చూపించబోతున్నారట. మన దేశం గొప్పతనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారట.

