- Home
- Entertainment
- Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్ లేంగే సాలా` సాంగ్.. పవన్ కళ్యాణ్ మేనియా స్టార్ట్
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్ లేంగే సాలా` సాంగ్.. పవన్ కళ్యాణ్ మేనియా స్టార్ట్
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదలైంది. స్టయిలీష్ లుక్‌లో పవన్ వేసిన స్టెప్పులు దుమ్ములేపేలా ఉన్నాయి. అభిమానులకు ట్రీట్‌లాగా ఉందని చెప్పొచ్చు.

ఈ ఏడాది రెండు సినిమాలతో పవన్ రచ్చ
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. `హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాలతో ఆడియెన్స్ ని అలరించారు. ముఖ్యంగా ఈ ఏడాది పవన్ అభిమానులు పండగ చేసుకున్నారు. ఓ రకంగా వాళ్ల ఆకలి తీరిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఆయనకు సరైన హిట్ లేదు. దీంతో ఆ లోటుని `ఓజీ` తీర్చింది. `హరి హర వీరమల్లు` డిజప్పాయింట్ చేసినా `ఓజీ` దుమ్ములేపింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించింది. పవన్ కి సరిపోయే సినిమా పడితే వసూళ్ల వర్షం ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది.
`ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో
ఇక ఇప్పుడు మరో సినిమాతో సందడి చేయబోతున్నారు పవన్. ఆయన నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ రచ్చ స్టార్ట్ చేస్తున్నారు టీమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీలీల మరో హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు టీమ్. మొదటి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.
అలరిస్తోన్న `దేఖ్‌లేంగే సాలా` సాంగ్ ప్రోమో
అందులో భాగంగా `ఉస్తాద్‌భగత్ సింగ్` మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. `దేఖ్ లేంగే సాలా` పేరుతో సాగే ఈ పాట ప్రోమో మంగళవారం సాయంత్రం విడుదల చేయగా, అది ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్ మార్క్ స్టెప్పులు దుమ్ములేపేలా ఉన్నాయి. పవన్ హ్యాట్ పెట్టుకునే తీరు అదిరిపోయేలా ఉంది. ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. పూర్తి పాట ఈ నెల 13న విడుదల కానుంది.
కాప్ యాక్షన్ డ్రామాగా `ఉస్తాద్ భగత్ సింగ్`
ఈ సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తయ్యింది. సినిమా చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. పోలీస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో కొంత పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.

