MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇమ్మాన్యుయెల్‌ ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్‌, ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి.. మాటిచ్చిన అమ్మ

ఇమ్మాన్యుయెల్‌ ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్‌, ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి.. మాటిచ్చిన అమ్మ

జబర్దస్త్ కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌ ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. ఇటీవల తన లవ్‌ స్టోరీని రివీల్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే వాళ్ల పెళ్లికి ఇమ్మాన్యుయెల్‌ అమ్మ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 22 2025, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జబర్దస్త్ తో పాపులర్‌ అయిన ఇమ్మాన్యుయెల్‌
Image Credit : starmaa

జబర్దస్త్ తో పాపులర్‌ అయిన ఇమ్మాన్యుయెల్‌

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్‌ అయ్యాడు ఇమ్మాన్యుయెల్‌. తనదైన కామెడీతో విశేషంగా అలరించాడు, స్టార్‌ కమెడియన్ గా ఎదిగాడు. ఆ పాపులారిటీనే ఆయనకు బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశం తెచ్చింది. బిగ్‌ బాస్‌ తెలుగు 9 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్‌ కంటెస్టెంట్లలో ఒకరిగా రాణిస్తున్నాడు ఇమ్మాన్యుయెల్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ లో ముందుంటాడు. అదే సమయంలో గేమ్స్, టాస్క్ ల్లోనూ ముందుంటున్నాడు. ఇప్పటికే రెండు సార్లు కెప్టెన్‌ కూడా అయ్యాడు. అంతేకాదు టాప్‌ 5 లో కూడా ఉండబోతున్నాడు.

26
35ఏళ్ల అమ్మ కోరికని తీర్చావ్‌
Image Credit : starmaa

35ఏళ్ల అమ్మ కోరికని తీర్చావ్‌

ఇదిలా ఉంటే శుక్రవారం ఎపిసోడ్‌లో ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చివరగా ఇమ్మాన్యుయెల్‌ అమ్మ వచ్చింది. అమ్మని చూసి ఇమ్మాన్యుయెల్‌ ఎమోషనల్‌ అయ్యాడు. అందరి బాగోగులు అడిగాడు. వాళ్లమ్మ ఇమ్మూని ఓదార్చింది. ఏడవకూడదని, స్ట్రాంగ్‌గా ఉండాలని భరోసా ఇచ్చింది. బాగా నవ్విస్తున్నావని, బాగా టాస్క్ లు ఆడుతున్నావని, అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తున్నావని, అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నట్టు తెలిపింది. తన 35ఏళ్ల కోరికని తీర్చావని అమ్మ కూడా ఎమోషనల్‌ అయ్యింది. నిన్ను వద్దనుకుంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు హీరో అయ్యావని గర్వంగా చెప్పింది. ఇలానే ఆడాలని, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాలని, టైటిల్‌ విన్‌ కావాలని తెలిపింది.

Related Articles

Related image1
బిగ్‌ బాస్‌ 9 తెలుగు 11వ వారం లేటెస్ట్ ఓటింగ్‌.. డేంజర్‌ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్, ఈమె పక్కా
Related image2
బయట సరిపోక బిగ్‌ బాస్‌కి వచ్చావ్‌.. నువ్వు అందరిని వాడుకుంటావ్‌.. హద్దులు మీరి తిట్టుకున్న తనూజ, దివ్య
36
కమెడియన్‌గా వచ్చావ్‌, హీరోగా బయటకు రావాలి
Image Credit : starmaa

కమెడియన్‌గా వచ్చావ్‌, హీరోగా బయటకు రావాలి

ఈ సందర్భంగా మరో ఇన్‌స్పైరింగ్‌ కామెంట్ చేసింది. బిగ్ బాస్‌ హౌజ్‌లోకి కమెడియన్‌గా వచ్చావని, విన్నర్‌ అయి హీరోలా బయటకు రావాలని తెలిపింది. దీంతో మరోసారి ఇమ్యాన్యుయెల్‌ ఎమోషనల్ అయ్యాడు. మాటల్లోనే ఆమె మరో ఆసక్తికర కామెంట్‌ చేసింది. బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక నీ పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అంతే కాదు శుక్రవారం ఎపిసోడ్‌లోనే ఇమ్మాన్యుయెల్‌ లవర్‌ ఆయనకు ఒక లెటర్‌ పంపించింది. వాళ్లిద్దరు కలిసి ఓ కేఫ్‌లో కూర్చొని దిగిన ఫోటోని పంచుకుని దాని వెనకాల తన సందేశాన్ని రాసింది.

46
ఇమ్మాన్యుయెల్‌కి లవర్ నోట్‌
Image Credit : starmaa

ఇమ్మాన్యుయెల్‌కి లవర్ నోట్‌

ఇందులో `హాయ్‌ వేస్ట్ ఫెలోలు. నువ్వు ఎలా ఉన్నావ్. నేను బాగున్నాను. నువ్వు నా కోసం ఎంత వెయిట్‌ చేస్తున్నావో, నేను హౌజ్‌లోకి రావాలని ఎంత కోరుకుంటున్నావో, వస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతావో నాకు తెలుసు. అంతకంటే ముందు నేను చెప్పే న్యూస్‌ వింటే చాలా హ్యాపీగా ఫీలవుతావు. మన లవ్‌కి, మనం కన్న కలలకు ఫైనల్‌గా ఒక సొల్యూషన్‌ దొరికింది. మనం ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం కదా, ప్రేమ విషయాన్ని ఇంట్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఒప్పించాలి అనేది. కానీ నేను ఒక్కదాన్నే అందరిని ఒప్పించాను. మీ అత్తగారు, మీ బావగా నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. బావ గారు అంటే ఎవరో కాదు మా అన్నయ్య. నీ గేమ్‌ని, ఫన్‌ని వాళ్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. వాళ్లకు నువ్వు బాగా నచ్చావ్‌ నాన్నలు. నువ్వు గెలిచి వచ్చాక, ఇద్దరం కలిసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. మిస్‌ యూ సోమచ్‌ వేస్ట్ ఫెలో, నీ స్ట్రెంన్త్ ని మర్చిపోకు, నీ కోసం ఎదురుచూస్తుంటాను, ఐ లవ్యూ` అని రాసింది. ఇది చూసి ఇమ్మాన్యుయెల్‌ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.

56
ఇమ్మాన్యుయెల్‌ పెళ్లికి లైన్‌ క్లీయర్‌
Image Credit : starmaa

ఇమ్మాన్యుయెల్‌ పెళ్లికి లైన్‌ క్లీయర్‌

మొత్తంగా ఇమ్మాన్యుయెల్‌ లవ్‌ కి అన్ని క్లీయరెన్స్ లు వచ్చినట్టే అని చెప్పొచ్చు. పైగా బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి వచ్చాక పెళ్లి చేస్తానని అమ్మ కూడా మాటివ్వడంతో ఇక ఈ కమెడియన్‌ మ్యారేజ్‌ ఫిక్స్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు. ఇమ్మాన్యుయెల్‌ ప్రేమించింది ఒక డాక్టర్ ని. ఆయన స్టాండప్‌ కమెడియన్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఇమ్మాన్యుయెల్‌ని ప్రేమించింది. 

66
ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం
Image Credit : starmaa

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం

ఇమ్యాన్యుయెల్‌ లవర్‌ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యింది. తనే ఫోన్‌ నెంబర్ అడిగిందట. ఇద్దరు నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. అయితే ఇమ్మాన్యుయెల్‌ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు కలిగిన ఫీలింగ్‌ పెళ్లి చేసుకోవాలని, అదే విషయం ఆమెకి చెప్పాడట. డాక్టర్‌ కోర్స్ కంప్లీట్‌ అయ్యాక మ్యారేజ్‌ చేసుకుందామని చెప్పిందట. ఈ విషయాన్ని ఆ మధ్య బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇమ్మూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వెళ్లాక ఆయన మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన టాప్ 10 ఫొటోలు.. ఏ పోస్టుకు ఎన్ని లక్షల లైక్స్?
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?
Recommended image3
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Related Stories
Recommended image1
బిగ్‌ బాస్‌ 9 తెలుగు 11వ వారం లేటెస్ట్ ఓటింగ్‌.. డేంజర్‌ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్, ఈమె పక్కా
Recommended image2
బయట సరిపోక బిగ్‌ బాస్‌కి వచ్చావ్‌.. నువ్వు అందరిని వాడుకుంటావ్‌.. హద్దులు మీరి తిట్టుకున్న తనూజ, దివ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved