- Home
- Entertainment
- Movie Reviews
- బిగ్ బాస్ 9 తెలుగు 11వ వారం లేటెస్ట్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్, ఈమె పక్కా
బిగ్ బాస్ 9 తెలుగు 11వ వారం లేటెస్ట్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్, ఈమె పక్కా
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం లేటెస్ట్ ఓటింగ్ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తోంది. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వారిలో ఒకరు మాత్రం పక్కా ఎలిమినేషన్.

11 వారం కెప్టెన్‌గా రీతూ చౌదరీ
బిగ్ బాస్ తెలుగు 9 షో ఇటీవల కాస్త ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. వారితో ఉన్న అనుబంధాలను, మిస్ అవుతున్న వారిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్ కోసం గట్టి పోటీ నెలకొంది. అయితే ఈ వారం రీతూ చౌదరీ కెప్టెన్ అయినట్టు సమాచారం. సుమన్ శెట్టితో జరిగిన పోటీలో రీతూ విన్ అయి 11వ వారం( 12వ వారానికి) ఆమె కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది.
11 వారం నామినేషన్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు
ఇదిలా ఉంటే ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. ఇప్పటి వరకు ఓటింగ్ ప్రకారం ఎవరు డేంజర్‌లో ఉన్నారు, ఎవరు టాప్‌లో ఉన్నారనేది చూస్తే. ఆసక్తికర రిజల్ట్ కనిపిస్తోంది. ముందు నుంచి ఊహించిన కంటెస్టెంట్ ఈ వారం డేంజర్‌లో ఉన్నారు. అంతేకాదు ఈ వారం కూడా ఇద్దరు డేంజర్‌లో ఉండటం విశేషమైతే, ఇద్దరూ లేడీ కంటెస్టెంట్లే కావడం మరో విశేషం. 11వ వారం నామినేషన్‌లో కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, భరణి, డీమాన్ పవన్, సంజనా, దివ్య ఉన్నారు.
ఓటింగ్‌లో టాప్‌లో కళ్యాణ్, బాటమ్‌లో దివ్య
ఈ ఆరుగురు కంటెస్టెంట్లలో కళ్యాణ్ టాప్‌లో(అనధికారిక ఓటింగ్ ప్రకారం) ఉన్నారు. దాదాపు 35శాతానికిపైగా ఓటింగ్‌తో ఆయన టాప్‌లో ఉండటం విశేషం. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 23 శాతం ఓట్లు పడ్డాయట. 15శాతం ఓట్లతో భరణి మూడో స్థానంలో ఉన్నారు. 10శాతం ఓట్లతో డీమాన్ పవన్ నాల్గో స్థానంలో నిలవగా, పది శాతం కంటే తక్కువ ఓట్లతో సంజనా, ఆ తర్వాత దివ్య ఉన్నారు. వీరిలో దివ్య బాటమ్‌లో ఉంది. దివ్యకి, సంజనాకి మధ్య ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. ఈ వారం ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
డేంజర్ జోన్‌లో దివ్య
11వ వారం ఓటింగ్‌కి సంబంధించి శుక్రవారం వరకు అంటే ఈ రోజు 12 గంటల వరకు ఛాన్స్ ఉంది. ఈ ఒక్కరోజు ఓటింగ్ లో ఏదైనా మార్పు ఉంటుందా? అనేది చూడాలి. కానీ ఈ వారం ప్రారంభం నుంచి ఈ ఓటింగ్ సేమ్ ఉంటోంది. అంటే దివ్యనే లీస్ట్ లో ఉంది. ఇప్పుడే కాదు, గతం వారం కూడా ఆమె డేంజర్ జోన్‌లో ఉంది. చాలా మంది ఆమెనే ఎలిమినేట్ అవుతుందని, ఆమే ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు. కానీ గౌరవ్, నిఖిల్‌లను పంపించారు. ఈ వారం మాత్రం దివ్యకి ఎలిమినేషన్ దెబ్బ పడబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ వారం దివ్య, సంజనాలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని, అందులో దివ్యకే ఎక్కువగా ఛాన్స్ ఉందని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ముగ్గురి మధ్య అసలు పోటీ?
ఇక సెప్టెంబర్ 7న 15 మందితో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఇప్పుడు హౌజ్‌లో 9 మంది మాత్రమే ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి, సంజనా, దివ్య, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, భరణి ఉన్నారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా, హరిత హరీష్, ఫ్లోరా, శ్రీజ, రమ్య మోక్ష, దివ్వెల మాధురి, శ్రీనివాస సాయి, నిఖిల్, గౌరవ్, రాము రాథోడ్, ఆయేషా జీనత్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. భరణి, సంజనా ఎలిమినేట్ అయినా వారిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకురావడం గమనార్హం. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరనేదానిపై చర్చ ప్రారంభమవుతుంది. ఆ ఛాన్స్ ఎవరికి వరిస్తుందనేది చూడాలి. కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.

