- Home
- Entertainment
- అల్లు రామలింగయ్య వల్లే మెగాస్టార్ అయ్యారా ? చిరంజీవి సమాధానం.. సురేఖతో పెళ్లి, అస్సలు ఒప్పుకోనన్న నిర్మాత
అల్లు రామలింగయ్య వల్లే మెగాస్టార్ అయ్యారా ? చిరంజీవి సమాధానం.. సురేఖతో పెళ్లి, అస్సలు ఒప్పుకోనన్న నిర్మాత
1978లో ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి దాదాపు 4 దశాబ్దాల పాటు మెగాస్టార్ గా ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే చిరంజీవి మెగాస్టార్ అయింది ఎవరి వల్ల ? అనే ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానం తెలుసుకోండి.

చిరంజీవి కెరీర్
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో నెంబర్ 1 గా కొనసాగారు. ఎన్టీఆర్, కృష్ణ లాంటి హీరోల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను ఏలింది చిరంజీవే. చిరంజీవి ఇండస్ట్రీకి 1978లో అడుగుపెట్టారు. రెండేళ్లకే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో చిరంజీవి అల్లు వారి అమ్మాయి సురేఖను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యారు.
అల్లు రామలింగయ్య పుష్ ఇవ్వలేదు
ఆ టైంలో అల్లు రామలింగయ్య పుష్ ఇవ్వడం వల్లే మెగాస్టార్ అయ్యారు అనే కామెంట్స్ కి చిరంజీవి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో నేను మంచి కుర్రాడిని, ట్యాలెంట్ ఉంది అని భావించి అల్లు రామలింగయ్య నన్ను అల్లుడిగా చేసుకున్నారు. అల్లు రామలింగయ్య నాకు పుష్ ఇవ్వలేదు.. ఆశీస్సులు ఇచ్చారు. నాకు గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరూ లేరు. కెరీర్ ప్రారంభం నుంచి నా అదృష్టం ఏమో కానీ.. నా డ్యాన్సులు, ఫైట్స్ అందరికీ బాగా నచ్చేవి. అవకాశాలు వేగంగా వచ్చాయి.
ప్రేక్షకులు ఇష్టపడ్డారు
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. నాకిచ్చిన పాత్రలో ఎంత బాగా నటిస్తున్నాను అనేది మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా క్యారెక్టర్ అందరికీ నచ్చింది. ఈ కుర్రాడిని పెట్టుకుంటే.. డ్యాన్సులు బాగా చేస్తాడు. ఫైట్స్ న్యాచురల్ గా చేస్తున్నాడు, బాగా కష్టపడతాడు, రెమ్యునరేషన్ ఇంతే కావాలి అని డిమాండ్ చేయడు అనే నమ్మకం నాపై ప్రొడ్యూసర్లకు కలిగింది. అన్నింటికీ మించి ప్రేక్షకులు నా సినిమాలు చూడడానికి ఆసక్తి చూపేవారు అని చిరంజీవి తెలిపారు.
నిర్మాత అందుకు అంగీకరించలేదు
ఎక్కడా చెప్పని విషయం ఇప్పుడు చెబుతున్నా. సురేఖతో నా పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ టైంలో ఎమ్మెస్ రెడ్డి గారు నిర్మిస్తున్న తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో నటిస్తున్నాను. బాంబే లో షూటింగ్ బిజీగా జరుగుతోంది. ఆ టైంలో అల్లు రామలింగయ్య గారు, అరవింద్ ఇద్దరూ ఎమ్మెస్ రెడ్డి గారిని అడిగారు. మీరు చిరంజీవి గారిని ఒక వారం వదిలిపెట్టాలి. మా అమ్మాయితో పెళ్లి ఉంది అని చెప్పారు.
అల్లు రామలింగయ్య రిక్వెస్ట్ చేయడంతో..
అది ఫిబ్రవరి నెల. ఎమ్మెస్ రెడ్డి గారు అస్సలు ఒప్పుకోలేదు. చిరంజీవిని అస్సలు పంపను. కావాలంటే మేలో పెళ్లి పెట్టుకోండి. నేను మంచి ముహూర్తాలు చూస్తాను అని అన్నారు. చివరికి అల్లు రామలింగయ్య గారు ఆయన్ని చాలా రిక్వస్ట్ చేశారు. ఇదేంటండీ ఇలా అంటారు.. మీ అమ్మాయి పెళ్లి అయితే కూడా ఇలాగే మాట్లాడతారా అని రిక్వస్ట్ చేయడంలో కేవలం నాలుగు రోజుల సమయం ఇచ్చారు. అప్పట్లో తనకి అంత డిమాండ్ ఉండేది అని చిరంజీవి తెలిపారు.

