MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?

Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?

రాంచరణ్ నటించిన పెద్ది మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఓటీటీలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో జరిగిన తప్పుల గురించి సీనియర్ రచయిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 07 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan
Image Credit : Asianet News

Ram Charan

రాంచరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం పెద్ది తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది. కానీ ఇతర ప్రాంతాల్లో ఆశించిన సక్సెస్ అందుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి లాభాలు వచ్చాయి. 400 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. పెద్ది మూవీ రాంచరణ్ నటనకు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రాంచరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్ ఇచ్చాడని అంతా అంటున్నారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా పెద్ది మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్ది మూవీలో ప్రధాన సమస్య ఇదే
Image Credit : Asianet News

పెద్ది మూవీలో ప్రధాన సమస్య ఇదే

పరుచూరి మాట్లాడుతూ పెద్ది మూవీ గురించి కొందరు ఒకలా, మరికొందరు మరోలా మాట్లాడారు. నాకు మాత్రం పెద్ది మూవీ నచ్చింది. అయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి సరిచేసుకుని ఉంటే ఈ చిత్రం ఇంకా అద్భుతంగా ఉండే అవకాశం ఉండేది. ఈ చిత్రానికి ప్రధాన సమస్య లెన్త్. ఒక ఊర్లో రైలు ఆగాలి అనే చిన్న పాయింట్ మీద 3 గంటలకు పైగా సినిమా అంటే జోక్ కాదు. కానీ సినిమా మొత్తాన్ని రాంచరణ్ సింగిల్ హ్యాండెడ్ గా తన భుజాలపై మోశారు.

Related Articles

Related image1
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Related image2
Bigg Boss Telugu 10: ఒక్క మాటతో ట్రోల్ అయిన యంగ్ లిరిసిస్ట్.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ?
35
రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే..
Image Credit : others

రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే..

రాంచరణ్ తర్వాత ఈ మూవీ క్రెడిట్ దర్శకుడికే దక్కుతుంది అని పరుచూరి అన్నారు. అయితే ఆయన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ అనుకుని పొరపాటున పలుమార్లు ప్రస్తావించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. పెద్ది మూవీలో రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే, ఇంకెవరైనా నటించి ఉంటే ఈ సక్సెస్ కూడా దక్కేది కాదు అని పరుచూరి అన్నారు.

45
హీరోయిన్ కి ప్రాధాన్యం లేదు
Image Credit : X/@vriddhicinemas

హీరోయిన్ కి ప్రాధాన్యం లేదు

ఈ మూవీలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యం తక్కువ. ఈ మూవీలో ఇతర పాత్రలు తెలుగు వాళ్ళ గెటప్ లకు దూరంగా ఉన్నాయి. అంతగా గుర్తు పట్టేవిధంగా లేవు. హీరోకి క్రికెట్ లో ఎదురు దెబ్బ తగులుతుంది. కుస్తీలో కూడా ఎదురు దెబ్బ తగులుతుంది.

55
అది మాస్ ఆడియన్స్ కి నచ్చదు
Image Credit : Youtube

అది మాస్ ఆడియన్స్ కి నచ్చదు

హీరో అన్నిసార్లు దెబ్బ తినడం క్లాస్ ఆడియన్స్ కి నచ్చుతుందేమో కానీ మాస్ ఆడియన్స్ కి అంతగా నచ్చదు అని పరుచూరి అన్నారు. ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ రాంచరణ్ రేంజ్ కి తగ్గట్లుగా రాలేదు అని అనిపించినట్లు పరుచూరి పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Recommended image2
Bigg Boss Telugu 10: ఒక్క మాటతో ట్రోల్ అయిన యంగ్ లిరిసిస్ట్.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved