7 ఏళ్లలో 7 సార్లు రీమేక్, ప్రతి భాషలోనూ సూపర్ హిట్టే!
బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఒక సినిమా 7 ఏళ్లలో 7 సార్లు రీమేక్ అయ్యింది. ప్రతి భాషాలోనూ సక్సెస్ అయ్యింది. మరి ఆ విజయ రహస్యమేంటో చూద్దాం.
ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందుతాయి. ఇలాంటి సినిమాలకు సీక్వెల్ లేదా వేరే భాషల్లో రీమేక్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అలా 7 ఏళ్లలో 7 సార్లు రీమేక్ అయిన సినిమా ఏదో తెలుసా?
`దృశ్యం`
ఈ సినిమా దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక సంచలనం. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తయారై రూ.75 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. అదే `దృశ్యం`.
దృశ్యం
2013లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన సినిమా `దృశ్యం`. ఈ సినిమాలో మీనా, అంజిబా హాసన్, ఎస్తేర్ అనిల్, ఆషా శరత్ తదితరులు నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో 150 రోజులకు పైగా ఆడింది.
దృశ్యం
ఈ సినిమా విజయాన్ని చూసి, తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. 2014లో కన్నడ, తెలుగులో రీమేక్ అయ్యింది. తెలుగులో వెంకటేష్ చేశారు.
పాపనాశం
తమిళంలో `పాపనాశం` పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో కమల్ హాసన్, గౌతమి నటించారు. హిందీలో కూడా `దృశ్యం` పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో అజయ్ దేవగన్, శ్రియా, టబు ప్రధాన పాత్రలు పోషించారు.
దృశ్యం
ఇండియాలో అన్ని భాషల్లోనూ విజయం సాధించిన `దృశ్యం`, 2017లో శ్రీలంకలో రీమేక్ అయ్యింది. సింహళ భాషలో `ధర్మ యుద్ధం` పేరుతో రీమేక్ అయ్యింది.
దృశ్యం
ఇండియాలోనే కాకుండా చైనాలో కూడా రీమేక్ అయ్యింది. Sheep Without a Shepherd పేరుతో 2019లో విడుదలైంది. ఇండోనేషియన్, కొరియన్ భాషల్లో కూడా రీమేక్ అవుతుందని ప్రకటించారు.
దృశ్యం 2
మలయాళంలో `దృశ్యం 2` వచ్చింది. కోవిడ్ కారణంగా థియేటర్లు తెరవకపోవడంతో ఈ సినిమా 2021లో ఓటీటీలో విడుదలైంది. తెలుగులో కూడా దీన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది.
దృశ్యం 2
ఈ సినిమా కన్నడంలో దృశ్య 2 గా, తెలుగులో దృశ్యం 2 గా రీమేక్ అయ్యింది. హిందీలో దృశ్యం 2, 2022 నవంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. ఇలా ఏడేళ్లుగా రీమేక్ అవుతూనే ఉంది. విడుదలైన అన్ని చోట్ల విజయం సాధించింది. ఇలా రీమేక్ అయిన అన్ని చోట్ల సక్సెస్ అయిన సినిమాగా `దృశ్యం` రికార్డు క్రియేట్ చేసింది.
read more: Dilruba Teaser: బైక్ చైన్ తెంచిన కిరణ్ అబ్బవరం.. `దిల్‌రూబా` టీజర్‌లో హైలైట్స్