- Home
- Entertainment
- జూ ఆర్టిస్ట్ లు కృష్ణంరాజుని బట్టలు చిరిగేలా కొట్టారా? అసిస్టెంట్ కారణం పాపం రెబల్ స్టార్‌కి దారుణమైన అనుభవం
జూ ఆర్టిస్ట్ లు కృష్ణంరాజుని బట్టలు చిరిగేలా కొట్టారా? అసిస్టెంట్ కారణం పాపం రెబల్ స్టార్‌కి దారుణమైన అనుభవం
రెబల్ స్టార్‌ని సినిమా సెట్‌లో జూ ఆర్టిస్ట్ లు కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. అయితే అసిసోయేట్ డైరెక్టర్ చేసిన పనికి రెబల్ స్టార్ దెబ్బలు తినాల్సి వచ్చిందట. మరి ఆ కథేంటో చూస్తే.

రెబల్ స్టార్ కృష్ణంరాజు టాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో టాప్ స్టార్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్‌బాబులకు దీటుగా తాను సినిమాలు చేసి రాణించారు. రెబల్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ని, స్టార్‌డమ్‌ని తెచ్చుకున్నారు.
యాక్షన్ సినిమాలతో ఎక్కువగా ఆకట్టుకున్నారు కృష్ణంరాజు. అయిన హీరోగానే కాదు, విలన్‌గానూ సినిమాలు చేశారు. కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో విలన్‌గా వేషాలు వేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో విలన్‌గా చేసి మెప్పించారు. ఆ తర్వాత హీరోగా చేసి మెప్పించారు. యాంగ్రి మేన్ లుక్‌లతో, ఆవేశంతో కూడిన పాత్రలతో ఆయన రాణించారు. అదే రెబల్ స్టార్ ప్రత్యేకత కావడం విశేషం.
ఇదిలా ఉంటే కృష్ణంరాజుని ఓ సినిమా సెట్‌లో జూ ఆర్టిస్ట్ లు కొట్టారట. కో డైరెక్టర్ చేసిన పనికి కృష్ణంరాజు జూ ఆర్టిస్ట్ ల చేత దెబ్బలు తినాల్సి వచ్చిందట. మరి ఇంతకి ఏం జరిగిందంటే. కృష్ణంరాజు కెరీర్ బిగినింగ్‌లో `మహ్మద్ బిన్ తుగ్లక్`(1972) అనే సినిమాలో నటించారు. పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి బీవీ ప్రసాద్ దర్శకుడు. దాసరి నారాయణరావు డైలాగ్స్ రాశారు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా రాణించిన సాగర్ దీనికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఇందులో నాగభూషణం హీరోగా నటించగా, కృష్ణంరాజుది కీలక పాత్ర. ఇంకా అప్పటికీ హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు. అయితే ఇందులో తుగ్లక్(నాగభూషణం) మంచి వాడు కాదని బతుటా పాత్రలో నటించిన కృష్ణంరాజు ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ విషయం తుగ్లక్‌కి తెలుస్తుంది. ఆయన పోనిలే పిచ్చోడు, వదిలేయండి అని తన మనుషులతో అంటాడట. కానీ వాళ్లంతా చితక్కొట్టాల్సిన సీన్ ఉంది.
also read: త్రివిక్రమ్ కి షాక్.. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తోనే?.. బన్నీ కొత్త రూల్
ఈ సీన్‌లోనే జూ ఆర్టిస్ట్ లు కృష్ణంరాజుని నిజంగానే కొట్టారట. అయితే దీనికో కారణం ఉంది. కృష్ణంరాజుది భారీ పర్సనాలిటీ. ఆయన్ని కొట్టాలంటే జూ ఆర్టిస్ట్ లు మొదట ఇబ్బంది పడ్డారట. కానీ అసిసోయేట్‌గా ఉన్న సాగర్ ఏ కొట్టండి అని కోపంగా అరిచాడట. అంతే ఇక ఆవేశంలో కృష్ణంరాజుని నిజంగానే చితక్కొట్టారట. ఆ దెబ్బకి బట్టలు చిరిగిపోయాయని, ఒళ్లంతా హూనం అయిపోయి ఎర్రగా మారిపోయిందని, దీంతో తనని బాగా తిట్టాడని తెలిపారు దర్శకుడు సాగర్.
ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. `మహ్మద్ బిన్ తుగ్లక్` సినిమా క్లైమాక్స్ లో ఈ సీన్ వస్తుందని, సహజత్వం కోసం ట్రై చేస్తే నిజంగానే రెబల్ స్టార్ దెబ్బలు తినాల్సి వచ్చిందని సాగర్ వెల్లడించారు. ఆ రోజు తనని బాగా తిట్టుకున్నాడని వెల్లడించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండేళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. దర్శకుడు సాగర్(విద్యా సాగర్ రెడ్డి) కూడా గతేడాది చెన్నైలో కన్నుమూశారు.