Dilruba Teaser: బైక్ చైన్ తెంచిన కిరణ్ అబ్బవరం.. `దిల్‌రూబా` టీజర్‌లో హైలైట్స్
కిరణ్ అబ్బవరం `క` సినిమాతో ఇటీవలే హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా `దిల్‌రూబా`తో వస్తున్నాడు. ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో హైలైట్స్ చూద్దాం.
కిరణ్ అబ్బవరం కుర్ర హీరోల్లో ఇప్పుడు ముందు వరుసలో ఉన్న హీరో. పలు పరాజయాల అనంతరం ఇటీవల `క` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈమూవీ మంచి విజయం సాధించింది. దీంతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు కిరణ్ అబ్బవరం. హీరోగా తన ఇమేజ్‌ని పెంచుకున్నాడు. అంతేకాదు కథల ఎంపికలోనూ రూట్ మార్చాడు.
`దిల్‌రూబా` టీజర్ హైలైట్స్..
ట్రెండ్‌ని ఫాలో అవుతూ సరికొత్త కథలతో రాబోతున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు మరో క్రేజీ మూవీతో వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన `దిల్‌రూబా` అనే చిత్రంలో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరంకి జోడీగా రుక్సర్ దిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ప్రేమ, యాక్షన్ ప్రధానంగా ఈ మూవీ సాగింది. కాలేజీలోనే మ్యాగీ అనే అమ్మాయితో ప్రేమలో విఫలమయ్యాడు కిరణ్ అబ్బవరం. దీంతో బాగా హర్ట్ అయిపోయాడు. స్నేహితులు కింగ్ అండ్ జాన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ సలహాతో అమ్మాయిలకు, ప్రేమకి చాలా దూరంగా ఉన్నాడు. ఒంటరిగా చాలా కాలం ఉండిపోతాడు.
మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్టు కిరణ్ అబ్బవరం లైఫ్‌లోకి మరో అమ్మాయి వచ్చింది. ఆమెనే హీరోయిన్ రుక్సర్ దిల్లాన్. ఆమెని ఎంతో ఘాఢంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం పోరాడటతాడు. ఏకంగా యుద్ధమే చేస్తాడు. ఈ క్రమంలో చాలా కోల్పోవల్సి వస్తుంది. ప్రేమ, పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుందని తాజాగా విడుదలైన `దిల్‌రూబా` టీజర్ తెలియజేస్తుంది.
బైక్ చైన్ తెంచిన కిరణ్ అబ్బవరం..
ఇందులో యాక్షన్ సీన్లు హైలైట్‌గా నిలిచాయి. ఓ దశలో బైక్ చైన్ తెంపుతాడు కిరణ్ అబ్బవరం. చూస్తుంటే `శివ` సినిమాలోని నాగ్ సీన్‌ని గుర్తు చేస్తుంది. దీంతోపాటు పలు యాక్షన్ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం రేంజ్‌ని మించి ఆయా సీన్లు ఉండటం విశేషం.
దీంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. లవ్ సీన్లు, వాటిలోని ఇంటెన్సిటీ, ప్రేమ కోసం గొడవలు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకి, ఫ్యామిలీకి ముడిపెట్టే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. కాలేజీలో ప్రేమ కోసం కిరణ్ అబ్బవరం చేసిన పోరాటమే `దిల్ రూబా` సినిమా అని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది.
`క` సినిమాతో కొత్త ట్రాక్ ఎక్కాడు కిరణ్. కథల ఎంపికలోనూ మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు `దిల్‌రూబా` విషయంలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. చూడబోతుంటే మరో హిట్ పక్కా అనేలా ఉంటుంది. ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది. ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సరిగమ నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
read more: త్రివిక్రమ్ కి షాక్.. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తోనే?.. బన్నీ కొత్త రూల్
also read: బాలకృష్ణ ఊర్వశి బట్టలు ఉతుకుతున్నాడా? `డాకు మహారాజ్` సాంగ్, శేఖర్ మాస్టర్‌పై క్రేజీ ట్రోల్స్