`దబిడి దిబిడి` ట్రోలర్స్ కి కౌంటర్‌ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. అంతేకాదు `సమరసింహారెడ్డి` సినిమాలోని స్టిల్‌ని పంచుకుంటూ `డాకు మహారాజ్‌`పై హై ఇచ్చాడు.  

బాలకృష్ణ త్వరలో `డాకు మహారాజ్‌` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ విలన్‌గా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీ విడుదల కాబోతుంది. 

`దబిడి దిబిడి` సాంగ్‌పై ట్రోల్స్..

`డాకు మహారాజ్‌` మూవీకి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదలయ్యాయి. గురువారం `దబిడి దిబిడి` పాట విడుదలైంది. ఈ పాట ఇప్పుడు నెట్టింట దుమ్మురేపుతుంది. అయితే ఇది పాజిటివ్‌ కంటే ట్రోల్స్ పరంగానే వైరల్‌గా మారడం విశేషం. ఇందులో డాన్స్ స్టెప్పులను తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

బాలయ్య చేత ఇలాంటి స్టెప్పులు వేయిస్తారా? అంటూ విమర్శలు చేస్తున్నారు. హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా వెనకాల నుంచి బాలయ్య చేయితో కొట్టే సీన్ పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నారు. అవి దారుణంగా ఉన్నాయని, చాలా వల్గర్‌గా ఉన్నాయని కామెంట్‌ చేస్తున్నారు. దారుణంగా ఆడుకుంటున్నారు. 

ముఖ్యంగా కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే చేత ఇలాంటి స్టెప్పులేంట్రా అంటూ ఫైర్‌ అవుతున్నారు. శేఖర్‌ మాస్టర్‌ టాలెంట్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. దీంతో ఇప్పుడు `దబిడి దిబిడి` పాట బాగా చర్చనీయాంశం అవుతుంది.

ఇదిలా ఉంటే దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఆయన తనదైన స్టయిల్‌లో ట్రోలర్స్ కి కౌంటర్‌ ఇచ్చారు. అంతేకాదు బాలయ్య పాత సినిమా పోస్టర్‌ పంచుకుంటూ రచ్చ లేపాడు. 

read more: బాలకృష్ణ ఊర్వశి బట్టలు ఉతుకుతున్నాడా? `డాకు మహారాజ్‌` సాంగ్‌, శేఖర్‌ మాస్టర్‌పై క్రేజీ ట్రోల్స్

`సమరసింహారెడ్డి`ని రీక్రియేట్‌ చేసేలా `డాకు మహారాజ్‌`..

బాలకృష్ణ ఫ్యాక్షన్‌ సినిమాల ట్రెండ్‌కి తెరలేపిన విషయం తెలిసిందే. `సమరసింహారెడ్డి`తో ఈ ట్రెండ్‌ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో ఈ మూవీ పెద్ద సంచలనం. ఫ్యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీలో బాలయ్య విశ్వరూపం చూపించాడు. భారీ డైలాగ్‌లతోపాటు యాక్షన్‌ సీన్లతోనూ రెచ్చిపోయాడు.

అప్పట్లో ఈ మూవీలోని యాక్షన్స్ దుమ్మురేపాయి. మాస్‌ ఆడియెన్స్ ని ఊర్రూతలూగించాయి. ఆ సినిమా విజయంలో ఆ యాక్షన్‌ హైలైట్‌గా నిలిచింది. సిల్వర్‌ స్క్రీన్‌పై అవి మ్యాజిక్‌ చేశాయని చెప్పొచ్చు. ఆ మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ కాబోతుందని, దాన్ని మించి `డాకు మహారాజ్‌`లో యాక్షన్‌ ఉండబోతున్నాయని అంటున్నారు నిర్మాత నాగవంశీ. 

నిర్మాత నాగవంశీ కౌంటర్‌, సవాల్‌..

తాజాగా ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. `సమరసింహారెడ్డి`లోని బాలయ్య యాక్షన్‌ సీక్వెన్స్ కి సంబంధించిన స్టిల్‌ని పంచుకుంటూ `ఇది గుర్తుందా? నిజమైన మాస్‌ సినిమా అంటే ఏమిటో పునర్నిర్వచించిన సీక్వెన్స్ ఇది. నా మాటలను రాసిపెట్టుకోండి, `డాకు మహారాజ్‌` సినిమాలోని ద్వితీయార్థంలో ఒక సీక్వెన్స్ ఉంది. అది మళ్లీ అదే పిచ్చిని, గొప్పతనాన్ని తిరిగి తీసుకువస్తుంది.

మిమ్మల్ని ఆ అద్భుతమైన రోజులకు తీసుకెళ్తుంది. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు. జస్ట్ వెయిట్‌ అండ్‌ వాచ్‌` అంటూ ట్వీట్‌ చేశాడు నాగవంశీ. ఈ ఒక్క ట్వీట్‌తో అటు `దబిడి దిబిడి` ట్రోలర్స్ కి కౌంటర్‌ ఇస్తూనే సినిమాపై హై ఇచ్చాడు. మరో మాస్‌ జాతరకి రెడీ అవ్వండి అనే హింట్‌ ఇచ్చాడు నాగవంశీ. మరి అది ఏ రేంజ్‌లో ఉంటుందో అనేది జనవరి 12న తేలనుంది. 

Scroll to load tweet…

read more:త్రివిక్రమ్‌ కి షాక్‌.. అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్‌ తోనే?.. బన్నీ కొత్త రూల్‌