MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి ఇప్పుడు ప్రియదర్శితో రొమాన్స్.. దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ, వైరల్ ఫొటోస్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి ఇప్పుడు ప్రియదర్శితో రొమాన్స్.. దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ, వైరల్ ఫొటోస్

నటి ద్రిషికా చందర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఇప్పుడు తెలుగు సినిమాలో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో ఆమె ప్రియదర్శితో కలసి నటిస్తున్న సుయోధన అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 25 2026, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
DRISHIKA CHANDER
Image Credit : Asianet News

DRISHIKA CHANDER

సినీరంగంలోకి దూసుకుపోతున్నారు నటి ‘ద్రిషికా చందర్’. నటనా రంగంలో మరిన్ని మంచి పాత్రలు లభించాలని ఆమె కోరుకుంటున్నారు. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్
Image Credit : Asianet News

థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్

ఆమె సమర్థవంతమైన వక్తగానూ రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా, అనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం విశేషం. ఆమె తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు.

37
గిన్నిస్ వర్ల్డ్ రికార్డు
Image Credit : Asianet News

గిన్నిస్ వర్ల్డ్ రికార్డు

ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వర్ల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందడం ఆమె ప్రతిభకు తార్కాణం.

47
వెయ్యికి పైగా అవార్డులు కైవసం
Image Credit : Asianet News

వెయ్యికి పైగా అవార్డులు కైవసం

అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చలన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె మలయాళ చిత్ర సీమలోకి అడుగు పెట్టారు.

57
హే కమీనీ'లో నటనకు మంచి గుర్తింపు
Image Credit : Asianet News

హే కమీనీ'లో నటనకు మంచి గుర్తింపు

ఇటీవలే జియో సినిమాలో విడుదలైన హిందీ చలన చిత్రం 'హే కమీనీ'లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో వెండితెర ప్రేక్షకులను పలకరించారు.

67
'సుయోధన' చలన చిత్రం విడుదలకు సిద్ధంగా
Image Credit : Asianet News

'సుయోధన' చలన చిత్రం విడుదలకు సిద్ధంగా

ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చలన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి‌ హీరోగా, సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది మార్చి 27న విడుదల కానుంది. అలాగే ఆమె నటించిన మరికొన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి. వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది.

77
హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్ర
Image Credit : Asianet News

హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్ర

'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నివాస్ దర్శకత్వంలో 'వే 2 న్యూస్' వంటి ప్రముఖ మొబైల్ యాప్ కోసం చేసిన వాణిజ్య ప్రకటనలతో తన ప్రతిభను చాటుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్, రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?
Recommended image2
ఇది కదా రాజమౌళి విజన్, వారణాసిలో 25 నిమిషాల ఎపిసోడ్..చరిత్రలో నిలిచిపోయేలా చిత్రీకరణ, ఆ సెట్లు చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved