- Home
- Entertainment
- ఓటీటీలో తప్పక చూడాల్సిన రీసెంట్ టాప్ 5 మూవీస్.. మన సైంటిస్టుల కష్టం, అర్జెంట్ గా అది చూసేయండి
ఓటీటీలో తప్పక చూడాల్సిన రీసెంట్ టాప్ 5 మూవీస్.. మన సైంటిస్టుల కష్టం, అర్జెంట్ గా అది చూసేయండి
Top 5 OTT Movies: టాప్ 5 మూవీస్ఓటీటీలో తప్పనిసరిగా చూడాల్సిన రీసెంట్ టాప్ 5 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. ఇందులో చంద్రయాన్ 3 నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ కూడా ఉంది.

OTT Movies
ఓటీటీలో నిత్యం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఏదో ఒక కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఓటీటీలో కొన్ని అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. టాప్ 5 లిస్ట్ లో కొన్ని థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. అదే విధంగా సైంటిస్ట్ ల కష్టాన్ని తెలియజేసే వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కలాంకావల్
ఇది మమ్ముట్టి నటించిన సైకో థ్రిల్లర్ మూవీ. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నెగిటివ్ రోల్ లో సైకో పాత్రలో నటించారు. ఒంటరి మహిళలని ట్రాప్ చేసి, వాళ్ళని హోటల్ రూమ్ కి తీసుకువెళ్లడం, శారీరకంగా వారికి దగ్గర కావడం, ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చంపేసి పైశాచిక ఆనందం పొందే కథ ఇది.
ఎక్కడ చూడాలి: సోనీ లివ్ లో స్ట్రీమింగ్
చీకటిలో
మహిళల వరుస హత్యల నేపథ్యంలో ఈ ఓ క్రైమ్ జర్నలిస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ కథతో ఈ చిత్రం ఉంటుంది. క్రైమ్ జర్నలిస్ట్ గా శోభిత ధూళిపాళ నటించింది. సినిమా యావరేజ్ గా ఉన్నా క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. విలన్ పాత్ర సర్ప్రైజ్ చేసే విధంగా ఉంటుంది.
ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
దండోరా
కులం, పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో దండోరా మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. శివాజీ నటన ఈ మూవీకే హైలైట్ తప్పనిసరిగా యువత చూడాల్సిన సినిమా ఇది.
ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
తస్కరీ
ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇది. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు ఎలా పనిచేస్తారు ? వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి ? స్మగ్లర్స్ ని అడ్డుకునేందుకు వాళ్ళు ఎలా పనిచేస్తారు ? ఇలాంటి ఆసక్తికర అంశాలని చాలా థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ లో చూపించారు. స్మగ్లర్లు చేసే జిమ్మిక్కులు, వాటిని అడ్డుకునేందుకు కస్టమ్స్ అధికారులు వేసే పైఎత్తులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
స్పేస్ జెన్ చంద్రయాన్
అంతరిక్ష పరిశోధన, రాకెట్ లాంచింగ్ లాంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చంద్రయాన్ 2 వైఫల్యం తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల మానసిక స్థితి ఎలా ఉంది ? ఆ ఓటమిని అధికమించి చంద్రయాన్ 3 ప్రాజెక్టు ని ఎలా విజయపథంలో నడిపించారు అనే అంశాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

