- Home
- Entertainment
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
నందమూరి బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం చిత్రంపై సింగీతం శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై సెటైర్లు వేశారు.

డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు
టాలీవుడ్ లో లెజెండ్రీ దర్శకులలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన కెరీర్ లో 2 సినిమాలని మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఆ రెండు సినిమాలు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించినవే. అందులో ఒకటి ఆదిత్య 369, మరొకటి భైరవ ద్వీపం. ఈ 2 సినిమాలో బాలకృష్ణ కెరీర్ లో క్లాసిక్స్ గా మిగిలిపోయాయి.
భైరవ ద్వీపం సినిమాకు అవార్డులు
భైరవ ద్వీపం చిత్రం అనేక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు నంది అవార్డు అందుకున్నారు. అదే విధంగా ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నంది అవార్డు సొంతం చేసుకున్నారు. శ్రీ తుంబుర నారద అనే పాటకి ఎస్పీ బాలుకి అవార్డు వచ్చింది. దీనిపై శ్రీనివాసరావు సెటైరికల్ గా స్పందించారు.
వాళ్ళు చెప్పిందే గొప్ప పాట
నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యులు కొందరు ఉంటారు. వాళ్ళకి సంగీతంపై అవగాహన ఉంటుందో లేదో కూడా తెలియదు. జ్యూరీ సభ్యులు కాబట్టి వాళ్ల ఏది చెబితే అదే వేదం.. వాళ్లకు నచ్చినదే గొప్ప పాట. వాళ్ళకి నచ్చకుంటే అవి గొప్ప పాటలు కావు. శ్రీ తుంబుర నారద అనే పాటలో రాగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇదే గొప్ప పాట అని భావించి దానికి అవార్డు ఇచ్చారు. నా దృష్టిలో సందర్భానుసారంగా ఉండే ఏ సినిమా పాట అయినా గొప్పదే. రాగాలు ఉంటేనే అవార్డు ఇవ్వాలి అంటే మీరు త్యాగరాజ కీర్తనలకు మాత్రమే అవార్డు ఇవ్వాలి అని సింగీతం శ్రీనివాసరావు సెటైర్లు వేశారు.
బాలసుబ్రహ్మణ్యం ఏమన్నారంటే
శ్రీతుంబుర నారద పాట ఎంత గొప్పదో, నరుడా ఓ నరుడా అనే పాట కూడా అంతే గొప్పది అని సింగీతం శ్రీనివాసరావు అన్నారు. స్వరాభిషేకం అనే ఈవెంట్ లో 50 ఏళ్ళ క్రితం నాటి పాత సినిమాలో పాటని పాడారు. అక్కడున్న వాళ్లంతా ఆనందించి చప్పట్లు కొట్టారు. ఆ పాట గురించి బాలసుబ్రహ్మణ్యం స్టేజీపై మాట్లాడుతూ.. 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంత గొప్ప ఆదరణ లభిస్తోంది అంటే.. ఆ పాటలు ఎంత గొప్పవో అని బాలు మాట్లాడారు.
ఆ పాటలు యువతకు నచ్చవు
కానీ వాస్తవం ఏంటనే ఆ ఈవెంట్ లో ఉన్నవాళ్ళంతా 50 ఏళ్ళు పైబడినవాళ్ళే అంటూ సింగీతం శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. అప్పటి పాటలు విని మేము ఆనందిస్తాం. కానీ ఇప్పటి యువతకు ఆ పాటలు కచ్చితంగా నచ్చాల్సిందే అనే నియమం లేదు. ఒకసారి లతా మంగేష్కర్ గారు చాలా గొప్ప మాట చెప్పారు. ఆమె విజన్ కి నా మైండ్ పోయింది. మీ పాటలు చరిత్రలో ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటాయి, రాబోయే తరాలని కూడా అలరిస్తాయి అని ఎవరో మాట్లాడారు. దానికి ఆమె రియాక్ట్ అవుతూ.. నా పాటలని పదేళ్ల తర్వాత అప్పటి యువత అస్సలు వినరు. ఇది వాస్తవం. ఎందుకంటే నా పాటలు అన్నీ 4 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు ఉంటాయి. పదేళ్ల తర్వాత యువత అటెన్షన్ కేవలం ఒకటిన్నర లేదా 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. వాళ్ళు అలాంటి పాటలనే వింటారు కానీ నా పాటలు వినరు అని చెప్పారు. ఆమె ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి, ఇప్పుడు అదే నిజం కదా అని సింగీతం శ్రీనివాసరావు అన్నారు.

