శోభన్ బాబుని కొట్టిన నిర్మాత ఎవరో తెలుసా? అప్పట్లో సంచలనం.. చేతులు పైకెత్తాడని అంతగా రెచ్చిపోయాడా?
సోగ్గాడు శోభన్‌బాబు అంటే హుందాతనానికి, క్రమ శిక్షణకు మారుపేరు. అలాంటి స్టార్ హీరోని పట్టుకుని ఓ నిర్మాత కొట్టాడట. కోపంతో ఊగిపోయాడట.
తెలుగు తెర సోగ్గాడు శోభన్‌బాబు మన నుంచి దూరమై 16ఏళ్లు అవుతుంది. కానీ ఆయన సినిమాల ద్వారా, ఆయన కీర్తి ద్వారా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన గురించి ఎప్పుడూ ఏదో సందర్భంలో చర్చ నడుస్తూనే ఉంది. నటుడిగానూ, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగానూ, సంపాదించిన డబ్బుని పెట్టుబడి పెట్టే విషయంలోనూ, రిలేషన్స్ పరంగానూ ఆయన గురించి టాపిక్ వస్తూనే ఉంటుంది. ఆయన చుట్టూ చర్చ నడుస్తూనే ఉంది.
శోభన్‌బాబు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. నాటకాల నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రలతో మెప్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. జయలలిత తల్లినే శోభన్‌బాబుని చూసి ఇతను హీరో అయితే తమ కూతురు నటించదని తెగేసి చెప్పిన సంఘటన కూడా ఉంది.
అంతేకాదు ఆ సినిమాలో హీరోపాత్ర నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇలాంటి అవమానాలను ఎదుర్కొని తనని తాను నిరూపించుకుని ఆడియెన్స్ మెచ్చిన నటుడిగా, తిరగులేని స్టార్‌గా ఎదిగారు శోభన్‌బాబు.
హుందాతనానికి, క్రమ శిక్షణకు మారుపేరైనా శోభన్‌బాబుని ఓ నిర్మాత కొట్టాడట. చేతులు పైకెత్తుతున్నాడని కొట్టిన సంఘటన చోటు చేసుకుందట. అదే షాకిస్తుంది. శోభన్‌బాబుని ఒక నిర్మాత కొట్టడమేంటి? అసలు ఏం జరిగిందనేది చూస్తే.. ఆ నిర్మాత కాట్రగడ్డ మురారి. ఎప్పుడో నాలభై ఏళ్ల క్రితం ఆయన సినిమాలు చేశారు. అది కూడా పట్టుమని పది సినిమాలు కూడా లేవు(తొమ్మిది చిత్రాలు నిర్మించారు).
pic credit -abn
హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా తమకు నచ్చినట్టు సినిమా తీయాలనుకునే వ్యక్తి ఆయన. అందుకే ఇండస్ట్రీలో ఇమడలేకపోయారు. త్వరగానే ఇండస్ట్రీని వదిలేశారు. 1978లో సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. కె విశ్వనాథ్‌తో `సీతామహాలక్ష్మి` సినిమాని నిర్మించారు.
అది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత శోభన్‌బాబుతో `గోరింటాకు` మూవీని నిర్మించారు. ఇందులో శోభన్ బాబు, సుజాత, సావిత్రి నటించారు. దీనికి దాసరి నారాయణరావు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శోభన్‌బాబు చేసిన పనికి కొట్టాల్సి వచ్చిందట.
Sobhan Babu
సినిమాలో గోదావరి ఒడ్డున ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుందట. ఆ పాటలో శోభన్‌బాబు పదే పదే చేతులు పైకెత్తుతున్నాడట. పాటకి డాన్స్ చేస్తూ ఆయన అలాంటి మూమెంట్స్ ఇస్తున్నారు. వద్దు అని చెప్పినా పదే పదే అదే చేస్తున్నాడట. అయితే నిర్మాత చాలా దూరంగా ఉన్నాడు.
సోగ్గాడు చేస్తున్న పనికి కోపంతో రగిలిపోయాడట. ఎంత చెప్పినా అదే చేస్తున్నాడని మండిపోయాడు. కలిశాక చేతిలో ఏది ఉంటే అది శోభన్‌బాబుపై విసిరేశాడట. ఆ ఘటనతో టీమ్ అంతా షాక్ అయ్యిందట. అలా కొట్టిన సందర్భం కూడా ఉందని ఆయనే చెప్పడం విశేషం.
అయితే తమ మధ్య ఏరా పోరా అనుకునే స్నేహం ఉందని, ఆ స్నేహంతోనే కొట్టినట్టు తెలిపారు. ప్రేమతో జరిగిందే తప్ప అదేదో కావాలని చేసిందని కాదని, కానీ ఈ సన్నివేశంలో మాత్రం నిజంగానే కోపంతో ఆ పని చేశానని తెలిపారు కాట్రగడ్డ మురారి. హీరోలను, హీరోయిన్లని కొట్టడమనేది తన ఆవేదనతో చేసిన పని తప్ప, మరోటి కాదన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఆయన ఈ విషయం బయటపెట్టారు. ఇప్పుడిది వైరల్ అవుతుంది.
pic credit -abn
కాట్రగడ్డ మురారి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేశారు. యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌ని స్థాపించి `సీతామహాలక్ష్మి` సినిమాని నిర్మించారు. ఆ తర్వాత శోభన్‌బాబుతో `గోరింటాకు`, రామ్జీతో `జేగంటలు`, కృష్ణంరాజుతో `త్రిశూలం`, శోభన్‌బాబుతోనే `అభిమన్యుడు`, బాలకృష్ణతో `సీతారామ కళ్యాణం`, `నారి నారి నడుమ మురారి`, వెంకటేష్‌తో `శ్రీనివాస కళ్యాణం`, నాగార్జునతో `జానకీ రాముడు` చిత్రాలు నిర్మించారు. ఇందులో ఒకటి రెండు చిత్రాలు తప్ప అన్నీ సూపర్ హిట్స్ కావడం విశేషం. ఇక నిర్మాత రెండేళ్ల క్రితం కన్నుమూశారు.
read more:మహేష్ బాబు సినిమా వెయ్యి కోట్లు కాదు, అసలు బడ్టెట్ తెలిస్తే మైండ్ బ్లాకే.. రాజమౌళి ధైర్యం ఇదే?
also read: కండక్టర్ కాక ముందు రజనీకాంత్ ఏం చేశాడో తెలుసా? చివరికి అలాంటి పనా? అస్సలు ఊహించుకోలేం