ఎన్టీఆర్ 'సింహాద్రి'ని వద్దనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.? అస్సలు ఊహించలేరు
Simhadri Movie: దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'సింహాద్రి'. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా.? ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

టాలీవుడ్ టూ హాలీవుడ్..
దర్శకుడు రాజమౌళి.. అభిమానులు ముద్దుగా ఈయన్ని జక్కన్న అని పిలుచుకుంటారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని హాలీవుడ్ వరకు తీసుకెళ్ళిన జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబుతో 'వారణాసి' అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మర్యాద రామన్న', 'ఈగ', 'సింహాద్రి', 'సై' లాంటి సినిమాలతో తెలుగు అభిమానులను అలరించాడు రాజమౌళి.
సింహాద్రి ఫస్ట్ ఛాయస్..
దర్శకుడు రాజమౌళి రెండో చిత్రం 'సింహాద్రి'. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2003వ సంవత్సరంలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ మూవీకి మొదటి ఛాయస్ జూనియర్ ఎన్టీఆర్ కాదట. ఈ చిత్రం కథను మొదటిగా ఓ స్టార్ హీరోకు వినిపించారట రాజమౌళి. కానీ ఆ హీరో ఫస్ట్ అటెంప్ట్‌లోనే నో చెప్పేశాడట.
ఎన్టీఆర్ కాదట ప్రభాస్..
సింహాద్రి మూవీ కథను మొదటిగా పాన్ ఇండియా హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్‌కు వినిపించాడట రాజమౌళి. అయితే అప్పటికే రిలీజ్ అయిన 'స్టూడెంట్ నెంబర్ 1' చిత్రం ప్రభాస్‌కు నచ్చకపోవడంతో.. ఫస్ట్ సిట్టింగ్‌లోనే సింహాద్రి కథను రిజెక్ట్ చేశాడట ప్రభాస్. అలా సూపర్ హిట్ సినిమా చేతి వరకు వచ్చి.. చేజార్చుకున్నాడు ప్రభాస్. అయితేనేం ఆ తర్వాత రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో 'ఛత్రపతి', 'బాహుబలి 1&2' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి.
డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీలో నటిస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చికి ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్. అలాగే 'దేవర 2' మూవీ కూడా లైన్‌లో పెట్టనున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
వారాణసి మూవీతో రాజమౌళి..
ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2027 మార్చి నెలలో రిలీజ్ కానుంది. అటు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ్లోబల్ ట్రోట్టర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

