- Home
- Entertainment
- Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్
నటి దివి వద్త్య తన లవ్ బ్రేకప్‌పై ఓపెన్ అయ్యింది. బ్రేకప్ అయినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లిందట. అలాంటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకుందట. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యింది.

బిగ్ బాస్ షోతో దివి పాపులర్
బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది నటి దివి వద్త్య. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో ఆమె పాల్గొంది. అయితే షోలో ఉన్నది కొన్ని రోజులే అయినా అదరగొట్టింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి దృష్టిలోనూ పడింది. దీంతో ఆమెకి మంచి పాపులారిటీ వచ్చింది. అనంతరం పలు సినిమాల్లో మెరిసింది దివి. ఆమెనే హీరోయిన్‌గా `లంబసింగి` చిత్రంలో నటించింది. దీంతోపాటు `క్యాబ్ స్టోరీస్`లో మెయిన్ రోల్ చేసింది. `పుష్ప 2`, `సింబా`, `రుద్రంగి`, `జిన్నా, `నయీమ్ డైరీస్`, `గాడ్‌ఫాదర్`, `డాకు మహారాజ్` వంటి చిత్రాల్లో నటించి అలరించింది.
లవ్ బ్రేకప్‌పై ఓపెన్ అయిన దివి వద్త్య
ఇటీవల కాలంలో నటిగా రాణిస్తున్న ఆమె ఇప్పుడు తన గతాన్ని పంచుకుంది. లవ్ స్టోరీని వెల్లడించింది. బ్రేకప్ విషయాలను షేర్ చేసుకుంది. డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు చెప్పింది. తాజాగా దివి బిగ్ టీవీ నిర్వహించిన `కిస్సిక్ టాక్స్` షోలో పాల్గొంది. జబర్దస్త్ వర్ష హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న దివి తాను బ్రేకప్ టైమ్‌లో చాలా బాధపడిందట. మర్చిపోలేని రోజులవి అని వెల్లడించింది.
వాళ్లకి కూడా ఒక లైఫ్ ఉందనేది గుర్తించాలి
`లవ్ బ్రేకప్ అయిన తర్వాత అబ్బాయిలనుగానీ, అమ్మాయిలనుగానీ బ్యాడ్ చేస్తుంటారు. కానీ ఉన్నన్ని రోజులు వాళ్లే కదా నీకు తోపులు, వాళ్ల వెర్షన్‌లో వాళ్లు కరెక్ట్, వీళ్ల వెర్షన్ వీళ్లు కరెక్ట్. చూసిన నలుగైదుగురికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతాము. లవర్ మనతోటే ఉండాలనుకోవడం క్యూట్, అలా అనుకుంటేనే ప్రేమ. అలా అనుకోవడం లేదంటే అసలు ప్రేమ కాదు. అలా అనుకునే దాంట్లో కూడా ఒక ఫ్రీడమ్ ఉండాలి. నాతో ఉండాలి, కానీ తనకు కూడా ఒక లైఫ్ ఉందనేది గుర్తించాలి` అని చెప్పింది దివి.
లవ్ బ్రేకప్ చాలా పెయిన్‌తో కూడదని
ఈ సందర్భంగా మీ లైఫ్‌లో ఇలాంటి కష్టాలు మళ్లీ రావద్దురా అనుకున్నవి ఏవైనా ఉన్నాయా అని వర్ష అడగ్గా, లవ్ వర్కౌట్ కాకపోవడమే అని చెప్పింది. `అది చాలా పెయిన్‌తో కూడుకున్నది. ఒకరిని లవ్ చేయడం ఈజీ కాదు. ఎప్పుడైతే బ్రేకప్ అయ్యిందో లోపల మనస్సాక్షి చచ్చిపోయినట్టు, మనిషి చచ్చిపోయినట్టు ఉంటుంది. లవ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు తిన్నావా లేదా? అడగడం, నువ్వు జాగ్రత్తగా ఉన్నావా లేదా అని, ఇంటికి వెళ్లావా లేదా? అడగడం, ఇలాంటి కేర్ ఉన్నవాళ్లు చాలా హ్యాపీగా ఉంటారు. గిఫ్ట్ లు, ఇంకా ఏవేవో కాదు ముఖ్యం ఇవి ముఖ్యం. ఇళ్లల్లో ఉండి, వాళ్ల భర్తలతో ఉండి, వాళ్ల భర్తలు పక్కనే ఉన్న ఒంటరిగా ఫీలవుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది బాధపడుతున్నారు, అది భార్యలుగానీ, భర్తలుగానీ. వాళ్లు ఉంటారు గానీ వాళ్ల లైఫ్‌లో మ్యాజిక్ ఉండదు` అని చెప్పింది దివి వద్త్య.
నేను కూడా డిప్రెషన్‌లోకి వెళ్లాను
లవ్ బ్రేకప్ అయిపోయాక అందరు డిప్రెషన్‌లోకి వెళ్తారు, తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, అది కామన్ అని చెప్పింది. `లవ్ అనేది రెండు మూడేళ్లు జరుగుతుంది. అలాంటిది విడిపోయిన వెంటనే ఎలా విడిపోతాం, ఎలా మర్చిపోతాం. వాళ్లతో కట్ అయిపోలేం కదా, కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్లు, కరెక్ట్ గా ఉండేవాళ్లు, అన్నింటిలో పర్‌ఫెక్ట్ గా ఉండేవాళ్లు ఉండటం చాలా కష్టం, కానీ అలాంటి వాళ్లు దొరికితే మాత్రం, వదులుకోకూడదు. ఇక తనకు ఆ రోజే లాస్ట్ అయితే, ఆ రోజు ఏం చేయాలనుకుంటావ్ అని వర్ష ప్రశ్నించగా, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. మా ఇంట్లో అబ్బాయితో ఉండాలనుకుంటాను` అని తెలిపింది దివి. మొత్తంగా కుర్రాళ్ల హృదయాలను దోచుకునేలా ఆమె తన సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.

