MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `ఓం శాంతి శాంతి శాంతిః`. ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో తరుణ్‌కి ఈషా ఝలక్‌ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 23 2026, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ జంటగా `ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ
Image Credit : youtube/‎⁨@MovieVerseStudiosOfficial⁩

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ జంటగా `ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ

తరుణ్‌ భాస్కర్‌ ఇప్పుడు దర్శకుడిగా కంటే నటుడిగానే బిజీ అయిపోయాడు. ఓ వైపు హీరోగా, మరోవైపు కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా `ఓం శాంతి శాంతి శాంతిః` అనే చిత్రంలో నటించారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్‌. ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రకటన నుంచే ఆసక్తిని క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. హీరో విజయ్‌ దేవరకొండ శుక్రవారం సాయంత్రం సోషల్‌ మీడియా ద్వారా  ఈట్రైలర్‌ని పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్‌ ఎలా ఉందంటే
Image Credit : youtube/‎⁨@MovieVerseStudiosOfficial⁩

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్‌ ఎలా ఉందంటే

ఇక `ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ ట్రైలర్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. మరి ఈ ట్రైలర్‌ ఎలా ఉందనేది చూస్తే, సెటిల్డ్ హ్యూమర్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రధానంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారని అర్థమవుతుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో సాగే కథ ఇది. ఇందులో హీరో తరుణ్‌ భాస్కర్‌ పెళ్లి చూపులకు వెళ్తాడు. ఈషా రెబ్బాతో పెళ్లి చూపులు. ఇద్దరు ఏం మాట్లాడుకోరు.  ఈషా రెబ్బా ధైర్యం చేసి  చివరగా ఏ సినిమా చూశారని అడుగుతుంది. `వాల్తేర్‌ వీరయ్య` చూసినట్టు చెబుతాడు తరుణ్‌. అంతేకాదు అందులో ఇంటర్వెల్‌ లో ఉన్న డైలాగ్‌ కూడా చెబుతాడు. `ఈడు నా ఎర, నువ్వు నా సొర` అని, సొర అంటే గుర్తొచ్చింది. సముద్రపు షాపలు తింటారా మీరు` అని అడుగుతాడు తరుణ్‌.

Related Articles

Related image1
Anil Ravipudi నెక్ట్స్ సినిమా అప్‌ డేట్‌.. స్టార్స్ తో కాకుండా కుర్ర హీరోతో ప్లాన్‌.. పెద్ద రిస్కే
Related image2
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
36
సెటిల్డ్ హ్యూమర్‌తో ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్‌
Image Credit : youtube/‎⁨@MovieVerseStudiosOfficial⁩

సెటిల్డ్ హ్యూమర్‌తో ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్‌

ఆ తర్వాత బ్రహ్మాజీ.. తరుణ్‌ భాస్కర్‌ గొప్పతనం చెబుతాడు. కానీ ఆయన రియాలిటీ ఏంటో చూపించారు. తాగుడు, యాటిట్యూడ్‌ వంటివి ఆవిష్కరించారు. బంగారు తీగ అంటూ వర్ణించారు. అవి చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇందులో తరుణ్‌ తండ్రి పాత్ర పోషించిన పాత్రధారి `మా వాడు క్యారెక్టర్‌ లో రిప్‌.. రిచ్‌ ఇన్‌ పర్సనాలిటీ` అని వచ్చీ రాని ఇంగ్లీష్‌లో చెప్పడం షాకిస్తుంది. అనంతరం తరుణ్‌, ఈషాకిి పెళ్లి అవుతుంది. ఫ్యామిలీ లైఫ్‌లో ఇద్దరు బిజీ అవుతారు. అనంతరం గొడవల స్టార్ట్ అవుతాయి. చీటికి మాటికి భార్య ఈషా రెబ్బని కొడుతుంటాడు తరుణ్‌. వరుసగా ఆమెని కొట్టడం, దానికి ఇంట్లో చెల్లి, అమ్మ చేసే కామెంట్లు మరింత క్రేజీగా ఉన్నాయి. 

46
ఎటకారాలు సెట్‌ అవుతాయి, ప్రతీకారాలు కాదు
Image Credit : youtube/‎⁨@MovieVerseStudiosOfficial⁩

ఎటకారాలు సెట్‌ అవుతాయి, ప్రతీకారాలు కాదు

ఇక బ్రహ్మాజీ కలగజేసుకుని మన గోదారోళ్లకి ఎటకారాలు సెట్‌ అయినట్టు ప్రతీకారాలు సెట్‌ కావురా అని చెప్పడంతో తరుణ్‌ భాస్కర్‌ మారిపోతాడు. వ్యాయామం చేయడం, యోగా చేయడం, కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవడం చేస్తుంటాడు.

56
తరుణ్‌పై ఈషా తిరుగుబాటు
Image Credit : youtube/‎⁨@MovieVerseStudiosOfficial⁩

తరుణ్‌పై ఈషా తిరుగుబాటు

ఇక ఫోన్‌ విషయంలో ఈషా రెబ్బ, తరుణ్‌ భాస్కర్‌ ఇద్దరు పట్టుదలతో ఉంటారు. ఇద్దరూ లాక్కునే ప్రయత్నంలో మరోసారి ఈషాని కొట్టే ప్రయత్నం చేస్తాడు తరుణ్‌. ఈ సారి ఈషా తిరగబడుతుంది. ఆయన్ని అడ్డుకుంటుంది. రివర్స్ ఎటాక్‌కి దిగుతుంది. దీంతో ఈషా దగ్గరకు వస్తేనే వణికిపోతుంటాడు తరుణ్‌. ఇది ఆద్యంతం ఫన్నీగా ఉంది. శాంతి, మనశ్శాంతి అంటూ యోగా చేస్తుంటాడు తరుణ్‌. ఫైనల్‌గా `బుద్ధి తక్కువై, సినిమా సలహా ఇచ్చాను, హీరోకి తక్కువ, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ కి ఎక్కువలా తయారయ్యాడు` అని బ్రహ్మాజీ చెప్పడం ఆకట్టుకుంది.

66
స్ట్రాంగ్‌ రోల్‌తో వస్తున్న ఈషా రెబ్బా
Image Credit : youtube/‎⁨@MovieVerseStudiosOfficial⁩

స్ట్రాంగ్‌ రోల్‌తో వస్తున్న ఈషా రెబ్బా

మొత్తంగా ట్రైలర్‌ సెటిల్డ్ హ్యూమర్‌తో సాగుతూ ఆకట్టుకుంది. సినిమా మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో గోదావరి యాస హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈషా రెబ్బా పాత్ర ఇందులో బలంగా ఉంటుందని అర్థమవుతుంది. ఆమె చాలా సెటిల్డ్ యాక్టింగ్‌తో కనిపించింది. ఆమెకి కూడా ఈ మూవీ బౌన్స్ బ్యాక్‌ అయ్యే చిత్రంగా నిలుస్తుందనిపిస్తుంది. ఇక ఈ మూవీ ఈ నెల 30న థియేటర్లో విడుదల కాబోతుంది.  దీన్ని సృజన్‌ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్‌ కృష్ణాని, అనుప చంద్రశేఖరన్‌, సాధిక షేక్‌, నవీన్‌ శనివారపు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
Anil Ravipudi నెక్ట్స్ సినిమా అప్‌ డేట్‌.. స్టార్స్ తో కాకుండా కుర్ర హీరోతో ప్లాన్‌.. పెద్ద రిస్కే
Recommended image2
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved