- Home
- Entertainment
- బాలకృష్ణ చేసిన పనికి కన్నీళ్లు పెట్టిన స్టార్ డైరెక్టర్, రాజమౌళి తో ఏం చెప్పాడో తెలుసా? బాలయ్య అంటే అందుకే అంత గౌరవం..
బాలకృష్ణ చేసిన పనికి కన్నీళ్లు పెట్టిన స్టార్ డైరెక్టర్, రాజమౌళి తో ఏం చెప్పాడో తెలుసా? బాలయ్య అంటే అందుకే అంత గౌరవం..
బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలోని దర్శకులందరికి చాలా గౌరవం. ఆయన పనితీరుకు అంతా ఫిదా అయిపోతుంటారు. అయితే బాలయ్యబాబు వల్ల మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ఓ సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నారట... రాజమౌళి ఈ ఎమోషనల్ మూమెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బాలకృష్ణ గురించి స్టార్ డైరెక్టర్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంత సీరియస్ గా కనిపిస్తాడో.. అంత మంచివాడని ఇండస్ట్రీలో పేరుంది. ఎవరికి ఇవ్వాల్సిన గౌవరం వారికి ఇస్తుంటాడు బాలయ్య..ముఖ్యంగా ఆయనతో పనిచేసిన దర్శకులైతే.. బాలయ్య బాబు గురించి చాలాగొప్పగా చెపుతుంటారు. ఈక్రమంలోనే నందమూరి హీరోతో అద్భుతమైన సినిమా చేసిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. బాలకృష్ణ గురించి రాజమౌళి దగ్గర ఓపెన్ అయ్యారట. ఆయన గురించి చెపుతూ.. ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టాడట స్టార్ డైరెక్టర్. ఈ విషయాన్ని రాజమౌళి కూడా ఓ కార్యక్రమంలో ఎమోషనల్ గానే వెల్లడించాడు. ఇంతకీ వినాయక్ ఏమన్నాడు..?
డైరెక్టర్ల హీరో బాలకృష్ణ..
నందమూరి బాలకృష్ణ అంత సీరియస్ గా ఉంటాడు.. హవా చూపిస్తాడు కానీ.. సినిమా షూటింగ్ అంటే మాత్రం ఆయన తీరు మారిపోతుంది. సెట్ లో ఉన్నది ఎంత పెద్ద దర్శకుడు అయినా.. కొత్తగా వచ్చిన జూనియర్ అయినా.. డైరెక్టర్ ఛైర్ కి రెస్పెక్ట్ ఇస్తాడు బాలయ్య బాబు. ఆ స్థానంలో ఉండి వారు ఏది చెపితే అది వింటాడు. ఎలా చేయమంటే అలా చేస్తాడు. కథలో కానీ, డైరెక్టర్ చేయాల్సిన ఇతర పనుల్లో కానీ బాలయ్య వేలు పెట్టడు. డైరెక్టర్లు చెప్పింది విని.. వారికి మంచి షాట్ వచ్చే వరకూ చేసి.. పేకప్ చెప్పిన తరువాతే ఆయన తన క్యారవాన్ లోకి వెళ్తాడు. అందుకే బాలయ్యతో పనిచేసిన దర్శకులకు ఆయనంటే ఎంతో ఇష్టం.
వినాయక్ తో బాలయ్య ఏమన్నాడంటే?
బాలకృష్ణ , వినాయక్ కాంబినేషన్ లో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. కానీ కమర్షియల్ గా బయటపడలేకపోయింది. ఈ సినిమాలో ఓ సాంగ్ ను రిలీజ్ తరువాత షూట్ చేసి ఆడ్ చేశారు. మూవీ రిజెల్ట్ చూసిన వినాయక్.. ఆ సాంగ్ షూట్ టైమ్ లో చాలా డల్ గా కనిపించడంతో.. బాలయ్య వినాయక్ ను పిలిచి.. '' చూడండి బ్రదర్ రిజెల్ట్ ను ఎప్పుడు ఇంత పర్సనల్ గా తీసుకోవద్దండి..
మీరు ఈ సినిమా కోసం 100 శాతం ఇచ్చారు కదా.. ఈ కథ బాగుంటుందని నమ్మి.. నేను ఈసినిమా చేశాను. షూటింగ్ అంతా చాలా ఎంజాయ్ చేశాను. కథ నాకు అంత బాగా నచ్చింది. కానీ గెలుపోటములు మన చేతుల్లో ఉండవు.. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలి. దీని వల్ల మీ మీద ఏమాత్రం గౌరవం తగ్గలేదు.. ఇంకా పెరిగింది. మీరు నాతో సినిమా చేయాలనుకుంటే మళ్లీ కథ చెప్పండి నేను రెడీగా ఉన్నాను.. డేట్స్ కూడా ఇస్తాను '' అని అన్నారు.
రాజమౌళితో చెప్పి ఎమోషనల్ అయిన వినాయక్..
వివి వినాయక్ ఓ సందర్భంలో రాజమౌళి దగ్గరఈ విషయాన్ని చెప్పారట. రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో బాలయ్య గురించి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ''వినాయక్ గారు బాలకృష్ణ గారి గురించి చెపుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా గ్రేట్ అండీ ఆయన.. డైరెక్టర్లకు ఎంత వాల్యూ ఇస్తారు. విగ్ బాలేదు అన్నా.. డ్రెస్ బాలేదు అన్నా.. వెంటనే బాలేదా.. అయితే తీసేద్దాం అంటారు. డైరెక్టర్ ఏది చెపితే అది ఫైనల్.. అంతే ఇక వేరే మాట ఉండదు. ఇది చేద్దా.. అది చేద్దాం అని అనడు. అదే బాలయ్య గొప్పతనం'' అని రాజమౌళి అన్నారు.
దూసుకుపోతున్న బాలకృష్ణ..
నందమూరి నటసింహం బాలయ్య బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుసగా 5 సినిమాలతో సక్సెస్ సాధించిన బాలకృష్ణ.. మరో సినిమా చేస్తే డబుల్ హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. అఖండ సినిమాతో స్టార్ట్ అయిన విజయాలు.. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నెక్ట్స్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈసినిమా లో నయనతార హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. 65 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్ కు పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్నాడు బాలకృష్ణ.

