MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌

Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌

నటుడు, రైటర్‌, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఇటీవల `ఆపరేషన్‌ అరుణారెడ్డి` చిత్రంతో అలరించారు. ఈ క్రమంలో ఆయన తన జీవితంలో జరిగిన ఒక బాధాకర సంఘటనని పంచుకున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 28 2026, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తనదైన కామెడీకి కేరాఫ్‌ పోసాని
Image Credit : our own

తనదైన కామెడీకి కేరాఫ్‌ పోసాని

పోసాని కృష్ణమురళీ నటుడిగా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే. ఆయన పాజిటివ్‌ రోల్స్ తోపాటు నెగటివ్‌ రోల్స్ కూడా చేశారు. తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. పాత్ర ఏదైనా అందులో తన మార్క్ ని చూపిస్తూ అలరించడం పోసాని ప్రత్యేకత. నటుడిగానే కాదు, రైటర్‌గా బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చారు. దర్శకుడిగా తన మార్క్ తో ఆకట్టుకున్నారు. స్వతహాగా పోసాని ముక్కుసూటి, భోళా మనిషి.. మనసులో ఏముండదు, ఏదున్నా అప్పటికప్పుడు అనేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఫ్రీ అయిపోతారు. అయితే కొన్నిసార్లు ఆయన మాట తీరు ఇబ్బందులు క్రియేట్‌ చేస్తుంది. ఎదుటి వారిని బాధపెట్టొచ్చు. కానీ ఆ తర్వాత ఆయన ఫ్రీగా కలిసిపోతారు. రాజా అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. అంతే ప్రేమతో అక్కున చేర్చుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భార్య విషయంలో తాను పడ్డ బాధని పంచుకున్న పోసాని
Image Credit : our own

భార్య విషయంలో తాను పడ్డ బాధని పంచుకున్న పోసాని

ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పోసాని తన జీవితంలో జరిగిన ఒక బాధాకర సంఘటనని పంచుకున్నారు. `ఏసియానెట్‌ న్యూస్‌`తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన గురించి ఓపెన్‌ అయ్యారు. `ఆగడు` సినిమా సమయంలో తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఆ సినిమా సమయంలో తన భార్యకి స్టమక్‌ ఆపరేషన్‌ జరిగిందట. మొదట బాగానే ఉంది. కానీ తర్వాత అది ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందట. పొట్ట భాగం మొత్తం ఇన్‌ఫెక్షన్‌ కావడంతో పరిస్థితి సీరియస్‌గా మారిందట. డాక్టర్లు కూడా చెప్పలేమన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందట.

Related Articles

Related image1
Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Related image2
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత
34
కష్టకాలంలో అండగా నిలిచిన మహేష్‌ బాబు, నమ్రత
Image Credit : Asianet News

కష్టకాలంలో అండగా నిలిచిన మహేష్‌ బాబు, నమ్రత

ఆ సమయంలో పోసాని `ఆగడు` సినిమా షూటింగ్‌ లో ఉన్నారట. ఈ విషయం తెలియగానే షూటింగ్‌ ఆపేసి హాస్పిటల్‌ వెళ్లమని చెప్పారట మహేష్‌. చెప్పడమే కాదు, ముందు మీ భార్యని చూసుకో, షూటింగ్‌ తర్వాత అని చెప్పారట. మహేష్‌ బాబుతోపాటు నమ్రత కూడా ఎంతో సపోర్ట్ చేశారట. ఆసుపత్రికి వచ్చి నమ్రత దగ్గరుండి కేర్‌ తీసుకున్నారు. ఆ సమయంలో మహేష్‌ దేవుడిలా సపోర్ట్ చేశాడని, నమ్రతగారు ఎంతో అండగా నిలిచారని తెలిపారు. అలాంటి పరిస్థితి నుంచి తాను బయటపడ్డానని, డాక్టర్లు అయితే తన భార్య బతకదని చెప్పారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

44
ఫోన్‌ రాకూడదంటూ దేవుడికి ప్రార్థన
Image Credit : our own

ఫోన్‌ రాకూడదంటూ దేవుడికి ప్రార్థన

దాదాపు నాలుగైదు గంటలపాటు ఆపరేషన్‌ జరిగిందని, తాను ఆపరేషన్‌ థియేటర్‌ బయటే కూర్చున్నానని, వైద్యులు తన వద్ద ఒక ఫోన్‌ పెట్టారని, మధ్యలో ఫోన్‌ వస్తే బ్యాడ్‌ న్యూస్‌, ఫోన్‌ రాలేదంటే గుడ్‌ న్యూస్‌. అలాంటి పరిస్థితుల్లో క్షణక్షణం టెన్షన్‌ పడ్డానని, సినిమా అవకాశాల విషయంలో ఫోన్‌ రావాలని కోరుకునే తాను, ఆ రోజు మాత్రం ఫోన్‌ రాకూడని దేవుడిని ప్రార్థించుకున్నానని, లక్కీగా ఐదు గంటల వరకు ఫోన్‌ రాలేదని, అప్పుడూ ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపారు పోసాని కృష్ణమురళీ. తన భార్య ప్రాణాలతో బయటపడిందని చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. ఆ సమయంలో తనకు అండగా నిలిచి సపోర్ట్ చేసిన మహేష్‌ బాబు, నమ్రత, దర్శకుడు శ్రీనువైట్ల, అలాగే కృష్ణారెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Recommended image2
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత
Recommended image3
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Related Stories
Recommended image1
Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Recommended image2
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved