లగ్జరీ ఇల్లు కట్టి స్టార్ డైరెక్టర్ కాళ్ళు పట్టుకున్న కమెడియన్..ఆ కృతజ్ఞత కూడా నితిన్, నవదీప్ లకు లేదా ?
స్టార్ లతో సినిమా చేసే దర్శకులు చాలా మంది ఉంటారు. కానీ ఎలాంటి పాపులారిటీ లేని నటీనటులని పరిచయం చేసే సాహసం కొందరు దర్శకులు మాత్రమే చేస్తారు. అలాంటివారిలో డైరెక్టర్ తేజ ఒకరు. తేజ తన కెరీర్ లో లెక్కలేనంత మంది హీరో హీరోయిన్లని, కొత్త ఆర్టిస్టులని పరిచయం చేశారు.
స్టార్ లతో సినిమా చేసే దర్శకులు చాలా మంది ఉంటారు. కానీ ఎలాంటి పాపులారిటీ లేని నటీనటులని పరిచయం చేసే సాహసం కొందరు దర్శకులు మాత్రమే చేస్తారు. అలాంటివారిలో డైరెక్టర్ తేజ ఒకరు. తేజ తన కెరీర్ లో లెక్కలేనంత మంది హీరో హీరోయిన్లని, కొత్త ఆర్టిస్టులని పరిచయం చేశారు. వారిలో కొందరు మంచి గుర్తింపు తెచ్చుకుని సెటిల్ అయినవాళ్లు కూడా ఉన్నారు.
తమని పరిచయం చేసిన దర్శకుడిపట్ల ఏ నటుడికైనా కృతజ్ఞత భావం ఉంటుంది. అయితే దీనిపై డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పరిచయం చేసిన నితిన్, ఉదయ్ కిరణ్, నవదీప్ లలో బెస్ట్ యాక్టర్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. తేజ వీళ్లెవరి పేర్లు చెప్పకుండా మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ అని అన్నారు. ఉదయ్ కిరణ్ మంచోడు, అమాయకుడు అని అన్నారు. నవదీప్ మంచి నటుడు.. నితిన్ ఒకే అని తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వీరిలో మీపై ఎవరికీ బాగా కృతజ్ఞతా భావం ఉంది అని యాంకర్ అడిగారు. తేజ సమాధానం ఇస్తూ నేను మొత్తం టెక్నీషియన్లు, నటీనటులు అందరిని కలిపి 1000 మంది పైగా పరిచయం చేసి ఉంటా. వీరిలో 15 మందికి కూడా కృతజ్ఞత ఉండడం కష్టమే అంటూ తేజ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొంతమంది ట్విటర్ లో, సోషల్ మీడియాలో గ్రాటిట్యూడ్ చూపిస్తుంటారు. అది మనస్ఫూర్తిగా వచ్చే గ్రాటిట్యూడ్ కాదు. మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపించేవారు 15 మంది కంటే తక్కువే ఉంటారు అని తేజ అన్నారు.
కమెడియన్ సుమన్ శెట్టి గురించి తేజ ప్రత్యేకంగా చెప్పారు. సుమన్ శెట్టిని జయం చిత్రంతో నేను పరిచయం చేశా. అప్పుడే సుమన్ శెట్టికి చెప్పా.. ఈ మూవీ తర్వాత నీకు మంచి ఆఫర్స్ వస్తాయి. డబ్బు వృధా చేసుకోకుండా స్థలం కొనుక్కుని మంచి ఇల్లు కట్టుకో అని చెప్పా. అనుకున్నట్లుగానే మంచి లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టిన తర్వాత వచ్చి ఇదంతా మీ వల్లే సార్ అని నా కాళ్ళు మొక్కాడు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడిగాడు. ఏమి చేయోద్దమ్మా.. నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తుంటా. అలాంటప్పుడు నేను ఫెయిల్ అయి రోడ్డున పడితే నాకు ఇల్లు కూడా ఉండదు.
నీ ఇంట్లో నాకు ఒక గది ఇవ్వు చాలు అని అడిగా. నేను అడిగినట్లుగానే సుమన్ శెట్టి తన ఇంట్లో నా కోసం ఒక రూమ్ కేటాయించాడు. అందులో నా ఫోటో పెట్టి రోజూ క్లీన్ చేస్తుంటాడు అని తేజ తెలిపారు. ఆ విధంగా సుమన్ శెట్టి నా పట్ల కృతజ్ఞత ప్రదర్శించాడు అని తేజ అన్నారు. కాజల్ కి కూడా నేనంటే మంచి అభిమానం ఉంది. మిగిలిన వాళ్ళు ఇంతకు కాకుంటే ఇంకొక దర్శకుడు అనుకునే రకాలు అంటూ తేజ సంచలన వ్యాఖ్యలు చేసారు.