MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramya Krishna: సినిమా షూటింగ్ అయిపోయాక.. డైరెక్టర్ చేసిన పనికి ఏడ్చేసిన రమ్యకృష్ణ

Ramya Krishna: సినిమా షూటింగ్ అయిపోయాక.. డైరెక్టర్ చేసిన పనికి ఏడ్చేసిన రమ్యకృష్ణ

అలనాటి తార రమ్యకృష్ణకు పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా వందల సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పటికీ గొప్ప గొప్ప పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. కాగా ఆవిడను ఓ సీనియర్ డైరెక్టర్ మూవీ షూటింగ్ తర్వాత ఏడిపించేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 03 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Ramya Krishna
Image Credit : our own

Ramya Krishna

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి అందరికీ సుపరిచితమే. తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని గొప్ప చిత్రాలు అందించిన ఘనత ఆయనది. ఆయన దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అనే గ్యారెంటీ ఉండేది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. త్వరలో ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ, సౌందర్య గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

23
రమ్యకృష్ణ ని ఏడిపించేసిన డైరెక్టర్ కృష్ణా రెడ్డి...
Image Credit : india glitz

రమ్యకృష్ణ ని ఏడిపించేసిన డైరెక్టర్ కృష్ణా రెడ్డి...

రమ్యకృష్ణ, శ్రీకాంత్ జంటగా నటించిన చిత్రం ఆహ్వానం. ఈ మూవీలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపం చూపించారు. అప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఆమె.. ఈ మూవీలో ఇక ఇల్లాలు గా, ఆమె పడే వేదనను చాలా అద్భుతంగా పండించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక.. ఎస్వీ కృష్ణా రెడ్డి గారు ఆమెకు వెండి పళ్లెంలో పట్టబట్టలు, పదివేల రూపాయలు ఇచ్చి.. బొట్టి పెట్టిమరీ గౌరవించారట. ఆయన చూపించిన ప్రేమకు రమ్యకృష్ణ గారు ఏడ్చేశారట. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణా రెడ్డి స్వయంగా చెప్పడం విశేషం.

నిజానికి.. ఆహ్వానం మూవీ నాటికి రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్. ఆమెకు పదివేల రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ.. ఆయన ఇచ్చిన గౌరవానికి ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. సాధారణంగా షూటింగ్ అయిపోగానే రెమ్యూనరేషన్ ఇచ్చి పంపే రోజుల్లో.. ఇలా ఒక ఆడబిడ్డలా గౌరవించడం ఆమెను కదిలించింది. అందుకే... ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Related Articles

Related image1
Dhanush: మృణాళ్ కంటే ముందు ధనుష్ ఇంత మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా?
Related image2
Keerthy Bhat: డబ్బున్నవాడు దొరకగానే నన్ను వదిలేసింది.. కీర్తీ భట్ పై బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్
33
సౌందర్య - గొప్ప సంస్కారం:
Image Credit : Asianet News

సౌందర్య - గొప్ప సంస్కారం:

సౌందర్య గారి గురించి ఎస్వీ కృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలు ఆమె నిబద్ధతను తెలియజేస్తాయి. సాధారణంగా స్టార్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోన్ చేయడం తక్కువ. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించాలని ఆమెకు ఎంత తపన ఉండేదో దీనివల్ల తెలుస్తుంది. ఒక సినిమాలో నటించే అవకాశం కోల్పోయిన ఆవిడ.. తర్వాత మరో సినిమాకి ఫోన్ చేసి మరీ తానే నటిస్తాను అని చెప్పారు అని ఎస్వీ కృష్ణా రెడ్డి గారు చెప్పారు.

సౌందర్య గారు చిన్న వయసులోనే చనిపోవడం ఎస్వీ కృష్ణారెడ్డి గారిని ఎంతగా బాధించిందో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. ఆమెను కేవలం నటిగా కాకుండా ఒక ఆత్మీయురాలిగా భావించడం వల్ల, ఆమెను స్క్రీన్ మీద చూసినప్పుడు కలిగే బాధను తట్టుకోలేక ఆయన టీవీ ఆఫ్ చేసేవాడిని చెప్పారు. చాలా కాలంపాటు.. సౌందర్య టీవీలో కనిపిస్తే.. చూసేవాడిని కాదు అని చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Related Stories
Recommended image1
Dhanush: మృణాళ్ కంటే ముందు ధనుష్ ఇంత మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా?
Recommended image2
Keerthy Bhat: డబ్బున్నవాడు దొరకగానే నన్ను వదిలేసింది.. కీర్తీ భట్ పై బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved