MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా

Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా

ఫ్లాప్ సినిమాతో ఓ దర్శకుడికి అవకాశాలు దూరం అయ్యాయి. అలాంటి టైంలో ఆ దర్శకుడికి అల్లు అరవింద్ ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతగా ఆ దర్శకుడు తన కొడుక్కి అల్లు అరవింద్ గారి పేరే పెట్టుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 08 2026, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డైరెక్టర్ పరశురామ్
Image Credit : Asianet News

డైరెక్టర్ పరశురామ్

టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలతో గుర్తింపు పొందిన క్రేజీ డైరెక్టర్స్ లో పరశురామ్ ఒకరు. పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి దర్శకుడిగా ఎదిగారు పరశురామ్. తన తొలి చిత్రం యువతతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత రవితేజతో చేసిన ఆంజనేయులు నిరాశ పరిచింది. వెంటనే సోలో మూవీ చేసి హిట్ కొట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సారొచ్చారు మూవీ డిజాస్టర్
Image Credit : our own

సారొచ్చారు మూవీ డిజాస్టర్

దీని గురించి పరశురామ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోలో తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇక త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ తర్వాత నువ్వే అంటూ భజన చేశారు. ఆ తర్వాత వెంటనే రవితేజతో సారొచ్చారు మూవీ చేశా. అది నా డ్రీం ప్రాజెక్ట్. కానీ కొన్ని తప్పుల వల్ల డిజాస్టర్ అయింది. నన్ను త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ అంటూ పొగిడిన వాళ్లే వదిలిపెట్టి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ నన్ను మానసికంగా గాయపరిచి వెళ్లారు. సారొచ్చారు తర్వాత నాకు 3 ఏళ్ళు సినిమా ఆఫర్స్ లేవు.

35
మూడేళ్ళ తర్వాత మరో ఛాన్స్
Image Credit : our own

మూడేళ్ళ తర్వాత మరో ఛాన్స్

ఆ టైంలో నాకు బన్నీ వాసు బాగా క్లోజ్. అప్పుడప్పుడూ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఏమైనా రాస్తున్నావా అని అడిగేవారు. బన్నీ వాసుతో మాట్లాడితే రిలీఫ్ గా అనిపించేది. బన్నీ వాసు నుంచి ఫోన్ వస్తే ఏదైనా ఆఫర్ ఉందేమో అని ఆశగా ఎదురు చూసేవాడిని. నేను అనుకున్నట్లే సారొచ్చారు తర్వాత మూడేళ్లకు బన్నీ వాసు ఒక ఆఫర్ తీసుకువచ్చారు. అల్లు అరవింద్ గారు నిన్ను మీట్ కావాలని అంటున్నారు అని చెప్పాడు.

45
ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్
Image Credit : youtube/@aha

ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్

వెళ్లి కలిశాను. అల్లు శిరీష్ కి నేను చేసిన సోలో మూవీ అంటే బాగా ఇష్టం అట. ఆ తరహాలో ఒక సాఫ్ట్ మూవీ చేయమని అల్లు అరవింద్ గారు అడిగారు. వెంటనే రూ.10 లక్షల చెక్కు ఇచ్చారు. నాకు ఎడారిలో వర్షం పడ్డ ఫీలింగ్ వచ్చింది. అప్పుడే శ్రీరస్తు శుభమస్తు మూవీ కథ రాసి తీశాను. ఆ మూవీ మంచి విజయమే సాధించింది.

55
నా కొడుక్కు ఆయన పేరే..
Image Credit : instagram

నా కొడుక్కు ఆయన పేరే..

అదే సమయంలో నాకు కొడుకు పుట్టాడు. అల్లు అరవింద్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళు అవి అని పిలుస్తుంటారు. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో నా కొడుక్కి అవ్యాన్ అని పేరు పెట్టినట్లు పరశురామ్ గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు
Recommended image2
YouTuber Madhumita: కిలాడీ యూట్యూబర్ మధుమితపై దొంగతనం కేసు.. తెలివిగా మెడలో గొలుసు కొట్టేసింది
Recommended image3
Nana Patekar Net Worth: రూ. 35 నుంచి కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్
Related Stories
Recommended image1
Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు
Recommended image2
OTT: ఓటీటీలోకి రాబోతున్న మలయాళీ థ్రిల్లర్.. చిన్న గొడవతో పెద్ద హంగామా, రఫ్ఫాడించిన నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved