MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు

Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు

వాచ్‌మన్ గా పనిచేస్తూ కష్టాలు ఎదుర్కొన్న ఓ నటుడు ఏకంగా చిరంజీవి సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేశారు. దెబ్బకు ఆ సినిమాతో అతడి జాతకం మారిపోయింది. టాలీవుడ్ లో క్రేజీ విలన్ గా మారిపోయాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 08 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

టాలీవుడ్ లోకి నార్త్ విలన్ లు రావడం సహజమే. అలా నార్త్ నుంచి వచ్చి క్రేజీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగిన వారిలో షాయాజీ షిండే ఒకరు. షాయాజీ షిండే ఓ ఇంటర్వ్యూలో నటుడిగా తన స్ట్రగుల్, తొలి అవకాశం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షాయాజీ షిండే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కి చెందిన వ్యక్తి. తమది వ్యవసాయ కుటుంబం అని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాచ్‌మన్ గా పనిచేసిన నటుడు
Image Credit : Tagore Movie

వాచ్‌మన్ గా పనిచేసిన నటుడు

షాయాజీ షిండే మాట్లాడుతూ.. కాలేజీలో చదువుతున్న రోజుల్లో నైట్ వాచ్‌మన్ గా జాబ్ చేస్తూ మార్నింగ్ కాలేజీకి వెళ్ళేవాడిని. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. సెక్యూర్డ్ లైఫ్. కానీ నాకు సంతృప్తి అనిపించలేదు. నటుడు కావాలనే కోరిక ఉంది. దీనితో ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై వెళ్లి నాటకాలలో నటించడం ప్రారంభించాను. పదేళ్ల పాటు అవకాశాల కోసం ప్రయత్నించిన తర్వాత 2000 సంవత్సరం నుంచి నీకు గుర్తింపు రావడం ప్రారంభం అయింది.

35
ఫ్లాప్ మూవీ తర్వాత మెగాస్టార్ సినిమాలో ఛాన్స్
Image Credit : Twitter

ఫ్లాప్ మూవీ తర్వాత మెగాస్టార్ సినిమాలో ఛాన్స్

చూడాలని ఉంది రీమేక్ సినిమా కలకత్తా మెయిల్ మూవీలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకి అల్లు అరవింద్, అశ్విని దత్ నిర్మాతలు. అదే సమయంలో చిరంజీవి గారి ఠాగూర్ మూవీ కోసం కొత్త విలన్ కోసం చిత్ర యూనిట్ వెతుకుతున్నారు. దీనితో అల్లు అరవింద్ నన్ను రికమండ్ చేశారు. ఠాగూర్ మూవీ తన జీవితాన్నే మార్చేసింది అని షాయాజీ షిండే తెలిపారు. షాయాజీ షిండే జీవితం ఎలా మారింది అంటే తంతే బూరెల బుట్టలో పడ్డట్లు అయింది. అట్టర్ ఫ్లాప్ సినిమాలో నటిస్తూ ఏకంగా మెగాస్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేశారు.

45
భాషతో ఇబ్బందులు
Image Credit : Twitter

భాషతో ఇబ్బందులు

ఠాగూర్ మూవీలో నటిస్తున్నప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నా సమస్యని గుర్తించిన చిరంజీవి, వివి వినాయక్ గారు ఒక అసిస్టెంట్ ని ఇచ్చారు. డైలాగులు నేర్చుకోవడంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ విధంగా కష్టపడి ఠాగూర్ మూవీ పూర్తి చేశాను.

55
ఏకంగా 10 సినిమాల్లో ఛాన్స్
Image Credit : Asianet News

ఏకంగా 10 సినిమాల్లో ఛాన్స్

నా పాత్రకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నారు. అలా చేస్తే నా పాత్ర ఆర్టిఫీషియల్ గా ఉంటుంది. ఎలాగైనా నేనే డబ్బింగ్ చెబుతున్నాను అని చిరంజీవి, వినాయక్ గారిని ఒప్పించా. ఆ విధంగా తొలి సినిమా అయినప్పటికీ తానే డబ్బింగ్ చెప్పినట్లు షాయాజీ షిండే పేర్కొన్నారు. ఠాగూర్ తర్వాత ఓకే ఏడాది 10 సినిమాల్లో ఆఫర్ వచ్చినట్లు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
YouTuber Madhumita: కిలాడీ యూట్యూబర్ మధుమితపై దొంగతనం కేసు.. తెలివిగా మెడలో గొలుసు కొట్టేసింది
Recommended image2
Nana Patekar Net Worth: రూ. 35 నుంచి కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్
Recommended image3
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Related Stories
Recommended image1
OTT: ఓటీటీలోకి రాబోతున్న మలయాళీ థ్రిల్లర్.. చిన్న గొడవతో పెద్ద హంగామా, రఫ్ఫాడించిన నటి
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved