MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: ఓటీటీలోకి రాబోతున్న మలయాళీ థ్రిల్లర్.. చిన్న గొడవతో పెద్ద హంగామా, రఫ్ఫాడించిన నటి

OTT: ఓటీటీలోకి రాబోతున్న మలయాళీ థ్రిల్లర్.. చిన్న గొడవతో పెద్ద హంగామా, రఫ్ఫాడించిన నటి

Aasha OTT Release Date: ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ ‘ఆశ’ అక్టోబర్ 16 నుంచి జీ5లో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 07 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఊర్వశి ‘ఆశ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Image Credit : Asianet News

ఊర్వశి ‘ఆశ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ ‘ఆశ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్
Image Credit : stockPhoto

నాలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్

దర్శకుడు సఫర్ సనాల్ తెరకెక్కించిన ఈ సినిమాకు జీ5 డిజిటల్ హక్కులను దక్కించుకుంది. అక్టోబర్ 16 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానున్న ‘ఆశ’ను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో దక్షిణాది ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత విస్తృతంగా చూసే అవకాశం లభించనుంది.

35
చిన్న ప్రమాదం.. పెద్ద వివాదం
Image Credit : stockPhoto

చిన్న ప్రమాదం.. పెద్ద వివాదం

‘ఆశ’ కథ నర్సరీ నిర్వహిస్తూ జీవించే ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. గతంలో ఎదురైన ఓ చేదు అనుభవం కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆమె తన ఐటీ ఉద్యోగం చేసే కుమార్తె అనఘతో కలిసి ఉంటుంది. ఒకరోజు రాత్రి వీరిద్దరూ ప్రయాణిస్తున్న సమయంలో వారి కారు జీమన్ అనే వ్యక్తి వాహనాన్ని ఢీకొంటుంది. సాధారణంగా పరిష్కరించుకోగలిగే ఈ ఘటన క్రమంగా రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన సమస్యగా మారుతుంది.

45
ఒక్క నిర్ణయంతో మొదలయ్యే మానసిక పోరాటం
Image Credit : stockPhoto

ఒక్క నిర్ణయంతో మొదలయ్యే మానసిక పోరాటం

ప్రమాదం తర్వాత విషయాన్ని అక్కడితో ముగించాలని కొందరు ప్రయత్నించినా, ఆశ మాత్రం పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. రెండు కుటుంబాల మధ్య ప్రతీకారం, మానసిక ఒత్తిడి, భయం, ఘర్షణలు పెరుగుతూ కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఈ పరిణామాలే సినిమాలోని ప్రధాన కథాంశంగా నిలుస్తాయి.

55
ఊర్వశి నటనకు ప్రత్యేక ప్రశంసలు
Image Credit : Saregama Malayalam

ఊర్వశి నటనకు ప్రత్యేక ప్రశంసలు

‘ఆశ’కు ఊర్వశి నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తల్లి పాత్రలో కనిపించిన ఆమె భయం, ఆందోళన, పట్టుదల వంటి భావోద్వేగాలను ఎంతో సహజంగా ఆవిష్కరించారు. జోజు జార్జ్ కూడా బలమైన, కఠినమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఐశ్వర్య లక్ష్మి అనఘ పాత్రలో మెప్పించగా, విజయరాఘవన్ కీలక పాత్రలో కనిపించారు. విభిన్నమైన మానసిక సంఘర్షణతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు నాలుగు భాషల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli-Mayookha: రాజమౌళి అమ్మాయిని దత్తత తీసుకోవడానికి, మయూఖ మూవీకి ఉన్న సంబంధమేంటో తెలుసా?
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Recommended image3
Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved