- Home
- Entertainment
- చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఫ్లాప్ అంటూ అల్లు రామలింగయ్య కామెంట్స్.. మెగాస్టార్ రియాక్షన్ ఇదే
చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఫ్లాప్ అంటూ అల్లు రామలింగయ్య కామెంట్స్.. మెగాస్టార్ రియాక్షన్ ఇదే
చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాన్ని అల్లు రామలింగయ్య ఫ్లాప్ అని కామెంట్స్ చేశారు. మావయ్య కామెంట్స్ తో చిరంజీవికి షాక్ తప్పలేదు. అసలు ఆయన అలా ఎందుకు అన్నారో ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి స్టేట్ రౌడీ మూవీ
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన సౌండ్ బాలీవుడ్ వరకు వినిపించేది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి చిత్రాలతో చిరంజీవి అమితాబచ్చన్ కి కాంపిటీషన్ గా మారారు అంటూ అప్పట్లో పలు మ్యాగజైన్లు కథనాలు ప్రచురించేవి. బాలీవుడ్ వాళ్లు చిరంజీవి గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టింది స్టేట్ రౌడీ చిత్రం నుంచే. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన స్టేట్ రౌడీ చిత్రం 1989లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.
టి సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో..
ఈ చిత్రం లో భానుప్రియ, రాధా హీరోయిన్లుగా నటించారు. టి సుబ్బిరామిరెడ్డి, శశిభూషణ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే చిరంజీవి తన తదుపరి చిత్రం కొండవీటి దొంగ షూటింగ్ తో బిజీ అయిపోయారు. కొండవీటి దొంగ షూటింగ్ తలకోనలో జరుగుతోంది. ఆ సమయంలో అల్లు రామలింగయ్య స్టేట్ రౌడీ మూవీ గురించి చేసిన వ్యాఖ్యలను పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
చిరంజీవి సినిమా ఫ్లాప్ అంటూ అల్లు రామలింగయ్య కామెంట్స్
అప్పటికి స్టేట్ రౌడీ మూవీ రిలీజై వారం మాత్రమే అయింది. అల్లు రామలింగయ్య కొండవీటి దొంగ షూటింగ్ కి రాగానే స్టేట్ రౌడీ పోయింది.. స్టేట్ రౌడీ మూవీ ప్లాప్ అని అంటూ వచ్చారు. మావయ్య ఏంటి ఇలా అంటున్నారు అని చిరంజీవి ఆశ్చర్యానికి గురయ్యారు. చిరంజీవితో పాటు తాము ఆశ్చర్యపోయినట్లు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వెంటనే నిర్మాత శిశు భూషణ్ అక్కడికి వచ్చారు. స్టేట్ రౌడీ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా వెళుతోంది అంటూ ఆయన చిరంజీవికి కలెక్షన్ల వివరాలు చెప్పారట.
తప్పులో కాలేసిన అల్లు రామలింగయ్య
దీంతో చిరంజీవి మామయ్య అల్లు రామలింగయ్య వంక అదోలా చూస్తూ ఫ్లాప్ అని చెప్పారు మీకు అనేలా రియాక్షన్ ఇచ్చారు. పక్కన ఉన్న వాళ్లు కూడా మీకు ఈ సినిమా ఫ్లాప్ అని ఎవరు చెప్పారు అని అల్లు రామలింగయ్యని ప్రశ్నించారట. అల్లు రామలింగయ్య బదులిస్తూ.. ఏమో నాకేం తెలుసు అందరూ ఫ్లాప్ అంటున్నారు నేను కూడా అన్నాను అని అన్నారట.
తొలివారం ఫ్లాప్ టాక్
వాస్తవానికి స్టేట్ రౌడీ చిత్రానికి తొలి వారం ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టించింది. రెండో వారం నుంచి ఫ్లాప్ టాక్ పూర్తిగా పోయి సినిమా సూపర్ హిట్ అయింది అని పరుచూరి తెలిపారు. స్టేట్ రౌడీ మూవీ వసూళ్లు చూసి బాలీవుడ్ వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచే చిరంజీవిని అమితాబచ్చన్ తో పోల్చడం మొదలుపెట్టారు. ఏడాది పాటు ఆడిన వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్రానికి కూడా తొలి వారం ఫ్లాప్ టాక్ వచ్చిందని పరుచూరి తెలిపారు.