- Home
- Entertainment
- Prabhas: ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా
Prabhas: ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా
ప్రభాస్ పై కామెంట్స్ చేస్తూ క్రేజీ డైరెక్టర్ కుమార్తె ఓ బ్యూటిఫుల్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ కూతురు ఎవరో ఈ కథనంలో తెలుసుకోండి.

ప్రభాస్ రాజాసాబ్ మూవీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్ బాహుబలి, కల్కి, సలార్ లాంటి అద్భుతమైన పాన్ ఇండియా చిత్రాల్లో నటించారు. కానీ ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ చూసి చాలా ఏళ్ళు గడిచిపోతోంది.
డార్లింగ్ తర్వాత ఇదే
చివరగా డార్లింగ్ చిత్రంలోనే ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ ని అభిమానులు ఎంజాయ్ చేశారు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో రాజా సాబ్ చిత్రంలో వినోదం అందించబోతున్నారు. పండగ సీజన్ లో ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది.
డైరెక్టర్ కూతురు పోస్ట్ వైరల్
మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం తెరకెక్కుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. డైరెక్టర్ మారుతి కుమార్తె హియా దాసరి ప్రభాస్ తో మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది. ఆ దృశ్యాలని హియా స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ప్రభాస్ పై కామెంట్స్
ప్రభాస్ కూర్చుని ఉండగా వెనుక నుంచి వచ్చిన హియా అతడిని పలకరించింది. దీనితో ప్రభాస్ తో అంతే ప్రేమగా మారుతి డాటర్ ని రిసీవ్ చేసుకుని మాట్లాడారు. ఈ అందమైన దృశ్యాలని అభిమానులు వైరల్ చేస్తున్నారు. హియా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. హీరో గారు.. మీరు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ పోస్ట్ చేసింది.
రాజాసాబ్ హీరోయిన్లు
తన కుమార్తె పోస్ట్ పై మారుతి కూడా రియాక్ట్ అయ్యారు. లవ్ ఎమోజీలు పెట్టారు. నిధి అగర్వాల్ కూడా రియాక్ట్ అయింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

