- Home
- Entertainment
- `కూలీ` మూవీపై లోకేష్ కనగరాజ్ రివ్యూ.. ఫస్టాఫ్‌లో డ్రామా, ఎమోషన్స్.. సెకండాఫ్‌లో రజనీ విశ్వరూపం
`కూలీ` మూవీపై లోకేష్ కనగరాజ్ రివ్యూ.. ఫస్టాఫ్‌లో డ్రామా, ఎమోషన్స్.. సెకండాఫ్‌లో రజనీ విశ్వరూపం
రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న `కూలీ` సినిమాపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన మార్క్ రివ్యూ ఇచ్చారు. ఫస్టాఫ్ ఎలా ఉంటుందో, సెకండాఫ్‌లో హైలైట్స్ ఏంటో వెల్లడించారు.

భారీ కాస్టింగ్‌తో `కూలీ` మూవీ
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న మూవీ `కూలీ`. అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీని రూపొందిస్తున్నారు.
ఇందులో రజనీకాంత్‌తోపాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. `మోనికా` అంటూ ఆమె పెద్ద రచ్చ లేపింది. ఈ మూవీ వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
`కూలీ` సినిమాపై హైప్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్
ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాపై మరింత హైప్ ఇచ్చారు.
ఈ క్రమంలో తాజాగా ఆయన `కూలీ` సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. సింపుల్‌గా హైలైట్స్ లీక్ చేశారు లోకేష్. రజనీకాంత్ గురించి ఒక రేంజ్‌లో హైప్ ఇచ్చారు. ఈ మూవీలో తాను చాలా కొత్త టెక్నిక్స్ ని ఉపయోగించారట.
రజనీ కి లుక్ పరంగానూ చాలా కసరత్తుల చేశారట. కానీ ఏం చేసినా ఇది రజనీ సార్ మూవీ అని, ఆయన ఎలా కనిపించాలో అలానే కనిపిస్తారని, ఏం చేసినా దాన్ని డామినేట్ చేస్తారని తెలిపారు లోకేష్.
`కూలీ` సినిమాపై లోకేష్ కనగరాజ్ రివ్యూ
రజనీసార్ మూవీ కావడంతో స్క్రిప్ట్ పరంగా ఏదైనా రాసుకోవచ్చు అని, ఆయన లార్జర్ దెన్ లైఫ్ పర్సన్ అని, ఎంత స్వేచ్ఛగా రాసుకున్నా ఆయనకు సూట్ అవుతుందని చెప్పారు.
దీంతోపాటు సినిమాలోని హైలైట్ పాయింట్స్ ని లీక్ చేశారు లోకేష్ కనగరాజ్. తనదైన స్టయిల్‌లో ఆయన ఈ మూవీకి హైప్ ఇచ్చారు. ఫస్టాఫ్ అంతా డ్రామా ప్రధానంగా సాగుతుందట.
అదే సమయంలో ఎమోషనల్‌గా ఉంటుందట. అక్కడక్కడ యాక్షన్ సీన్లు కూడా ఉంటాయని చెప్పారు లోకేష్. సింపుల్‌గా ఫస్టాఫ్ అంతా ఎమోషనల్ డ్రామా అని వెల్లడించారు.
`కూలీ` సెకండాఫ్‌లో రజనీ రచ్చ వేరే లెవల్
`కూలీ` సెకండాఫ్‌లో అసలు రచ్చ ఉండబోతుందట. ద్వితీయార్థం మొత్తం హై ఆక్టానే యాక్షన్ ఉంటుందన్నారు. పూర్తి యాక్షన్ ప్రధానంగా సినిమా సాగుతుందన్నారు.
ఇందులో రజనీకాంత్ మార్క్ స్టయిల్, యాక్షన్ ఉంటుందని, అది వేరే లెవల్‌లో ఉంటుందని, రజనీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుందని వెల్లడించారు. ఆయన్ని గతంలో ఎప్పుడూ ఇలా చూసి ఉండరని చెప్పారు.
`ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు లోకేష్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వెయ్యి కోట్ల కలెక్షన్లు టార్గెట్ చేసిన `కూలీ` టీమ్
`కూలీ` సినిమా కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ రెండేళ్లు కష్టపడ్డారట. ఈ రెండేళ్లు కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోలేదట. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇందులో నిమగ్నమైనట్టు తెలిపారు. తపస్సులా పనిచేసినట్టు చెప్పారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ `కూలీ` ఆగస్ట్ 14న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. భారీ కాస్టింగ్‌తో రూపొందిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మేకర్స్ వెయ్యి కోట్ల కలెక్షన్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి. ఈ మూవీని తెలుగులో ఏసియన్ సునీల్ రిలీజ్ చేస్తున్నారు.
సుమారు రూ.50కోట్లకి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. అంటే వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తే తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అని చెప్పొచ్చు.