హరిహర వీరమల్లు సినిమాపై ఎట్టకేలకు స్పందించిన క్రిష్, ఇంతకీ ఏమన్నాడంటే?
ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమాపై స్పందించాడు ఈ సినిమా మాజీ డైరెక్టర్ క్రిష్. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈసినిమా గురించి ఏమన్నారంటే?
- FB
- TW
- Linkdin
Follow Us

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మొదటి సారిగా భారీ హిస్టారికల్ డ్రామా కథతో సినిమా రాబోతోంది. దాంతో ఈ కొత్త అనుభూతి కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో పవన్ అభిమానుల కోసం భారీ ట్రీట్ రాబోతోంది. మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
క్రిష్ స్టార్ట్ చేసిన సినిమాను కంప్లీట్ చేసిన జ్యోతి కృష్ణ
ఈ సినిమాను ముందుగా స్టార్ట్ చేసింది డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. పవన్ కళ్యాణ్ తో పక్కాగా ఈ సినిమాను ప్లాన్ చేసి.. చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. 75 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిపోవడంతో ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పెండింగ్ పడ్డాయి.
దాంతో చాలా కాలం వెయిట్ చేసిన క్రిష్.. ఈ మూవీ నుంచి తప్పుకున్నారు.ఇక యంగ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈమూవీని తీసుకుని కంప్లీట్ చేశారు అయితే క్రిష్ ఎప్పుడైతే బయటకి వచ్చారో అక్కడ నుంచి సైలెంట్ గానే ఉన్నారు. తన పనులు తాను చేసుకున్నారు. ఇప్పుడు రిలీజ్ దగ్గరకి వచ్చినప్పటికీ తన నుంచి మౌనమే ఉండేసరికి అసలు తాను స్పందిస్తారా లేదా అనే డౌట్ అందరిలో కలిగింది. కాని
హరిహర వీరమల్లు సినిమాపై స్పందించిన క్రిష్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది హరిహరవీరమల్లు సినిమా గురించి క్రిష్ ఒక్క సారి అయినా మాట్లాడకుండా ఉంటారా అని అంతా ఎదురు చూస్తున్న టైమ్ లో ఎట్టకేలకు ఫైనల్ గా క్రిష్ వీరమల్లు సినిమాపై స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన ఏమన్నారంటే? '' ఇప్పుడు వీరమల్లు ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. కానీ నిశ్శబ్దంగా కాదు ఈ సినిమాకి ఇద్దరు లెజెండ్స్ ఫ్యాషనేటెడ్ జర్నీతో వస్తుంది ఏ ఎం రత్నం అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికీ నా సిన్సియర్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. ఈ చిత్రం చేయడం నా కెరీర్ లోనే ఒక ఉద్వేగభరితమైన యుద్ధాల్లో ఒకటి''. అని ట్వీట్ చేశారు క్రిష్.
అంతే కాదు కేవలం దర్శకునిగా మాత్రమే కాకుండా మర్చిపోయిన చరిత్రని అన్వేషించే వ్యక్తిగా కొన్ని నమ్మలేని నిజాల్ని వెతకడంలో అన్నింటికీ మించి వినోదాన్ని , జ్ఞానాన్ని ఒకేసారి అందించే సినిమాపై నమ్మకం ఉన్న వ్యక్తిగా అని క్రిష్ తెలిపారు. దాంతో ఎట్టకేలకి వీరమల్లుపై క్రిష్ స్పందన సర్ప్రైజింగ్ గా అనిపించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా
రిలీజ్ కు రెడీగా ఉంది హరిహర వీరమల్లు’ సినిమా. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా టీమ్ ప్రమోషన్స్ ను జోరుగా కొనసాగిస్తుండగా.. రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేవారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా వచ్చింది. ఇక తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు.
దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, 17వ శతాబ్దం నాటి మొఘల్, కుతుబ్ షాహీ పరిపాలన నేపథ్యంగా సాగనుంది. పవన్ ఈ సినిమాలో చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈమూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పవన్ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందిన హరిహరవీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. పవన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా హరిహర వీరమల్లు నిలవనుంది. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈసినిమా భారీ అంచానాల నడుమ ఈనెల 24న ప్రపంచ వ్యాప్తగా విడుదల కాబోతోంది. ఇక ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈసినిమాకు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం ఏ.దయాకర్ రావు తో కలిసి నిర్మించారు.