- Home
- Entertainment
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక ఓ స్టార్ హీరో వెనక్కి వెళ్లిపోయారట. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఆ వివరాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

పవన్ నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రస్తుతం సినిమాలు, రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చివరగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. వచ్చే ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం నుంచి దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ రిలీజ్ చేయగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది.
పవన్ కళ్యాణ్ క్రేజ్
పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా పోస్టర్ కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ని తొలిప్రేమ చిత్రం నుంచి యూత్ ఫాలో కావడం ప్రారంభించారు. తొలి ప్రేమ తర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడడంతో పవన్ క్రేజ్ పీక్ కి వెళ్ళింది.
బీవీఎస్ రవి కామెంట్స్
దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరు చెప్పను కానీ ఓ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ఇలా అన్నారు. బద్రి సినిమా రిలీజ్ టైంలో కొంతమంది హీరోల సినిమాలు థియేటర్స్ లో ప్రదర్శించబడుతున్నాయి. ఆ హీరో సినిమా కూడా ఆడుతోంది.
బద్రి పోస్టర్ చూడలేకపోయిన స్టార్ హీరో
బద్రి రిలీజ్ కి ముందు ఆ చిత్ర పోస్టర్ ఒకే ఒక్కటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వేశారట. ఆ ఒక్క పోస్టర్ చూసేందుకు జనాలు గుమిగూడారు. భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. మా సినిమా పోస్టర్లు, హోర్డింగ్స్ హైదరాబాద్ మొత్తం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. పవన్ బద్రి పోస్టర్ చూడడానికి నేను కూడా ట్రై చేశా. కానీ ఆ జనాల్లో కుదరక వెనక్కి వచ్చేశా. అది ఎవరూ మ్యాచ్ చేయలేని క్రేజ్ అని సదరు హీరో అభిప్రాయపడ్డారట.
సూపర్ హిట్ అయిన బద్రి
బద్రి చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలోనే పవన్, రేణు దేశాయ్ తొలిసారి నటించారు. రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బద్రి చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో పవన్ యాటిట్యూడ్, స్టైల్ అభిమానుల కి విపరీతంగా నచ్చేశాయి.

