శోభన్ బాబు ఆస్తులు ఆ హీరోయిన్ కి చెందినవేనా.. డబ్బు విషయంలో అతి జాగ్రత్త నిజమేనా ?
హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు ఆస్తులు సంపాదించడంలో కూడా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఒకప్పుడు శోభన్ బాబుకి చెన్నైలో వేల కోట్ల ఆస్తులు ఉండేవి.

లెజెండ్రీ నటుడు శోభన్ బాబు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు. ఆయన్ని అభిమానులు ముద్దుగా సోగ్గాడు అని పిలిచేవారు. అప్పట్లో టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటే ముందుగా అందరికీ శోభన్ బాబు గుర్తొచ్చేవారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శోభన్ బాబుకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు ఆస్తులు సంపాదించడంలో కూడా తన ప్రత్యేకత చాటుకున్నారు.
ఒకప్పుడు శోభన్ బాబుకి చెన్నైలో వేల కోట్ల ఆస్తులు ఉండేవి. హీరోగా పాపులారిటీ వచ్చిన తర్వాత ఒక్కో సినిమాలో నటించడం వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కానీ, ల్యాండ్ కానీ కొనేయడం చేసేవారు. శోభన్ బాబు అప్పట్లోనే ఎంతో ముందు చూపుతో ఆలోచించేవారట. ఈ భూమిపైన 71 శాతం నీరు 29 శాతం మాత్రమే ల్యాండ్ ఉంది. భవిష్యత్తులో ల్యాండ్ కి విపరీతమైన ధర పెరుగుతుంది అని ఆయన గ్రహించారు. అందుకే భూములు కొనడంపై ఎక్కువగా ఆసక్తి చూపేవారు.
అయితే అప్పట్లో శోభన్ బాబు జయలలిత మధ్య చాలా కాలం ఎఫైర్ సాగింది. ఇద్దరూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండేవారు. తనకి అప్పటికే పెళ్లైనప్పటికీ శోభన్ బాబు జయలలిత ప్రేమలో పడ్డారు. అయితే అప్పట్లో శోభన్ బాబు సంపాదించిన ఆస్తులు ఎక్కువ భాగం జయలలిత నుంచి వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. సీనియర్ డైరెక్టర్ ఎన్ హరిచంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో ఆ ప్రచారాన్ని ఖండించారు.
శోభన్ బాబు సంపాదించిన ప్రతి ఒక్క ఆస్తి ఆయన కష్టార్జితమే. ఎవ్వరి నుంచి ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించేవారు కాదు. జయలలిత శోభన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు చూపుకున్నారు. అది నిజమే కానీ ఒకరి ఆస్తులు విషయంలో మరొకరు జోక్యం చేసుకున్నది ఎప్పుడూ లేదు. ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉండేవి.
కానీ జయలలిత కారణంగా శోభన్ బాబు తన ఆస్తుల్ని భద్రపరచుకోగలిగారు అని హరిశ్చంద్ర రావు తెలిపారు. అంతేకానీ జయలలిత ఆస్తులపై శోభన్ బాబు ఎప్పుడు కక్కుర్తి పడలేదు. కానీ తాను సంపాదించిన డబ్బు ఆస్తులు విషయంలో అతి జాగ్రత్త ప్రదర్శించే వారు. దానికి బలమైన కారణం ఉంది. కెరీర్ బిగినింగ్ లో శోభన్ బాబు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పటికే పెళ్లయింది.. భార్యను పోషించడం కూడా కష్టమయ్యేది. మొదటగా కొంత గుర్తింపు వచ్చిన తర్వాత కూడా నాలుగేళ్లు శోభన్ బాబుకి అవకాశాలు రాలేదు. ఆ టైంలో ఒక పూట మాత్రమే తిని జీవనం సాగించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ కష్టాల వల్లే శోభన్ బాబు ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకున్నట్లు హరిశ్చంద్ర రావు తెలిపారు.