- Home
- Entertainment
- Ram Charan New films: రామ్ చరణ్ రెండు ఊహించని కాంబినేషన్స్.. మైథలాజికల్ మూవీ కూడా?
Ram Charan New films: రామ్ చరణ్ రెండు ఊహించని కాంబినేషన్స్.. మైథలాజికల్ మూవీ కూడా?
రామ్ చరణ్ ప్రస్తుతం `ఆర్‌సీ16` మూవీ షూటింగ్‌లో ఉన్నారు. సుకుమార్‌తో సినిమా చేయబోతున్నారు. తాజాగా కొత్తగా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు సంబంధించిన వార్తలు లీక్ అయ్యాయి.

ram charan new films
రామ్ చరణ్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం ఓ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఇక కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రోజుకోటి బయటకు వస్తూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. పలు క్రేజీ దర్శకులతో ఆయన సినిమాలు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ram charan new films
సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నట్టు రూమర్స్ వినిపించాయి. ఈ కాంబోకి సంబంధించిన వార్త బలంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో `ఆర్‌సీ16` మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.
అనంతరం సందీప్‌రెడ్డి వంగాతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. టీమ్ మాత్రం బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలే ఫైనల్ అయ్యాయని, మిగిలినవన్నీ రూమర్స్అని చెప్పారు.
Ram Charan RC 16
కానీ ఇప్పుడు మరో ఎవరూ ఊహించని, ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ కాబోతుందని తెలుస్తుంది. నాని దర్శకుడితో చరణ్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నానికి `హాయ్ నాన్న` వంటి డీసెంట్ హిట్‌ని అందించిన శౌర్యవ్ ఇటీవల చరణ్‌కి కథ చెప్పారట.
ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, స్క్రిప్ట్ విషయంలో చరణ్ ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. అన్నీ కుదిరితే, ఈ కాంబోలో సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ram charan new films
అదే కాదు మరో సంచలన ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయిట. నిఖిల్ నాగేష్ భట్ దర్శకత్వంలో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయట. ఇది మైథలాజికల్ మూవీ అని, ఓ పవర్‌ఫుల్ రోల్ ఆధారంగా దీన్ని తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తుంది.
మధు మంతెన ఈ మూవీని నిర్మించే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్‌తో భారీ స్కేల్‌లో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ టాక్స్ కి సంబంధించి బిగినింగ్ స్టేజ్‌లో ఉందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.
ram charan new films
ఇక రామ్ చరణ్ నటిస్తున్న `ఆర్‌సీ16` ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శివ రాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఆయన స్పోర్ట్స్ ట్రైనర్‌గా కనిపిస్తారట. క్రికెట్, కబడ్డీ నేపథ్యంలో సినిమా సాగుతుందని, రెండు స్పోర్ట్స్ వచ్చేలా టైటిల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఎండింగ్‌లో విడుదల కానుంది.
read more: ఐదు వేలతో స్టార్ట్ చేసి, ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన హీరోయిన్, ఆమె ఉంటే సినిమా హిట్టే !
also read: `మెగా`బంధం తెంచుకున్నట్టేనా? రామ్ చరణ్ విషయంలో మరోసారి దొరికిపోయిన అల్లు అరవింద్