- Home
- Entertainment
- Dhurandhar 30 Days Collections: జవాన్ రికార్డులు బ్రేక్ చేసిన ధురంధర్.. బాలీవుడ్‌లో నెం 1.. కలెక్షన్లు ఎంతంటే?
Dhurandhar 30 Days Collections: జవాన్ రికార్డులు బ్రేక్ చేసిన ధురంధర్.. బాలీవుడ్‌లో నెం 1.. కలెక్షన్లు ఎంతంటే?
Dhurandhar 30 Days Collections: బాక్సాఫీస్ వద్ద స్పై యాక్షన్ డ్రామా 'ధురంధర్` 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 30 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో రూ.800 కోట్లకు పైగా సంపాదించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.

బాక్సాఫీసుని షేక్ చేస్తోన్న `ధురంధర్`
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన `ధురంధర్` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. అదిత్య ధార్ రూపొందించిన ఈ మూవీ విడుదలై నెల రోజులు అవుతున్నా, బాక్సాఫీసు వద్ద జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ స్టడీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన ఈ మూవీ ఇప్పుడు సరికొత్త సంచలనం దిశగా వెళ్తోంది. ఇప్పటికీ డబుల్ డిజిట్ నెంబర్ కలెక్షన్లు వస్తుండటం విశేషం.
30 రోజుల్లో 'దురందర్' మొత్తం కలెక్షన్?
`ధురంధర్` మూవీ 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 30వ(శనివారం) రోజు కూడా పది కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. రాత్రి 9గంటలకు వరకు ఈ లెక్క. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1200కోట్లు దాటింది. ఇండియాలోనే ఈ మూవీ ఏకంగా రూ.800కోట్లు దాటడం విశేషం. 29వ రోజుకి రూ.794కోట్లు రాగా, 30వ రోజుకి రూ.804కోట్లు వసూలు చేసింది.
`జవాన్` లైఫ్ టైమ్ వసూళ్లని బ్రేక్ చేసిన `ధురంధర్`
`ధురంధర్` మూవీ ఇప్పుడు సరికొత్త సంచలనం సృష్టించింది. ఇండియా కలెక్షన్ల పరంగా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది `జవాన్` వసూళ్లని బ్రేక్ చేసింది. లైఫ్ టైమ్ వసూళ్లతోపాటు, ఇండియా వసూళ్ల పరంగానూ షారూఖ్ ఖాన్ `జవాన్`ని దాటేసింది `ధురంధర్`. ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా `జవాన్` నిలిచింది. ఆ రికార్డులను రణ్‌వీర్ సింగ్ మూవీ బద్దలు కొట్టడం విశేషం. `జవాన్` కి ఇండియాలో రూ.761కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.1150కోట్లు వచ్చాయి.
ఇండియాలో హైయ్యెస్ట్ కలెక్ట్ చేసిన నాల్గో మూవీ `ధురంధర్`
బాలీవుడ్ సినిమాల అన్ని రికార్డులను బ్రేక్ చేసిన `ధురంధర్` ఇప్పుడు ఇండియా వైడ్‌గా అన్ని భాషల చిత్రాలతో పోల్చితే అత్యధిక వసూళ్లని రాబట్టిన నాల్గో మూవీగా నిలిచింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రాలుగా `బాహుబలి 2`, `పుష్ప 2`, `కేజీఎఫ్ 2` ఉన్నాయి. వీటి తర్వాత నాల్గో స్థానంలో ఇప్పుడు `ధురంధర్` చేరింది. మున్ముందు ఇది `కేజీఎఫ్` రికార్డులు కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇంతటి సంచలనంగా మారిన ఈ మూవీ కేవలం రూ.225 కోట్ల బడ్జెట్‌తో రూపొందడం విశేషం.

