- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయానికి షాకిచ్చిన ధరణి.. రిషీనే తన ప్రాబ్లెమ్ అని చెప్పిన వసుధర!
Guppedantha Manasu: దేవయానికి షాకిచ్చిన ధరణి.. రిషీనే తన ప్రాబ్లెమ్ అని చెప్పిన వసుధర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్నటువంటి సీరియల్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu). ఇక ఈ సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

రిషి షార్ట్ ఫిలిం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయినందుకు తన సంతోషాన్ని మహేంద్రతో పంచుకుంటాడు. ఈలోపు ఫణీంద్ర ప్రివ్యూ ఎప్పుడో చెప్తే మినిస్టర్ గారిని పిలుద్దాం అంటాడు. రిషి ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది అది అయిపోగానే పిలుద్దాం అంటాడు. ఇక ధరణి దేవయాని కోసం వాటర్ బాటిల్ ను చేతిలో పట్టుకొని ఉంటుంది.
రిషి సంతోషాన్ని చూసిన ధరణి ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడే నిలబడి ఉంటుంది. ఇక వాటర్ బాటిల్ ఇవ్వాలని గుర్తుచేసుకొని దేవయాని దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ ఇస్తుంది. దేవయాని బయట రిషి గొంతు ఉత్సాహంగా వినిపిస్తుంది ఏమైంది అని అడుగుతుంది.
ధరణి అది కాలేజ్ విషయం అత్తయ్య గారు మనకు సంబంధం లేనిది అంటుంది.దేవయాని ఎందుకు సంబంధం లేదు కాలేజ్ మనదే కదా అని తిట్టి పంపిస్తుంది. ఇక వసుధార నిద్రపోకుండా రిషి తనతో తీసుకున్న ఫొటోలను చూస్తూ ఉంటుంది.
రిషి గురించి ఆలోచిస్తూ ఎందుకు రిషి సార్ గురించి ఆలోచిస్తున్నాను అంటూ సాకులు వెతుక్కుంటూ ఉంటుంది. ఇక రిషి కూడా అచ్చం వసుధారా లాగానే ఆలోచిస్తూ ఉంటాడు. రిషి మెసేజ్ చేయాలా వద్దా అనుకుంటూ హలో అని మెసేజ్ చేస్తాడు రిషి నుంచి మెసేజ్ రావడంతో చాలా సంతోష పడుతూ ఉంటుంది వసుధర.
మీకు షార్ట్ ఫిలిం నచ్చిందా సార్ అని అడుగుతుంది అవును నేను నీకు థాంక్స్ కాదు స్పెషల్ థాంక్స్ చెప్తాను అంటాడు. వసుధార గతంలో స్పెషల్ థాంక్స్ అంటూ రిషి తనని హత్తుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. వసుధర నాకు స్పెషల్ థాంక్స్ నాకు వద్దు సార్ అని అది ఎందుకో మీకు అర్థమైతే చాలు అంటుంది.
రిషి షార్ట్ ఫిలిం పూర్తయ్యాక దాని గురించి మాట్లాడదాం అంటాడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని రిషి గుడ్ నైట్ అని చెప్తాడు. గుడ్ నైట్ మెసేజ్ చూసిన వసుధార చాలా డిసప్పాయింట్ అవుతుంది. వసుధార నిద్ర పోతూ ఉండగా రిషి పిలుస్తున్నట్టు కల కంటుంది. దాంతో ఏంటి నాకు ఇలా అవుతుంది అని రిషి తనకిచ్చిన నెమలి ఈకను చూస్తూ ఉంటుంది.
ఇక రిషి కూడా వసుధార లాగానే నిద్ర నుంచి మేల్కొంటాడు. రిషి జగతితో వాళ్ల ఇంటిలో గడిపిన క్షణాలు గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక వసుధారాకు ఫోన్ చేయాలని అనుకుంటాడు కానీ ఈ టైంలో వసుధారకు ఫోన్ చేయడం మంచిది కాదని వసుధారాతో జ్ఞాపకాలను మాత్రమే పంచుకోవాలి బాధను కాదు అని ఫోన్ పక్కన పెట్టి పడుకుంటాడు.
జగతి వంట గదిలో నిలబడి కూరగాయలు కోస్తు ఉంటుంది. మినిస్టర్ పి ఏ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మినిస్టర్ షార్ట్ ఫిలిం చూడాలని అనుకుంటున్నారు డేట్,టైం చెప్పమని అడుగుతాడు. జగతి కూడా అలాగే సార్ అని అంటుంది. వసుధారా షార్ట్ ఫిలిం బాగా వచ్చిందో లేదో అని కంగారు పడుతూ ఉంటుంది. నీ మీద నీకు నమ్మకం ఉండాలి అంటూ జగతి ధైర్యం చెబుతుంది.
ఇక కాలేజ్ లో వసుధారా,పుష్పాతో మినిస్టర్ గారు ఫోన్ చేసిన విషయం గురించి చెప్తూ ఉంటుంది.
ఇక రిషి కాలేజీకి వస్తాడు రిషి కార్ సౌండ్ వినే వచ్చింది రిషి సార్ అని కనిపెడుతుంది. రిషి మాత్రం వసుధారాను చూసి కూడా ముందుగా తానే పలకరించాలి అని వెళ్ళిపోతాడు రిషి. వసుధారా మాత్రం ఏంటి రిషి సార్ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు అని ఆలోచిస్తూ నిలబడిపోతుంది.
ఇక రిషి ఏంటి పలకరించలేదు అంటూ వెనక్కి తిరిగి వసు అంటు పిలుస్తుండగా,వసుధారా సార్ అంటూ ఒకేసారి చూసుకుంటారు. ఇక రిషి వసుధారా కళ్లు ఎర్రగా ఉండటం చూసి ఏంటి రాత్రి పడుకోలేదా అని అడుగుతాడు. వసుధార సమాధానం చెప్పే లోపు గౌతమ్ అక్కడికి వచ్చి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. రిషి, వసుధర ను క్లాస్ కి వెళ్ళు అని పంపి చేస్తాడు. దాంతో గౌతమ్ ఎందుకు వసుధర ను పంపించావ్ అంటూ కోప్పడతాడు.
వసుధర క్లాస్ లోకి వెళుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. గౌతమ్ కూడా వసుధర వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక రిషి వెనక్కి తిరిగి చూడటం తో వసుధారా క్లాస్ లోకి వెళ్లి పోతుంది. రిషి క్లాస్ చెప్పడానికి వసుధార నోట్ బుక్ ని తీసుకుంటాడు. వసుధార డల్ గా కనిపించడంతో ఏమైంది..?, ఏంటి ప్రాబ్లం..? అని అడుగుతాడు. వసుధర మీరే నా ప్రాబ్లం సార్ అంటుంది. ఇన్ని ట్విస్ట్ లు ఉన్న ఈ సీరియల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాల్సిందే.