Guppedantha Manasu: జగతికే సలహా ఇస్తున్న ధరణి.. మొండిగా ప్రవర్తిస్తున్న వసుధార!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తన అనుకున్న వాళ్లు తనకి నమ్మకద్రోహం చేస్తే భరించలేకపోతున్న ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీరు ఎంత బాధ పడుతున్నారో చిన్న అత్తయ్య కూడా అంతే బాధపడుతున్నారు మావయ్య అని మహేంద్రతో ఉంటుంది ధరణి. నా బాధ వేరు తన బాధ వేరు రిషి ని అందరికీ దూరంగా ఉండాలని రాత రాసింది ఆవిడ. వాడు ఏం పాపం చేశాడని అలా చేసింది అని బాధపడతాడు మహేంద్ర. అక్కడే ఉన్న జగతి నా కడుపుని పుట్టడమే వాడు చేసిన పాపం.
నన్ను ఈ ఇంటికి తీసుకురావటమే వాడు చేసిన నేరం అని జగతి ఇంకా ఏదో మాట్లాడే లోపు ధరణి.. నువ్వు ఎవరి తరఫునా వకాల్తా తీసుకొని మాట్లాడొద్దు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. జగతి బాధపడుతుంది. నేను నిజంగానే తప్పు చేశాను. ఆ రోజు నుంచి మహేంద్ర నాతో మాట్లాడటం మానేశాడు ఎందుకంటే పెద్ద శిక్ష ఏమి ఉంటుంది అంటుంది జగతి.
లేదు చిన్న అత్తయ్య.. చిన్న మామయ్య రిషి బంధం చాలా గొప్పగా ఉండేది. చూసినవాళ్లు అసూయపడేవాళ్లు అలాంటిది రిషి ఒక్కసారిగా దూరం అయ్యేసరికి చిన్న మామయ్య తట్టుకోలేకపోతున్నారు. మీరే ఏదైనా చేసి వాళ్ళిద్దర్నీ కలపండి అంటూ సలహా ఇస్తుంది ధరణి. వెతుకుతూనే ఉన్నాను ధరణి కానీ ప్రయోజనం కనిపించడం లేదు అంటుంది జగతి.
అలా అనకండి అత్తయ్య గట్టిగా ప్రయత్నించండి రిషి వసుధర ఎక్కడున్నారో కనిపెట్టి ఇంటికి తీసుకువస్తే మావయ్య మిమ్మల్ని క్షమిస్తారు లేదంటే మరెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి. మరోవైపు ఎగ్జామ్ ఇన్విజిలేషన్ కి వెళ్తూ ఉంటుంది వసుధార. కేడి గ్యాంగ్ ఉన్న హాల్ కే వెళ్తున్నట్లు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది కొలీగ్.
అదేంటి అలా చెప్తున్నారు అంటుంది వసుధార. వెళ్తే మీకే తెలుస్తుంది అంటుంది కొలీగ్. కన్ఫ్యూజన్ తోనే ఎగ్జామ్ హాల్లోకి అడుగుపెడుతుంది వసుధార. పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయకుండా బొమ్మలు వేస్తూ ఉంటారు కేడీ గ్యాంగ్. ఏం చేస్తున్నారు అంటే పొగరుగా పొంతన లేని సమాధానాలు చెప్తారు.
ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ రూమ్ కి వస్తుంది వసుధార. ఆ కేడి గ్యాంగ్ పరిస్థితి ఏమీ బాగోలేదు వాళ్ల పేరెంట్స్ ని పిలిపించి హెచ్చరించండి అంటుంది. అది కుదరని పని వాళ్ళని వదిలేయండి వాళ్లని మనం ఏమి చేయలేము అంటాడు ప్రిన్సిపల్. అలా ఎలా కుదురుతుంది సార్ మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదంటే చైర్మన్ సార్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయమంటారా అని ముందుగా మాట్లాడుతుంది వసుధార.
నేను చెప్పిన మాట వినండి వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్పి చూస్తాడు ప్రిన్సిపల్. మీరు వాళ్ల మీద యాక్షన్ తీసుకోకపోతే నేను చైర్మన్ గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తాను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఈ మాటలు అన్నీ ప్రిన్సిపల్ కోసం టీ తీసుకువచ్చిన ప్యూన్ వింటాడు. వెళ్లి కేడి గ్యాంగ్ కి చెప్తాడు. ఇంతవరకు మన జోలికి వచ్చిన వాళ్ళు ఈ కాలేజీలో నిలబడింది లేదు కానీ ఎవరూ చైర్మన్ వరకు వెళ్లాలని అనుకోలేదు.
ఈవిడ అనుకుంది అందుకే విషయాన్ని మా నాన్నకి చెప్తాను ఆయనే చూసుకుంటారు అని పొగరుగా మాట్లాడుతాడు కేడి గ్యాంగ్ లో ఒక వ్యక్తి. మరోవైపు వసుధార జగతి తనకి నమ్మకద్రోహం చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు రిషి. తండ్రిని దూరం పెట్టినందుకు మనసులోనే క్షమాపణ అడుగుతాడు. మహేంద్ర కూడా ఈ ఒకసారి క్షమించే ఇంటికి రా. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను అని మనసులో అనుకుంటాడు.
ఇదంతా నీకోసమే చేశాను రిషి కానీ చెప్పలేకపోతున్నాను. నిన్ను పెంచిన పెద్దమ్మ,అన్నయ్య నీ ప్రాణాలు తీయబోయారు అని చెప్తే నువ్వు నమ్మేవాడివా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది జగతి. మేము తప్పు చేశాం సార్. మీ మంచి కోసమే అయినప్పటికీ మీ దగ్గర నిజం దాయటం తప్పే. కానీ అంతకుమించి వేరే దారి మాకు కనిపించలేదు దయచేసి మమ్మల్ని క్షమించండి అని మనసులో అనుకొని బాధపడుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.