Brahmamudi: మళ్లీ తల్లిని మోసం చేసిన స్వప్న.. శివంగిలా మారిన ధాన్యలక్ష్మి!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. మోసం చేసిన వ్యక్తినే గుడ్డిగా నమ్ముతున్న ఒక ప్రేమికురాలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు రాజ్ మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను నీ విషయంలో రాజ్ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. అదే విషయం వెళ్లి అతనిని అడిగితే ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం నువ్వు కలగజేసుకోవద్దు పిన్ని అన్నాడు అని కావ్యకి చెప్పి బాధపడుతుంది ధాన్యలక్ష్మి.
ఈ చేతులతో వాడిని పెంచాను నా కొడుకు కన్నా ఎక్కువగా ముద్దు చేశాను ఈరోజు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్ కి వెళ్ళిపోయాడు అని బాధపడుతుంది ధాన్యలక్ష్మి. ఆయన గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం మీరేమీ మనసులో పెట్టుకోకండి అంటూ ఓదారుస్తుంది కావ్య.
వాడిది చిన్నపిల్లల మనస్తత్వమే కానీ వాడు చిన్న పిల్లవాడు కాదు కదా అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఎందుకు ఈయన కోపంతో అందరినీ దూరం చేసుకుంటున్నారు అని బాధపడుతుంది కావ్య. మరోవైపు ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అవుతుంది స్వప్న. బయటికి వచ్చి చూసేసరికి గుమ్మంలో పని చేసుకుంటూ కనకం కనిపిస్తుంది.
నువ్వు పని చేయటమేంటి లెగు పిండి వంట పని చూసుకో నేను ఈ పని చేస్తాను అని తల్లిని మభ్యపెట్టి లోపలికి పంపిస్తుంది స్వప్న. ఎప్పుడూ లేనిది ఇలాగ ప్రవర్తిస్తుంది అని ముందు అనుమాన పడుతుంది కనకం. కానీ మారిందేమో అని మనసులో అనుకొని వంటగదిలో పని చూసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆమె వంటగదిలోకి వెళ్ళటం గమనించిన స్వప్న మెల్లగా బయటకి జారుకుంటుంది.
మరోవైపు కావ్య పూజ చేసుకుంటూ ఉంటుంది. ఆమె మంత్రాలు చదువుతూ ఉంటే ఆ శబ్దానికి అపర్ణతో సహా ఇంట్లో అందరూ వస్తారు. కావ్యని పూజ గదిలోకి రానిచ్చినందుకు అత్తగారి మీద కోప్పడుతుంది అపర్ణ. మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నేను విలువ ఇచ్చాను. అలాంటప్పుడు నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు కూడా విలువ ఇవ్వాలి కదా.
మీరే విలువ ఇవ్వకపోతే ఇంక ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం విలువ ఇస్తారు అంటూ కోప్పడుతుంది అపర్ణ. ఇలా అయిందానికి కాని దానికి మీరు మొండితనం చూపిస్తే ఇంక ఇంట్లో కావ్యకి విలువ ఏం ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజగది అయినా వంటగది అయినా పడకగదైనా ఏదైనా ఒకటే. మీ అలుసు చూసుకునే ఇంట్లోంచి బయటికి పంపించేయాలని చూస్తున్నారు అంటూ రాజ్ వైపు కోపంగా చూస్తుంది ధాన్యలక్ష్మి.
ఇకనైనా మనసులు మార్చుకోండి మీకు మీ కొడుక్కి పెద్ద నమస్కారం పెడతాను అంటూ శివంగిలాగా ఆవేశంతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ లేనిది ధాన్యలక్ష్మి ఏంటి అలాగా విరుచుకుపడిపోయింది అంటుంది రుద్రాణి. మీరు విలువ ఇవ్వకపోవడం వల్ల ఆఖరికి ధాన్యలక్ష్మి కూడా నన్ను మాటలు అంటుంది చూడండి.
అయినా ఆ అమ్మాయిని మళ్లీ పూజగదిలోకి రానివ్వకండి అంటూ అత్తగారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. అందరూ టిఫిన్లకి కూర్చుంటారు. అప్పటికే రుద్రాణి చెప్పడం వల్ల చట్నీలలో సాల్ట్ కలిపేస్తుంది రేఖ. అది తిన్న రాజ్ తిట్టుకుంటూ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడు. వాడు అసలే బయట ఏమీ తినడు వాడిని పస్తు పెట్టావు అంటూ కావ్యని తిట్టుకుంటూ అపర్ణ కూడా బయటికి వెళ్లిపోతుంది. మీ అత్తగారు తిట్టిందని బాధతో ఉండి అలా చేసావా ఎక్కడివి అక్కడే మర్చిపోవాలి అంటుంది చిట్టి. మరోవైపు అప్పు కి టిఫిన్ పెడుతుంది కనకం.
అది తిన్నదా అంటూ స్వప్న గురించి అడుగుతుంది అప్పు. కావాలంటే వేసుకుని తింటుందిలే అంటుంది కనకం. ఉండు పిలుచుకొని వస్తాను అంటూ స్వప్న గదికి వెళుతుంది అప్పు. ముసుగు తన్ని నిద్రపోతున్న స్వప్నని ఇంత టైం అయినా పడుకోవటానికి అదృష్టం ఉండాలి అంటూ స్వప్నని లేపుతుంది. ఎంతకీ లేవకపోవడంతో దుప్పటి తీసేస్తుంది. అక్కడ స్వప్న ఉండదు ఆ స్థానంలో కుషన్ దిండ్లు ఉంటాయి. తల్లిని పిలిచి విషయం చెప్తుంది. దానికి మనల్ని మోసం చేయడం బాగా అలవాటయింది అంటూ కోప్పడుతుంది.అప్పుడు ఇందాక జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది కనకం.
మోసం చేయడం దాని తప్పు కాదు మోసపోవటం మన తప్పే ఇంటికి రానీ దాని సంగతి చెప్తాను అంటూ కోప్పడుతుంది కనకం. తరువాయి భాగంలో రాజ్ కోసం క్యారియర్ తీసుకు వెళుతుంది కావ్య. అది చూసిన రుద్రాణి అట్నుంచి వచ్చేసరికి నీకు మీ అత్తగారికి పెద్ద గిఫ్ట్ రెడీ చేసి ఉంచుతాను అనుకుంటుంది. కొత్త కోడలు కనిపించడం లేదు అంటూ ఇంట్లో అందరికీ చెప్తుంది రుద్రాణి.