MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ తో దర్శకుడిగా సినిమా.. మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్

పవన్ కళ్యాణ్ తో దర్శకుడిగా సినిమా.. మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న కోరికను ధనుష్ వ్యక్తం చేశారు. ధనుష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 16 2025, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ 
Image Credit : Asianet News

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ 

హైదరాబాద్‌లో జరిగిన కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను తాకాయి. ఈ సందర్భంగా తెలుగు సినిమాలపై తన ఆసక్తిని పంచుకున్న ధనుష్, "అవకాశం కలిగితే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలనుంది" అంటూ ప్రకటించాడు. ధనుష్ కామెంట్స్ తో ఆడిటోరియం మొత్తం ఈలలు, కేకలతో మోతెక్కింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ పై ధనుష్ అభిమానం 
Image Credit : Youtube

పవన్ పై ధనుష్ అభిమానం 

పవన్ కళ్యాణ్ పై ధనుష్ తన ఇష్టాన్ని ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ధనుష్ తనకి తెలుగులో ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్నా, నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.

Related Articles

Related image1
నా తండ్రి ముందు నేను సాధించింది పెద్ద లెక్క కాదు, `కుబేర` ఈవెంట్‌లో ధనుష్‌ ఎమోషనల్‌ స్పీచ్‌
Related image2
కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం
35
ముఖ్య అతిథిగా రాజమౌళి
Image Credit : Twitter

ముఖ్య అతిథిగా రాజమౌళి

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం మొత్తం హాజరయ్యింది. ఈ వేడుకకు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ ధనుష్ ని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది.

45
ధనుష్ దర్శకత్వంలో పవన్ 
Image Credit : Asianet News

ధనుష్ దర్శకత్వంలో పవన్ 

తమిళంలో మీరు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అవకాశం వస్తే ఏ హీరోతో సినిమా చేస్తారు అని సుమ ప్రశ్నించగా.. ధనుష్ వెంటనే పవన్ కళ్యాణ్ సార్ తో అని బదులిచ్చారు. ధనుష్ సమాధానంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఒకటో తారీఖు కష్టాలు మీకూ ఉంటాయా అని సుమ ప్రశ్నించింది. ధనుష్ బదులిస్తూ నాక్కూడా ఉంటాయి. మీరు రూ. 150 సంపాదిస్తే 200 సమస్యలు ఉంటాయి. నేను కోటి సంపాదిస్తే 2 కోట్ల సమస్యలు ఉంటాయి అని ధనుష్ తెలిపారు. 

55
తెలుగులో మరిన్ని చిత్రాలు
Image Credit : @pawan kalyan

తెలుగులో మరిన్ని చిత్రాలు

ధనుష్.. పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న కోరిక అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కుబేర కనుక విజయం సాధిస్తే తెలుగులో ధనుష్ నుంచి మరిన్ని చిత్రాలు ఆశించవచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image2
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Recommended image3
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Related Stories
Recommended image1
నా తండ్రి ముందు నేను సాధించింది పెద్ద లెక్క కాదు, `కుబేర` ఈవెంట్‌లో ధనుష్‌ ఎమోషనల్‌ స్పీచ్‌
Recommended image2
కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved