- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయాని షాకింగ్ ప్లాన్.. జగతిని బయటకు పంపడానికి లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చిన మహేంద్ర!
Guppedantha Manasu: దేవయాని షాకింగ్ ప్లాన్.. జగతిని బయటకు పంపడానికి లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చిన మహేంద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వసుధార లైట్ బెలూన్ ఎగర వేస్తూ ఉండగా అక్కడి రిషి (Rishi) కూడా వెళ్తాడు .ఇక ఇద్దరూ కలిసి ఆ బెలూన్ ను ఎగుర వేస్తారు.

ఆ తర్వాత రిషి (Rishi) డ్రెస్ విషయంలో నాకు ఎందుకు అబద్దం చెప్పావు అని వసును అడుగుతాడు. దానికి వసు.. సార్ మీరు ఏ విషయాలను కోపం తెచ్చుకొను అని మాట ఇచ్చారు అని అంటుంది. అందుకే కదా ఏమీ అనలేక పోతున్నాను అని రిషి అంటాడు. ఈ లోపు అక్కడికి గౌతమ్ (Goutham) రానే వస్తాడు.
మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారని గౌతమ్ Goutham) అడుగుతాడు. దానికి రిషి తన స్టైల్లో సమాధానం చెబుతాడు. ఆ తర్వాత రిషి, వసు లు గాలిపటాలు ఎగురవేయడానికి గాలిపటాలు రెడీ చేస్తూ ఉంటారు. ఈ లోపు గౌతమ్ అక్కడికి డిఫరెంట్ గాలిపటం తో వచ్చి తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. ఇక కొంతసేపు రిషి (Rishi), గౌతమ్ ల మధ్య ఫ్రెండ్లీ వార్ జరుగుతుంది.
ఒకవైపు జగతి (Jagathi) ఆ ఇంట్లో అడుగు పెట్టి నందుకు మనసులో ఆనందం పడుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడకు దేవయాని (Devayani ) వచ్చి రిషి దయ వల్ల ఈ ఇంట్లోకి వచ్చి పడ్డావు ఇదే శాశ్వతం అనుకోవద్దు జగతి కి చెబుతుంది. దానికి జగతి ప్రాణమే శాశ్వతం కానప్ప్పుడు ఎవరు ఎవరికి శాశ్వత అని చెబుతుంది.
ఈ క్రమంలో దేవయాని (Devayani) , జగతికి ప్రతి విషయం గురించి చెప్పి జగతి కాన్ఫిడెన్స్ ను దేవయాని బ్రేక్ చేయాలని చూస్తుంది. దానికి జగతి (Jagathi) ఏమాత్రం భయపడకుండా తనదైన స్టైల్లో ఎదురు వాదం వేసుకుంటుంది.
మరోవైపు రిషి (Rishi) , వసు లతో సహా అందరు ఆనందంగా గాలి పటాలు ఎగుర వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అంతా ఫన్నీ చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు దేవయాని (Devayani) రిషితో నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళి పోతాను అని చెబుతుంది.
దానికి రిషి (Rishi) ఎందుకు పెద్దమ్మ అని అడగగా పరాయి వాళ్ళు వచ్చి ఇంట్లో ఉంటే.. ఈ ఇల్లు నాది కాదేమో అని నువ్వు నా కొడుకు కాదేమో అని అనిపిస్తుంది అని కపట ప్రేమ తో ఏడుస్తుంది. ఈ లోపు మహేంద్ర (Mahendra) కూడా జగతి లగేజ్ బ్యాగ్ సర్ది బయటకు తీసుకు వస్తాడు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.